7-8-2026 (శుక్రవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దర్పమ్మును మించి లేవు దైవికగుణముల్”
(లేదా...)
“దర్పము కన్న లేవు గద దైవికమౌ గుణముల్ జగమ్మునన్”
(ఉప్పలధడియం భరతశర్మ శతావధానంలో వేదాల గాయత్రి గారి సమస్య)
తర్పణముతోడ నజునికి కర్పూరము వెలిగించి కాయము నంతన్నర్పించితి ననగలిగినదర్పమ్మును మించి లేవు దైవికగుణముల్”
కందందర్పము రావణుఁ ద్రుంచఁగనేర్పడి దుర్యోధనాళి నేలకువాలన్మార్పున ప్రజ విడనాడఁగదర్పమ్మును, మించి లేవు దైవిక గుణముల్ఉత్పలమాలమార్పున జాతివృద్ధినగు మాటల రావణుఁడాలకించెనేయోర్పును సంధికెంచక సుయోధనుఁడంతముసెందె పోరునన్దర్పమె నాశ హేతువన ధాత్రిని గూలిన రాక్షసాళికిన్దర్పము కన్న లేవు గద దైవికమౌ గుణముల్ జగమ్మునన్
పార్పరులన్నను గౌరవ మోర్పుగ పేదలకు సతతముపకారము తా నేర్పుగ జేయుచు వీడిన దర్పమ్మును మించి లేవు దైవికగుణముల్.పార్పరు లన్న జాలియును ఫ్రాయిడు లాకలి తీర్చ నెంచి సం తర్పణ జేయు వారగుచు దైవము నమ్ముచు మానసమ్మునే యర్పణ జేయ గల్గెడి మహాత్ముడు తానయి ప్రార దోలుచున్ దర్పము కన్న లేవు గద దైవికమౌ గుణముల్ జగమ్మునన్.
నేర్పును కల్గి విస్తృతిగ నిత్యపు కార్యము లన్ని జేయుటల్మార్పును స్వీకరించుచు సమాజపు శ్రేయము కోరుచుండుటల్ ఓర్పు వహించుచున్ పరుల యున్నతి కోరుట వీడనాడుటాదర్పము కన్న లేవుగద దైవికమౌ గుణముల్ జగమ్మునన్
ఓర్పు వహించి వటువులకునేర్పిన విద్య ఫలియించి నిశ్చయముగ తా నేర్పింప నెలయు సేవా దర్పమ్మును మించి లేవు దైవికగుణముల్ఓర్పువహించుటే మిగుల నుత్తమమైన స్వభావమంద్రు యోదార్పుల తోడ లభ్యమగు తర్పణమైన ప్రశస్తమంద్రు తానేర్పిన సద్గుణమ్ములకనేకులు పొందిన దైన్యసేవితాదర్పము కన్న లేవు గద దైవికమౌ గుణముల్ జగమ్మునన్
సర్పము వంటిది దర్పమునేర్పుగనా యహి నణచిన నీ ధృతి యెచ్చున్తర్పణముగ విడనాడినదర్పమ్మును, మించి లేవు దైవికగుణముల్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కం:ఓర్పింత లేదు, సొమ్ములనర్పించిననే వచించు నాథ్యాత్మికతన్కార్పణ్యపరుడు, వీనినిదర్పమ్మును మించి లేవు దైవికగుణముల్(ఈ ఆథ్యాత్మిక ప్రవచన కర్తకి దైవిక గుణాలు దర్పాన్ని మించి లేవు.దర్పమే ఎక్కువ.)
