8-8-2026 (శనివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దారము ప్రాణములఁ దీసె దారుణరీతిన్”
(లేదా...)
“దారము దీసె ప్రాణము లుదారత వీడియు దారుణమ్ముగన్”
(ఉప్పలధడియం భరతశర్మ శతావధానంలో చెరుకూరి వేంకట సూర్యనారాయణ శర్మ గారి సమస్య)
కందంమీరి హిరణ్యాక్షుఁడలన్ధారుణి జుట్టియుఁ గడలిని దాచిన కతనన్నీరజనేత్రుండగు కుందారము ప్రాణములఁ దీసె దారుణరీతిన్
వారాంతపు పోటీలో చేరువ గిరి నెక్కబోవ చిట్టగ పదముల్ జారి పడిన కతమున కే దారము ప్రాణములఁ దీసె దారుణరీతిన్
ధారుణిఁ గడలిని దాచినచోరుడు కనకాక్షుఁ జంప సుడివాల్దొరయేమారె వరాహమ్ముగ, కుందారము ప్రాణములఁ దీసె దారుణరీతిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సైరికు డొక్క నాడు తన శాలిని తోడత రాత్రి వేళలోచేరువ నందు నున్న వరిచేనుకు కాలువ దీసి చక్కగన్నీరము పెట్టుచుండ గమనించుచు వారల క్రూరమైన కుందారము దీసె ప్రాణము లుదారత వీడియు దారుణమ్ముగన్
పారావారము నందున ధారుణి దాచిన యసురుని దర్పమడంచన్ శూరమ్మయ్యె హరియె భూ దారము ప్రాణములఁ దీసె దారుణరీతిన్.ధారుణి జుట్టి చాపవలె తర్షము నందున దాచినంతటన్ భైరవ మంద లోకము, క్షపాటుని యంతము చేయనెంచి దై త్యారి ధరిత్రి రక్షకయి యాఖనికమ్మవతారమెత్తి కుం దారము దీసె ప్రాణము లుదారత వీడియు దారుణమ్ముగన్.
దారకులు గాలిపటములదారము కడు గట్టిదనుచుఁ దలచుట సరియౌవారొదిలిన పడగలలో దారము ప్రాణములఁ దీసె దారుణరీతిన్దూరము మిక్కుటంబయినఁ దుష్కరమేనని వెల్లడించినన్ జేరగ నెంచి దేవళము సేసిరి భక్తులు తీర్థయాత్రలేవారికి మృత్యువయ్యెనట వానకు జారిన కొండరాళ్ళు కేదారము దీసె ప్రాణము లుదారత వీడియు దారుణమ్ముగన్
నేరము జేసియు దొరక గ కారా గారమున వేసి కాఠి న్య ముగా ధారుణి శిక్షంప గ నురి దారము ప్రాణములు దీ సె దారుణ రీతి న్
చోరునివోలె మేదినిని చుట్టగ జేసి సముద్రమందునన్ఫేరవుఁడొక్కరుండు గలిపెన్, గఱివేలుపు సూకరమ్ముగాకోరి ధరించె రూపమును క్షోణిని గావఁగ, పోరుసల్పి కుందారము దీసె ప్రాణము లుదారత వీడియు దారుణమ్ముగన్
(అందము చూసి మోహించి ఒక పడతి వెంట పడి ఆమె మోసము చేసిన పిదప అభాగ్యుని ఆవేదనండి)ఉ॥ తీరగు నందమున్ గనుచు దివ్యమటంచు సమాదరమ్ముతోనేరక నింతి వెంటఁ బడ నెమ్మది పోయె ధనమ్ము సంపదల్హారతి వోలె నంతమయె నయ్యయొ యేమిది యొక్క భామ బృందారము దీసె ప్రాణము లుదారత వీడియు దారుణమ్ముగన్బృందారము మనోహరము
నేరము దేవుని లీలలు దారినిఁ దగ నేఁగుచుండు తరుణం బందున్ మారుత పతాకపుఁ గఱకు దారము ప్రాణములఁ దీసె దారుణ రీతిన్ లేరు జగమ్మలం దడరి లీల నెదిర్ప సమర్ధు లేరు నన్ వీరు లటంచు భీతి నెద వీడి చరింప సదర్ప మంతలో మూరి హిరణ్య నేత్రుని సముద్ర జలమ్మున విష్ణుమూర్తి భూదారము దీసెఁ బ్రాణము లుదారత వీడియు దారుణమ్ముగన్
కం:క్రూరుడగు భర్త చేసిననేరములన్ దాళి నెంచి నెలత సహించన్ఘోరముగ జంపె, మెడ గలదారము ప్రాణములఁ దీసె దారుణరీతిన్.
