20-7-2026 (సోమవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆపదఁ దొలఁగించువాఁడె యరి యన నొప్పున్”
(లేదా...)
“ఆపదలోన సాయపడునట్టి జనుండె విరోధి యౌనుగా”
హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని గురువులతో.... కందంఆపఁగ హరినామ భజనఁజూపుడు నా సుతునికింక శోకమటన్నన్గాపాడ వచ్చి మేటిగనాపదఁ దొలఁగించువాఁడె యరి యన నొప్పున్ఉత్పలమాలఆపగ పుత్రనిన్ హరికి నర్చనఁ జేసి భజించుటన్నదేచూపఁగ శోకమున్ భటుల సూనునికయ్యెడఁ బంపినంత తానాపుగ నిల్చి సుంతయును హాని ఘటిల్లక వింతవింతఁగానాపదలోన సాయపడునట్టి జనుండె విరోధి యౌనుగా!
కోపము జూపుచు వైరినితాపితినని ప్రజ పొరబడి తలచగ కలిగెన్ నాపత్తు, నాన పడి యాఆపదఁ దొలఁగించువాఁడె యరి యన నొప్పున్
(గయోపాఖ్యానము: గయునికి అర్జునుడు శరణొసగెనని తెలిసి శ్రీకృష్ణుని ఆగ్రహము)కం॥నా పగతుని గాచెదననియాపార్థుడుమాటనిచ్చి యనికని వచ్చెన్-సైపగ తరమే? నా యరి యాపదఁదొలగించువాడె యరి యననొప్పున్!!
త్రోపున చేతికి చిక్కిన నా పరిపంథకుని జేరి యాగడ కాడై గోపనముల జెప్పి పెఱల యాపదఁ దొలఁగించువాఁడె యరి యన నొప్పున్.నీపతి రావణా సురుడు నిగ్రహమున్ విడి సోదరుండనన్ కోపము చూపె నెందుకన కుచ్చితుడౌచు విభీషణుం డటన్ చూపెను పేర్మి రాముడన చోద్యమె కాదె, వివక్షు జేరి తా నాపదలోన సాయపడునట్టి జనుండె విరోధి యౌనుగా.
గోపనమేలేక యరికిఁబ్రాపుగ వర్తిల్లువాడు ప్రత్యర్థులకున్జూపుచు నొద్దిక వైరులకాపదఁ దొలఁగించువాఁడె యరి యన నొప్పున్రోపితమైన వైరముఁ విరోధికి మేలొన గూర్చునైజమున్గోపనమేలయంచు తనకోరిక మేరకు కానివానికిన్బ్రాపుగ నిల్చి యుండి తగు రక్షణ గూర్చుచు వానికండగానాపదలోన సాయపడునట్టి జనుండె విరోధి యౌనుగా
ఉ॥ ఆపద లోన సాయపడు నట్టి జనుండె విరోధి యౌనుగాపాపులు నుగ్రవాదులకపాయముఁ దప్పఁగ కొమ్ముకాయుచున్దాపున నుంచు పోషకుఁడు ద్రవ్యము నిచ్చుచుఁ బ్రోత్సహించుచున్మూఁపున మోసి రక్షఁ గనఁ బొందుగ, లోక రిపుండుఁ గాదొకో(ఉగ్రవాదులు విరోధులైనట్టుగా వారికి ఊతమిచ్చే వారు కూడ లోక విరోధులేనండి)
కం:ఏ పద మెట్లు బలుక వలెనా పద్ధతి బల్కు కొడుక! హరి యన లేవే?ఏ పామరు నాలుక యో"యాపదఁ దొలఁగించువాఁడె యరి" యన నొప్పున్”(కొడుకు "హరి" అన బోయి "అరి" అంటే తండ్రి మందలిస్తున్నాడు. )
ఉ:ఆపద లోన సూచనల నందగ జేతు నటంచు మిత్రమా!ఆ పరుషంపు భాష సుఖమా! అది వీడుక మంచి మాటనేయోపిక తోడ జెప్ప వలదో! పరిభాషయె మోటు దైనచోనాపదలోన సాయపడునట్టి జనుండె విరోధి యౌనుగా”(అప్పద తీర్చే సలహాలే ఇచ్చినా పరుషపదాలతో చెపితే మంచి చెపోఅ వాడే శత్రువు కావటం సహజం.)
ప్రాపుగ నుండెడు మనుజు డె యాపద దొ ల గించు వాడె :: యరి యన నొప్పున్ దాపున జేరియు కీడులనేపుగ గలిగించు వాని నిజ్జ గ మందున్
ఓపిక వహించి యించుకయాపక నిరతమ్ము మిత్రమా విను రేపున్మాపు నడరి పగవారలకాపదఁ దొలఁగించు వాఁడె యరి యన నొప్పున్ పాప మటంచు నెంచకయె వంచకు చందము తోఁప నేరికిం జూపుల కంద కుండఁ బరిశోధన సేసి వినూత్న పద్ధతుల్ కోపము నూని డెందమునఁ గొండొక వ్యక్తికిఁ దన్ను ద్రోయఁగా నాపద లోన సాయపడు నట్టి జనుండె విరోధి యౌనుగా
చూపుచు నెయ్యమున్, చలుపుచున్ సహకారము చిత్తశుద్ధితో కోపమొకింతయున్ గొనక కూర్మిఁ జరించుచు నుండి మించినన్ పాపపు బుద్ధితోడుత నపారపు స్వార్థము గల్గు పోకిరీకాపదలోన సాయపడునట్టి జనుండె విరోధి యౌనుగా
హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని గురువులతో....