సర్పమువంటి దర్పమును సత్వరమే విడనాడకున్న నాదర్పమె నిన్నడంచు నిది తథ్యము భీకరమైన శత్రువుల్దర్పము కన్న లేవు గద, దైవికమౌగుణముల్ జగమ్మునందోర్పును నమ్రతల్ మనుజునున్నతమౌపదమందు నిల్పగన్
ఉ:అర్పణ జేసి తీవు గద అచ్యుత ! గీతను, దాన నీవు దైవార్పిత కర్మ దెల్పితివి, యాసురసంపద,దైవసంపదన్ నేర్పితి, వద్ది వల్లె నిడి నిత్యము పల్కుచు రెచ్చె పాండితీదర్పము కన్న! లేవు గద దైవికమౌ గుణముల్ జగమ్మునన్(కన్న! ఓ కృష్ణా!నీవు గీతని అందించావు.దానిలో దైవాసురసపద్విభాగయోగం ఉంది.అంతా చదివి ఆప్ప జెప్పి పాండిత్యదర్పం చూపించుకొనే వాళ్లే కానీ దైవగుణాలు ఎక్కడా లేవు. )
ఉ॥ అర్పణఁ జేసి మానసము నచ్యుతు నెప్పుడుఁ గొల్చు ధ్యాసతోనోర్పు సమాజ సేవకిడి యూఁతముఁ బేదలకిచ్చు శక్తినిన్ నేర్పును గాంచు నేమమున నెమ్మదిఁ బొందఁగ నంత, లేనిచోదర్పము, కన్న లేవు గద దైవికమౌ గుణముల్ జగమ్మునన్(పై గుణాలు ఉండి దర్పము లేనిది దైవిక గుణాలు అనే అర్థములో నండి)
తర్పణ ముల ని ర సించు చు మార్పును గోరుచు పలికెను మరి మరి యిటు లన్ నేర్పరు లై తెలియ వలయు దర్పమ్ము ను మించి లేవు దైవిక గుణ ముల్
ఓర్పది లే దవగుణ పరిసర్పిత నరలోక మందు జగ దభిమతముల్ మార్పులు నిత్య విసర్జిత దర్పమ్మును మించి లేవు దైవిక గుణముల్ కూర్పఁగ రాని దయ్య గుణ కోటి నరాళికి దీన లోక సంతర్పణ సక్త మానసము ధర్మ గుణోద్ధర ణాప్రమేయ దై వార్పిత భక్తి తత్పరత యంచిత దాన గుణమ్ము వీత సందర్పము కన్న లేవు గద దైవికమౌ గుణముల్ జగమ్మునన్
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.ఓర్పుగ పేదకు సాయమొనర్పగ జాలిని కరుణన్; ఆ భగవంతున్నర్పింప సతము,వీడుచుదర్పమ్మును; మించి లేవు దైవిక గుణముల్.
తర్పణముతోడ నజునికి
రిప్లయితొలగించండికర్పూరము వెలిగించి కాయము నంతన్
నర్పించితి ననగలిగిన
దర్పమ్మును మించి లేవు దైవికగుణముల్”
కందం
రిప్లయితొలగించండిదర్పము రావణుఁ ద్రుంచఁగ
నేర్పడి దుర్యోధనాళి నేలకువాలన్
మార్పున ప్రజ విడనాడఁగ
దర్పమ్మును, మించి లేవు దైవిక గుణముల్
ఉత్పలమాల
మార్పున జాతివృద్ధినగు మాటల రావణుఁడాలకించెనే
యోర్పును సంధికెంచక సుయోధనుఁడంతముసెందె పోరునన్
దర్పమె నాశ హేతువన ధాత్రిని గూలిన రాక్షసాళికిన్
దర్పము కన్న లేవు గద దైవికమౌ గుణముల్ జగమ్మునన్
రిప్లయితొలగించండిపార్పరులన్నను గౌరవ
మోర్పుగ పేదలకు సతతముపకారము తా
నేర్పుగ జేయుచు వీడిన
దర్పమ్మును మించి లేవు దైవికగుణముల్.
పార్పరు లన్న జాలియును ఫ్రాయిడు లాకలి తీర్చ నెంచి సం
తర్పణ జేయు వారగుచు దైవము నమ్ముచు మానసమ్మునే
యర్పణ జేయ గల్గెడి మహాత్ముడు తానయి ప్రార దోలుచున్
దర్పము కన్న లేవు గద దైవికమౌ గుణముల్ జగమ్మునన్.