ధారుణి బంధి జేసి వడి దైత్యుడు సంద్రము నందుదాగగాన్ శౌరి జనించె పృథ్విపయి చట్టన సూకర రూపుతోడుతన్ క్రూరమనస్కుడౌ యసురు గూల్చగ నెంచి పయోధి నుగ్ర కుందారము దీసె ప్రాణము లుదారత వీడియు దారుణమ్ముగన్
ఉ:నేరక విద్య లేవియును నిత్యకృషీవలు డైన రైతు ముద్దారగ జూడగా పొల మదంతయు వర్షము లేక యెండె,కేదారము దీసె ప్రాణము, లుదారత వీడియు దారుణమ్ముగన్గోరగ నప్పు దీర్చుమను క్రూరుల జూచి త్యజించె బ్రాణముల్. (కేదారము=మాగాణి భూమి. దాన్ని నమ్ముకొంటే ఆత్మహత్యమిగిలింది.)
ఉ:కోరుచు నామె, నన్యులను కొంతయు మెచ్చక "నాదు ముద్దు మందార" మటంచు బేర్కొనుచు, దానికి బ్రేమను ధార వోయ, నాజారిణి వీని వీడగ విషమ్మును గ్రోలెను వీడు, ముద్ద మందారము దీసె ప్రాణము లుదారత వీడియు దారుణమ్ముగన్”(ప్రేమించిన దానికి ముద్దమందారం అని పేరు పెట్టుకున్నాడు. అది మోసగిస్తే ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు.)
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.కోరుచు గాలిపటమ్ములబారులుగా నెగురవేయ బాలురు కడగన్వారలు వాడిన చైనాదారము ప్రాణములఁ దీసె దారుణ రీతిన్.
కందం
రిప్లయితొలగించండిమీరి హిరణ్యాక్షుఁడలన్
ధారుణి జుట్టియుఁ గడలిని దాచిన కతనన్
నీరజనేత్రుండగు కుం
దారము ప్రాణములఁ దీసె దారుణరీతిన్
వారాంతపు పోటీలో
రిప్లయితొలగించండిచేరువ గిరి నెక్కబోవ చిట్టగ పదముల్
జారి పడిన కతమున కే
దారము ప్రాణములఁ దీసె దారుణరీతిన్
ధారుణిఁ గడలిని దాచిన
రిప్లయితొలగించండిచోరుడు కనకాక్షుఁ జంప సుడివాల్దొరయే
మారె వరాహమ్ముగ, కుం
దారము ప్రాణములఁ దీసె దారుణరీతిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిసైరికు డొక్క నాడు తన శాలిని తోడత రాత్రి వేళలో
తొలగించండిచేరువ నందు నున్న వరిచేనుకు కాలువ దీసి చక్కగన్
నీరము పెట్టుచుండ గమనించుచు వారల క్రూరమైన కుం
దారము దీసె ప్రాణము లుదారత వీడియు దారుణమ్ముగన్
రిప్లయితొలగించండిపారావారము నందున
ధారుణి దాచిన యసురుని దర్పమడంచన్
శూరమ్మయ్యె హరియె భూ
దారము ప్రాణములఁ దీసె దారుణరీతిన్.
ధారుణి జుట్టి చాపవలె తర్షము నందున దాచినంతటన్
భైరవ మంద లోకము, క్షపాటుని యంతము చేయనెంచి దై
త్యారి ధరిత్రి రక్షకయి యాఖనికమ్మవతారమెత్తి కుం
దారము దీసె ప్రాణము లుదారత వీడియు దారుణమ్ముగన్.
