శా:కాళ్లన్ శక్తియె లేని వాని వలెనే కన్ పించు మన్మోహనుం డూళ్లన్ జుట్టుచు సింహ పౌరుషముతో నొప్పారి యా యెన్నికన్ ద్రుళ్లింతల్ వడ నేన్ గు గుర్తును బడన్ ద్రోసేన్ "భళా సిం!" గనన్ గోళ్ళున్ గోరలు లేని సింహమకటా కూల్చెన్ మదేభమ్మునున్” (మన్మోహన్ సింగ్ ఒక యెన్మికలో ఏనుగు గుర్తు పార్టీని పడగొట్టేసాడు. సింగ్ అంటే సింహము అనే అర్థం.)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగోళ్ళు లేనట్టి సింహము గూల్చెఁ గరిని
రిప్లయితొలగించండిచదువు లేనట్టి మూర్ఖుడు శాస్త్రియయ్యె
శాససనమెరుగని వాడు సచివుడయ్యె
నక్కరైనది లేకనె నలవి యయ్యె
నృసింహావతార నేపథ్యంలో...
రిప్లయితొలగించండితేటగీతి
ఏనుగనుచు తాను చెలఁగి యెక్కడనుచు
హరిని పరిహాసమాడి గదను విదిల్చి
మోద, స్తంభమందున బుట్టి, మొద్దుగాను
గోళ్ళు లేనట్టి సింహము గూల్చెఁ గరిని
శార్దూలవిక్రీడితము
కళ్లున్నన్ గనువారు లేరు భువి సంకల్పమ్ము లేకుండగన్
వేళ్లున్నన్ భజియించు వారలొకొ సర్వేశున్ సభక్త్యాత్ములై
కల్లల్జెప్పక చూపుమాహరిననన్ గర్వాంధుడున్, మొద్దుగా
గోళ్ళున్ గోరలు లేని సింహమకటా కూల్చెన్ మదేభమ్మునున్!
కదన మందు నెదురుగా శిఖండిని గని
రిప్లయితొలగించండివిల్లును విడిచె కాదుటే భీష్ము డప్పు
డంప శయ్యను చేరగా ననియె నొకడు
గోళ్ళు లేనట్టి సింహము గూల్చెఁ గరిని.
వ్రేళ్ళన్ బాణము పైననుంచి కనగా పేడిన్ బురజ్యోతి పై
నీళ్లన్ జల్లిన రీతి భీష్ముడట తా నిట్టూర్పు నే విడ్చు చున్
త్రుళ్ళింతన్ విడి యంప శయ్య పయి తాతూలెన్ గదా గాంచగా
గోళ్ళున్ గోరలు లేని సింహమకటా కూల్చెన్ మదేభమ్మునున్.
గుండియలుదోచి తేజమై వెండితెరను
రిప్లయితొలగించండిజనుల "దళపతి" తానని చాటిచెప్పి
యేళ్ళుగానున్న కోటలఁ గొల్లగొట్టి
గోళ్ళు లేనట్టి సింహము గూల్చెఁ గరిని
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమదగజంబగు నేతకు నెదురు నిల్చి
రిప్లయితొలగించండిగోళ్ళు లేనట్టి సింహమౌ క్రొత్త నేత
గెలిచి చూపెను గాదొకొ కెవ్వుమనుచు
గోళ్ళు లేనట్టి సింహము గూల్చెఁ గరిని!
గోళ్ళున్ గోరలు లేని సింహము సదా కూలంబడున్ వేటలో
లేళ్ళన్ జింకల నైన చంపగలదా లేకున్నచో కోరలే
'గోళ్ళున్ గోరలు లేని సింహమకటా కూల్చెన్ మదేభమ్మునున్'
గోళ్ళున్ గోరలు లేని సింహమనగా కొంగ్రొత్త నేతేగదా
వ్రేళ్ళన్ జూపుచు నెగ్గె నాతడు భళా వేడ్కన్ మదేభమ్ముపై
తే॥గీ
రిప్లయితొలగించండివేటకేగలేక పసిని వెగడునొంది
సాల శిఖలఁ బ్రతీక్షించు జఠర కేశి,
పూని బొబ్బరించ నడలి దాన నీల్గ
గోళ్ళులేనట్టి సింహము గూల్చెఁ గరిని!!