నేర్పును కల్గి విస్తృతిగ నిత్యపు కార్యము లన్ని జేయుటల్
రిప్లయితొలగించండిమార్పును స్వీకరించుచు సమాజపు శ్రేయము కోరుచుండుటల్
ఓర్పు వహించుచున్ పరుల యున్నతి కోరుట వీడనాడుటా
దర్పము కన్న లేవుగద దైవికమౌ గుణముల్ జగమ్మునన్
ఓర్పు వహించి వటువులకు
రిప్లయితొలగించండినేర్పిన విద్య ఫలియించి నిశ్చయముగ తా
నేర్పింప నెలయు సేవా
దర్పమ్మును మించి లేవు దైవికగుణముల్
ఓర్పువహించుటే మిగుల నుత్తమమైన స్వభావమంద్రు యో
దార్పుల తోడ లభ్యమగు తర్పణమైన ప్రశస్తమంద్రు తా
నేర్పిన సద్గుణమ్ములకనేకులు పొందిన దైన్యసేవితా
దర్పము కన్న లేవు గద దైవికమౌ గుణముల్ జగమ్మునన్
సర్పము వంటిది దర్పము
రిప్లయితొలగించండినేర్పుగనా యహి నణచిన నీ ధృతి యెచ్చున్
తర్పణముగ విడనాడిన
దర్పమ్మును, మించి లేవు దైవికగుణముల్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికం:ఓర్పింత లేదు, సొమ్ముల
రిప్లయితొలగించండినర్పించిననే వచించు నాథ్యాత్మికతన్
కార్పణ్యపరుడు, వీనిని
దర్పమ్మును మించి లేవు దైవికగుణముల్
(ఈ ఆథ్యాత్మిక ప్రవచన కర్తకి దైవిక గుణాలు దర్పాన్ని మించి లేవు.దర్పమే ఎక్కువ.)
సర్పమువంటి దర్పమును సత్వరమే విడనాడకున్న నా
రిప్లయితొలగించండిదర్పమె నిన్నడంచు నిది తథ్యము భీకరమైన శత్రువుల్
దర్పము కన్న లేవు గద, దైవికమౌగుణముల్ జగమ్మునం
దోర్పును నమ్రతల్ మనుజునున్నతమౌపదమందు నిల్పగన్
ఉ:అర్పణ జేసి తీవు గద అచ్యుత ! గీతను, దాన నీవు దై
రిప్లయితొలగించండివార్పిత కర్మ దెల్పితివి, యాసురసంపద,దైవసంపదన్
నేర్పితి, వద్ది వల్లె నిడి నిత్యము పల్కుచు రెచ్చె పాండితీ
దర్పము కన్న! లేవు గద దైవికమౌ గుణముల్ జగమ్మునన్
(కన్న! ఓ కృష్ణా!నీవు గీతని అందించావు.దానిలో దైవాసురసపద్విభాగయోగం ఉంది.అంతా చదివి ఆప్ప జెప్పి పాండిత్యదర్పం చూపించుకొనే వాళ్లే కానీ దైవగుణాలు ఎక్కడా లేవు. )
ఉ॥ అర్పణఁ జేసి మానసము నచ్యుతు నెప్పుడుఁ గొల్చు ధ్యాసతో
రిప్లయితొలగించండినోర్పు సమాజ సేవకిడి యూఁతముఁ బేదలకిచ్చు శక్తినిన్
నేర్పును గాంచు నేమమున నెమ్మదిఁ బొందఁగ నంత, లేనిచో
దర్పము, కన్న లేవు గద దైవికమౌ గుణముల్ జగమ్మునన్
(పై గుణాలు ఉండి దర్పము లేనిది దైవిక గుణాలు అనే అర్థములో నండి)
తర్పణ ముల ని ర సించు చు
రిప్లయితొలగించండిమార్పును గోరుచు పలికెను మరి మరి యిటు లన్
నేర్పరు లై తెలియ వలయు
దర్పమ్ము ను మించి లేవు దైవిక గుణ ముల్
ఓర్పది లే దవగుణ పరి
రిప్లయితొలగించండిసర్పిత నరలోక మందు జగ దభిమతముల్
మార్పులు నిత్య విసర్జిత
దర్పమ్మును మించి లేవు దైవిక గుణముల్
కూర్పఁగ రాని దయ్య గుణ కోటి నరాళికి దీన లోక సం
తర్పణ సక్త మానసము ధర్మ గుణోద్ధర ణాప్రమేయ దై
వార్పిత భక్తి తత్పరత యంచిత దాన గుణమ్ము వీత సం
దర్పము కన్న లేవు గద దైవికమౌ గుణముల్ జగమ్మునన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
ఓర్పుగ పేదకు సాయమొ
నర్పగ జాలిని కరుణన్; ఆ భగవంతున్
నర్పింప సతము,వీడుచు
దర్పమ్మును; మించి లేవు దైవిక గుణముల్.