7, ఆగస్టు 2026, శుక్రవారం

సమస్య - 5552

8-8-2026 (శనివారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“దారము ప్రాణములఁ దీసె దారుణరీతిన్”

(లేదా...)

“దారము దీసె ప్రాణము లుదారత వీడియు దారుణమ్ముగన్”

(ఉప్పలధడియం భరతశర్మ శతావధానంలో చెరుకూరి వేంకట సూర్యనారాయణ శర్మ గారి సమస్య)

9 కామెంట్‌లు:

  1. కందం
    మీరి హిరణ్యాక్షుఁడలన్
    ధారుణి జుట్టియుఁ గడలిని దాచిన కతనన్
    నీరజనేత్రుండగు కుం
    దారము ప్రాణములఁ దీసె దారుణరీతిన్

    రిప్లయితొలగించండి
  2. వారాంతపు పోటీలో
    చేరువ గిరి నెక్కబోవ చిట్టగ పదముల్
    జారి పడిన కతమున కే
    దారము ప్రాణములఁ దీసె దారుణరీతిన్

    రిప్లయితొలగించండి
  3. ధారుణిఁ గడలిని దాచిన
    చోరుడు కనకాక్షుఁ జంప సుడివాల్దొరయే
    మారె వరాహమ్ముగ, కుం
    దారము ప్రాణములఁ దీసె దారుణరీతిన్

    రిప్లయితొలగించండి
  4. రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. సైరికు డొక్క నాడు తన శాలిని తోడత రాత్రి వేళలో
      చేరువ నందు నున్న వరిచేనుకు కాలువ దీసి చక్కగన్
      నీరము పెట్టుచుండ గమనించుచు వారల క్రూరమైన కుం
      దారము దీసె ప్రాణము లుదారత వీడియు దారుణమ్ముగన్

      తొలగించండి

  5. పారావారము నందున
    ధారుణి దాచిన యసురుని దర్పమడంచన్
    శూరమ్మయ్యె హరియె భూ
    దారము ప్రాణములఁ దీసె దారుణరీతిన్.


    ధారుణి జుట్టి చాపవలె తర్షము నందున దాచినంతటన్
    భైరవ మంద లోకము, క్షపాటుని యంతము చేయనెంచి దై
    త్యారి ధరిత్రి రక్షకయి యాఖనికమ్మవతారమెత్తి కుం
    దారము దీసె ప్రాణము లుదారత వీడియు దారుణమ్ముగన్.

    రిప్లయితొలగించండి
  6. దారకులు గాలిపటముల
    దారము కడు గట్టిదనుచుఁ దలచుట సరియౌ
    వారొదిలిన పడగలలో
    దారము ప్రాణములఁ దీసె దారుణరీతిన్

    దూరము మిక్కుటంబయినఁ దుష్కరమేనని వెల్లడించినన్
    జేరగ నెంచి దేవళము సేసిరి భక్తులు తీర్థయాత్రలే
    వారికి మృత్యువయ్యెనట వానకు జారిన కొండరాళ్ళు కే
    దారము దీసె ప్రాణము లుదారత వీడియు దారుణమ్ముగన్

    రిప్లయితొలగించండి
  7. నేరము జేసియు దొరక గ
    కారా గారమున వేసి కాఠి న్య ముగా
    ధారుణి శిక్షంప గ నురి
    దారము ప్రాణములు దీ సె దారుణ రీతి న్

    రిప్లయితొలగించండి