25, మే 2026, సోమవారం

సమస్య - 5478

26-5-2026 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పావిత్ర్యమ్ములు వేశ్య నుడులు విజ్ఞాననిధుల్”

(లేదా...)

“పావిత్ర్యమ్ముల్ సుజనానుమోదములగున్ వేశ్యోక్తు లెల్లప్పుడున్”

5 కామెంట్‌లు:


  1. ఆ త్ర్యక్షుని కోవెల పా
    విత్ర్యమ్మని పలుకగ విని వివరిణు డనె పా
    విత్ర్యమ్మన నెరుగక పా
    పావిత్ర్యమ్ములు వేశ్య నుడులు విజ్ఞాననిధుల్.


    ఆ త్ర్యక్షుండకు భక్తుడైన కడు వేశ్యా లోలుడా దేబె పా
    విత్ర్యమ్మందున నుంచు కోవెల ననన్ విద్యా విహీనుండు పా
    విత్ర్యమ్మన్న నదేమిటో యెఱుగకన్ బెండ్లాము తో జెప్పె పా
    విత్ర్యమ్ముల్ సుజనానుమోదములగున్ వేశ్యోక్తు లెల్లప్పుడున్.

    రిప్లయితొలగించండి
  2. ఆత్ర్యక్షుని నమ్మక , స్వా
    తంత్ర్యముగ దలంచ నేడు తనరిన జాలున్
    ఆ త్ర్యం కము లు ; జరుగు ఫా
    పావిత్ర్యమ్ములు వేశ్య నుడులు విజ్ఞాననిధుల్

    రిప్లయితొలగించండి

  3. ఆ త్ర్యక్షుని పూజ కొరకు
    నా త్ర్యక్షుడటంచు వేశ్య యట తన స్తనమే
    యా త్ర్యక్ష రూప మనె, పా
    పావిత్ర్యమ్ములు వేశ్య నుడులు విజ్ఞాననిధుల్.


    ఆ త్ర్యక్షుండకు భక్తుడైన కడు వేశ్యా లోలుడా రోజు నం
    దా త్ర్యక్షార్చన వేళ మీరెనని తానావేదనన్ చెంద గా
    నా త్ర్యక్షుండిదొ నాదు వక్షమని తానాచ్చాదమున్ దీసె, పా
    విత్ర్యమ్ముల్ సుజనానుమోదములగున్ వేశ్యోక్తు లెల్లప్పుడున్.

    రిప్లయితొలగించండి
  4. పిత్ర్యంబైన కలిమి వై
    చిత్ర్యంబనఁ మాయమగును చింతింపంగా
    మైత్ర్యానందములో పా
    విత్ర్యమ్ములు వేశ్య నుడులు విజ్ఞాననిధుల్

    పిత్ర్యంబైన సిరుల్ హరింతురు గదా వేశ్యాంగనల్ మేటి వై
    చిత్ర్యంబే మరి బిల్వమంగళునకున్ జింతామణీ నెయ్యమే
    మైత్ర్యానందముఁ గోరివచ్చు జనులన్ మైకంబులో ముంచ పా
    విత్ర్యమ్ముల్ సుజనానుమోదములగున్ వేశ్యోక్తు లెల్లప్పుడున్

    రిప్లయితొలగించండి