రిప్లయితొలగించండికందం
ఆపఁగ హరినామ భజనఁ
జూపుడు నా సుతునికింక శోకమటన్నన్
గాపాడ వచ్చి మేటిగ
నాపదఁ దొలఁగించువాఁడె యరి యన నొప్పున్
ఉత్పలమాల
ఆపగ పుత్రనిన్ హరికి నర్చనఁ జేసి భజించుటన్నదే
చూపఁగ శోకమున్ భటుల సూనునికయ్యెడఁ బంపినంత తా
నాపుగ నిల్చి సుంతయును హాని ఘటిల్లక వింతవింతఁగా
నాపదలోన సాయపడునట్టి జనుండె విరోధి యౌనుగా!
కోపము జూపుచు వైరిని
రిప్లయితొలగించండితాపితినని ప్రజ పొరబడి తలచగ కలిగెన్
నాపత్తు, నాన పడి యా
ఆపదఁ దొలఁగించువాఁడె యరి యన నొప్పున్
రిప్లయితొలగించండి(గయోపాఖ్యానము: గయునికి అర్జునుడు శరణొసగెనని తెలిసి శ్రీకృష్ణుని ఆగ్రహము)
కం॥
నా పగతుని గాచెదనని
యాపార్థుడుమాటనిచ్చి యనికని వచ్చెన్-
సైపగ తరమే? నా యరి
యాపదఁదొలగించువాడె యరి యననొప్పున్!!
రిప్లయితొలగించండిత్రోపున చేతికి చిక్కిన
నా పరిపంథకుని జేరి యాగడ కాడై
గోపనముల జెప్పి పెఱల
యాపదఁ దొలఁగించువాఁడె యరి యన నొప్పున్.
నీపతి రావణా సురుడు నిగ్రహమున్ విడి సోదరుండనన్
కోపము చూపె నెందుకన కుచ్చితుడౌచు విభీషణుం డటన్
చూపెను పేర్మి రాముడన చోద్యమె కాదె, వివక్షు జేరి తా
నాపదలోన సాయపడునట్టి జనుండె విరోధి యౌనుగా.
గోపనమేలేక యరికిఁ
రిప్లయితొలగించండిబ్రాపుగ వర్తిల్లువాడు ప్రత్యర్థులకున్
జూపుచు నొద్దిక వైరుల
కాపదఁ దొలఁగించువాఁడె యరి యన నొప్పున్
రోపితమైన వైరముఁ విరోధికి మేలొన గూర్చునైజమున్
గోపనమేలయంచు తనకోరిక మేరకు కానివానికిన్
బ్రాపుగ నిల్చి యుండి తగు రక్షణ గూర్చుచు వానికండగా
నాపదలోన సాయపడునట్టి జనుండె విరోధి యౌనుగా
ఉ॥ ఆపద లోన సాయపడు నట్టి జనుండె విరోధి యౌనుగా
రిప్లయితొలగించండిపాపులు నుగ్రవాదులకపాయముఁ దప్పఁగ కొమ్ముకాయుచున్
దాపున నుంచు పోషకుఁడు ద్రవ్యము నిచ్చుచుఁ బ్రోత్సహించుచున్
మూఁపున మోసి రక్షఁ గనఁ బొందుగ, లోక రిపుండుఁ గాదొకో
(ఉగ్రవాదులు విరోధులైనట్టుగా వారికి ఊతమిచ్చే వారు కూడ లోక విరోధులేనండి)
కం:ఏ పద మెట్లు బలుక వలె
రిప్లయితొలగించండినా పద్ధతి బల్కు కొడుక! హరి యన లేవే?
ఏ పామరు నాలుక యో
"యాపదఁ దొలఁగించువాఁడె యరి" యన నొప్పున్”
(కొడుకు "హరి" అన బోయి "అరి" అంటే తండ్రి మందలిస్తున్నాడు. )
ఉ:ఆపద లోన సూచనల నందగ జేతు నటంచు మిత్రమా!
రిప్లయితొలగించండిఆ పరుషంపు భాష సుఖమా! అది వీడుక మంచి మాటనే
యోపిక తోడ జెప్ప వలదో! పరిభాషయె మోటు దైనచో
నాపదలోన సాయపడునట్టి జనుండె విరోధి యౌనుగా”
(అప్పద తీర్చే సలహాలే ఇచ్చినా పరుషపదాలతో చెపితే మంచి చెపోఅ వాడే శత్రువు కావటం సహజం.)
ప్రాపుగ నుండెడు మనుజు డె
రిప్లయితొలగించండియాపద దొ ల గించు వాడె :: యరి యన నొప్పున్
దాపున జేరియు కీడుల
నేపుగ గలిగించు వాని నిజ్జ గ మందున్
ఓపిక వహించి యించుక
రిప్లయితొలగించండియాపక నిరతమ్ము మిత్రమా విను రేపున్
మాపు నడరి పగవారల
కాపదఁ దొలఁగించు వాఁడె యరి యన నొప్పున్
పాప మటంచు నెంచకయె వంచకు చందము తోఁప నేరికిం
జూపుల కంద కుండఁ బరిశోధన సేసి వినూత్న పద్ధతుల్
కోపము నూని డెందమునఁ గొండొక వ్యక్తికిఁ దన్ను ద్రోయఁగా
నాపద లోన సాయపడు నట్టి జనుండె విరోధి యౌనుగా
చూపుచు నెయ్యమున్, చలుపుచున్ సహకారము చిత్తశుద్ధితో
రిప్లయితొలగించండికోపమొకింతయున్ గొనక కూర్మిఁ జరించుచు నుండి మించినన్
పాపపు బుద్ధితోడుత నపారపు స్వార్థము గల్గు పోకిరీ
కాపదలోన సాయపడునట్టి జనుండె విరోధి యౌనుగా