తే.గీ:తండ్రి తో బాటు వేటకు దరలినట్టి
రిప్లయితొలగించండిచిన్న వాడును గొప్పలు చేసె నిట్లు
గోళ్ళు లేనట్టి సింహము గూల్చెఁ, గరిని,
కుంటి దానిని శరము తో గొట్టి మురిసె
శా:కాళ్లన్ శక్తియె లేని వాని వలెనే కన్ పించు మన్మోహనుం
రిప్లయితొలగించండిడూళ్లన్ జుట్టుచు సింహ పౌరుషముతో నొప్పారి యా యెన్నికన్
ద్రుళ్లింతల్ వడ నేన్ గు గుర్తును బడన్ ద్రోసేన్ "భళా సిం!" గనన్
గోళ్ళున్ గోరలు లేని సింహమకటా కూల్చెన్ మదేభమ్మునున్”
(మన్మోహన్ సింగ్ ఒక యెన్మికలో ఏనుగు గుర్తు పార్టీని పడగొట్టేసాడు. సింగ్ అంటే సింహము అనే అర్థం.)
శా॥ నీళ్ళే లేకయె బావి తీర్చు పగిదిన్ నిక్కంబుగా దాహమున్
రిప్లయితొలగించండికాళ్ళే లేని నరుండు పర్వులిడు నాకారంపు చందమ్ముగన్
వేళ్ళున్బాఱక నిల్చి వృద్ధిఁ గనెడిన్ వృక్షంపు పాళమ్ముగన్
గోళ్ళున్ గోరలు లేని సింహమకటా కూల్చెన్ మదేభమ్మునున్
(వ్యంగ్యంగా నండి మొదటి మూడు ఎంత నిజమో చివరిది అంతే నిజమని)
పరువ మందున నుండిన వన చరమ్ము
రిప్లయితొలగించండికాను పించిన గజము పై కసిగ దూకి
కండ పుష్టి ని జూపించి కలుగు మొ ద్దు
గోళ్లు లేనట్టి సింహము గూల్చె గరిని
గోళ్ళున్ గోరలు గావె శస్త్రములుగా గుర్తింత్రు సింహాలకున్
రిప్లయితొలగించండికళ్ళన్జూడఁగ స్వప్నమందయిన సింగమ్మున్ మదేభంబులో
కల్లోలమ్ముదయించు ప్రాణములు సంఘాతమ్మగున్, నిద్రలో
గోళ్ళున్ గోరలు లేని సింహమకటా కూల్చెన్ మదేభమ్మునున్
కరులు తిరుగాడు నడవిలో గిరులవోలె
రిప్లయితొలగించండికరికి కేసరి కలనైన కలత గూర్చు
భయము చాలును హరియింప బ్రాణములను
గోళ్ళు లేనట్టి సింహము గూల్చెఁ గరిని
వీర సింహుండు భీముండు ఘోర మత్త
రిప్లయితొలగించండికరి సుయోధనుం డతి భయంకరుఁడు భీముఁ
డడరి విఱిచెను రారాజు తొడల నాజి
గోళ్లు లేనట్టి సింహము గూల్చెఁ గరిని
విల్లుండన్ నరుఁ దాఁకు వాఁడు కలడే వీరుండు సృష్టింపఁగాఁ
గల్లోలమ్మును సుప్రతీకము వెసన్ గాండీవి పంచాస్యమే
సల్లాపమ్ములు రేఁగ భారత మహా సంగ్రామ మేపారఁగా
గోళ్లున్గోరలు లేని సింహ మకటా కూల్చెన్ మదేభమ్మునున్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
కని శిఖండిని యెదురుగా కదనమందు
భీష్ముని కరము నుంచియె విల్లు జారె
నపుడు నంపశయ్యను జేర ననిరి యిట్లు
గోళ్లు లేనట్టి సింహము గూల్చెఁ గరిని.