12-5-2026 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గోళ్ళు లేనట్టి సింహము గూల్చెఁ గరిని”
(లేదా...)
“గోళ్ళున్ గోరలు లేని సింహమకటా కూల్చెన్ మదేభమ్మునున్”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
గోళ్ళు లేనట్టి సింహము గూల్చెఁ గరినిచదువు లేనట్టి మూర్ఖుడు శాస్త్రియయ్యెశాససనమెరుగని వాడు సచివుడయ్యెనక్కరైనది లేకనె నలవి యయ్యె
నృసింహావతార నేపథ్యంలో... తేటగీతిఏనుగనుచు తాను చెలఁగి యెక్కడనుచుహరిని పరిహాసమాడి గదను విదిల్చిమోద, స్తంభమందున బుట్టి, మొద్దుగానుగోళ్ళు లేనట్టి సింహము గూల్చెఁ గరినిశార్దూలవిక్రీడితముకళ్లున్నన్ గనువారు లేరు భువి సంకల్పమ్ము లేకుండగన్వేళ్లున్నన్ భజియించు వారలొకొ సర్వేశున్ సభక్త్యాత్ములైకల్లల్జెప్పక చూపుమాహరిననన్ గర్వాంధుడున్, మొద్దుగాగోళ్ళున్ గోరలు లేని సింహమకటా కూల్చెన్ మదేభమ్మునున్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగోళ్ళు లేనట్టి సింహము గూల్చెఁ గరిని
రిప్లయితొలగించండిచదువు లేనట్టి మూర్ఖుడు శాస్త్రియయ్యె
శాససనమెరుగని వాడు సచివుడయ్యె
నక్కరైనది లేకనె నలవి యయ్యె
నృసింహావతార నేపథ్యంలో...
రిప్లయితొలగించండితేటగీతి
ఏనుగనుచు తాను చెలఁగి యెక్కడనుచు
హరిని పరిహాసమాడి గదను విదిల్చి
మోద, స్తంభమందున బుట్టి, మొద్దుగాను
గోళ్ళు లేనట్టి సింహము గూల్చెఁ గరిని
శార్దూలవిక్రీడితము
కళ్లున్నన్ గనువారు లేరు భువి సంకల్పమ్ము లేకుండగన్
వేళ్లున్నన్ భజియించు వారలొకొ సర్వేశున్ సభక్త్యాత్ములై
కల్లల్జెప్పక చూపుమాహరిననన్ గర్వాంధుడున్, మొద్దుగా
గోళ్ళున్ గోరలు లేని సింహమకటా కూల్చెన్ మదేభమ్మునున్!