6, ఆగస్టు 2026, గురువారం

సమస్య - 5551

7-8-2026 (శుక్రవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“దర్పమ్మును మించి లేవు దైవికగుణముల్”

(లేదా...)

“దర్పము కన్న లేవు గద దైవికమౌ గుణముల్ జగమ్మునన్”

(ఉప్పలధడియం భరతశర్మ శతావధానంలో వేదాల గాయత్రి గారి సమస్య)

5 కామెంట్‌లు:

  1. తర్పణముతోడ నజునికి
    కర్పూరము వెలిగించి కాయము నంతన్
    నర్పించితి ననగలిగిన
    దర్పమ్మును మించి లేవు దైవికగుణముల్”

    రిప్లయితొలగించండి
  2. కందం
    దర్పము రావణుఁ ద్రుంచఁగ
    నేర్పడి దుర్యోధనాళి నేలకువాలన్
    మార్పున ప్రజ విడనాడఁగ
    దర్పమ్మును, మించి లేవు దైవిక గుణముల్

    ఉత్పలమాల
    మార్పున జాతివృద్ధినగు మాటల రావణుఁడాలకించెనే
    యోర్పును సంధికెంచక సుయోధనుఁడంతముసెందె పోరునన్
    దర్పమె నాశ హేతువన ధాత్రిని గూలిన రాక్షసాళికిన్
    దర్పము కన్న లేవు గద దైవికమౌ గుణముల్ జగమ్మునన్

    రిప్లయితొలగించండి

  3. పార్పరులన్నను గౌరవ
    మోర్పుగ పేదలకు సతతముపకారము తా
    నేర్పుగ జేయుచు వీడిన
    దర్పమ్మును మించి లేవు దైవికగుణముల్.


    పార్పరు లన్న జాలియును ఫ్రాయిడు లాకలి తీర్చ నెంచి సం
    తర్పణ జేయు వారగుచు దైవము నమ్ముచు మానసమ్మునే
    యర్పణ జేయ గల్గెడి మహాత్ముడు తానయి ప్రార దోలుచున్
    దర్పము కన్న లేవు గద దైవికమౌ గుణముల్ జగమ్మునన్.

    రిప్లయితొలగించండి
  4. నేర్పును కల్గి విస్తృతిగ నిత్యపు కార్యము లన్ని జేయుటల్
    మార్పును స్వీకరించుచు సమాజపు శ్రేయము కోరుచుండుటల్
    ఓర్పు వహించుచున్ పరుల యున్నతి కోరుట వీడనాడుటా
    దర్పము కన్న లేవుగద దైవికమౌ గుణముల్ జగమ్మునన్

    రిప్లయితొలగించండి
  5. ఓర్పు వహించి వటువులకు
    నేర్పిన విద్య ఫలియించి నిశ్చయముగ తా
    నేర్పింప నెలయు సేవా
    దర్పమ్మును మించి లేవు దైవికగుణముల్

    ఓర్పువహించుటే మిగుల నుత్తమమైన స్వభావమంద్రు యో
    దార్పుల తోడ లభ్యమగు తర్పణమైన ప్రశస్తమంద్రు తా
    నేర్పిన సద్గుణమ్ములకనేకులు పొందిన దైన్యసేవితా
    దర్పము కన్న లేవు గద దైవికమౌ గుణముల్ జగమ్మునన్

    రిప్లయితొలగించండి