దారకులు గాలిపటముల
రిప్లయితొలగించండిదారము కడు గట్టిదనుచుఁ దలచుట సరియౌ
వారొదిలిన పడగలలో
దారము ప్రాణములఁ దీసె దారుణరీతిన్
దూరము మిక్కుటంబయినఁ దుష్కరమేనని వెల్లడించినన్
జేరగ నెంచి దేవళము సేసిరి భక్తులు తీర్థయాత్రలే
వారికి మృత్యువయ్యెనట వానకు జారిన కొండరాళ్ళు కే
దారము దీసె ప్రాణము లుదారత వీడియు దారుణమ్ముగన్
నేరము జేసియు దొరక గ
రిప్లయితొలగించండికారా గారమున వేసి కాఠి న్య ముగా
ధారుణి శిక్షంప గ నురి
దారము ప్రాణములు దీ సె దారుణ రీతి న్
చోరునివోలె మేదినిని చుట్టగ జేసి సముద్రమందునన్
రిప్లయితొలగించండిఫేరవుఁడొక్కరుండు గలిపెన్, గఱివేలుపు సూకరమ్ముగా
కోరి ధరించె రూపమును క్షోణిని గావఁగ, పోరుసల్పి కుం
దారము దీసె ప్రాణము లుదారత వీడియు దారుణమ్ముగన్
(అందము చూసి మోహించి ఒక పడతి వెంట పడి ఆమె మోసము చేసిన పిదప అభాగ్యుని ఆవేదనండి)
రిప్లయితొలగించండిఉ॥ తీరగు నందమున్ గనుచు దివ్యమటంచు సమాదరమ్ముతో
నేరక నింతి వెంటఁ బడ నెమ్మది పోయె ధనమ్ము సంపదల్
హారతి వోలె నంతమయె నయ్యయొ యేమిది యొక్క భామ బృం
దారము దీసె ప్రాణము లుదారత వీడియు దారుణమ్ముగన్
బృందారము మనోహరము
నేరము దేవుని లీలలు
రిప్లయితొలగించండిదారినిఁ దగ నేఁగుచుండు తరుణం బందున్
మారుత పతాకపుఁ గఱకు
దారము ప్రాణములఁ దీసె దారుణ రీతిన్
లేరు జగమ్మలం దడరి లీల నెదిర్ప సమర్ధు లేరు నన్
వీరు లటంచు భీతి నెద వీడి చరింప సదర్ప మంతలో
మూరి హిరణ్య నేత్రుని సముద్ర జలమ్మున విష్ణుమూర్తి భూ
దారము దీసెఁ బ్రాణము లుదారత వీడియు దారుణమ్ముగన్
కం:క్రూరుడగు భర్త చేసిన
రిప్లయితొలగించండినేరములన్ దాళి నెంచి నెలత సహించన్
ఘోరముగ జంపె, మెడ గల
దారము ప్రాణములఁ దీసె దారుణరీతిన్.
ధారుణి బంధి జేసి వడి దైత్యుడు సంద్రము నందుదాగగాన్
రిప్లయితొలగించండిశౌరి జనించె పృథ్విపయి చట్టన సూకర రూపుతోడుతన్
క్రూరమనస్కుడౌ యసురు గూల్చగ నెంచి పయోధి నుగ్ర కుం
దారము దీసె ప్రాణము లుదారత వీడియు దారుణమ్ముగన్
ఉ:నేరక విద్య లేవియును నిత్యకృషీవలు డైన రైతు ము
రిప్లయితొలగించండిద్దారగ జూడగా పొల మదంతయు వర్షము లేక యెండె,కే
దారము దీసె ప్రాణము, లుదారత వీడియు దారుణమ్ముగన్
గోరగ నప్పు దీర్చుమను క్రూరుల జూచి త్యజించె బ్రాణముల్.
(కేదారము=మాగాణి భూమి. దాన్ని నమ్ముకొంటే ఆత్మహత్యమిగిలింది.)
ఉ:కోరుచు నామె, నన్యులను కొంతయు మెచ్చక "నాదు ముద్దు మం
రిప్లయితొలగించండిదార" మటంచు బేర్కొనుచు, దానికి బ్రేమను ధార వోయ, నా
జారిణి వీని వీడగ విషమ్మును గ్రోలెను వీడు, ముద్ద మం
దారము దీసె ప్రాణము లుదారత వీడియు దారుణమ్ముగన్”
(ప్రేమించిన దానికి ముద్దమందారం అని పేరు పెట్టుకున్నాడు. అది మోసగిస్తే ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు.)
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
కోరుచు గాలిపటమ్ముల
బారులుగా నెగురవేయ బాలురు కడగన్
వారలు వాడిన చైనా
దారము ప్రాణములఁ దీసె దారుణ రీతిన్.