1-11-2026 (ఆదివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాముఁడు లంకానగరికి రాజయ్యెఁ గదా”
(లేదా...)
“రాముఁడు రావణుం దునిమి రాజుగ నయ్యెను స్వర్ణలంకకున్”
కందంనీమము దప్ప దశాస్యుడు,'సేమమునెంచి విభీషణుండు చేర',సమరమునన్భీమ బలమ్మున దునుమన్రాముఁడు, 'లంకానగరికి రాజయ్యెఁ గదా!'ఉత్పలమాల నీమమునొప్ప జానకిని నీరజనేత్రునకందఁ జేసినన్సేమమనన్ విభీషణునిఁ జేయగ నిందను,జేరవచ్చినన్సౌమనసమ్మునందభయశాలిగఁ గూరిమి నప్పగించగన్రాముఁడు రావణుం దునిమి, రాజుగ నయ్యెను స్వర్ణలంకకున్
భూమిజ విముక్తికి వెడలెరాముఁడు లంకానగరికి ; రాజయ్యెఁ గదాయా మండోదరి మరదియె ,రాముడు నిష్ఠించినటుల లభ్యపు రీతిన్
కందం:నామమడచె దశకంఠునిరాముఁడు, లంకానగరికి రాజయ్యెఁ గదాధీమతి విభీషణుఁడు శ్రీరాముని యామంత్రణమున రాజ్యమునేలన్
ఉత్పలమాలిక.శ్రీమహిజాతనాథుడు వశీకృతచిత్తుడు లోకపాలుడున్శ్యామలకోమలాంగుడు దయాగుణ శీలుడు ధర్మరూపుడున్సోమహృదాంతరస్థితవిశుద్ధవినిర్మలవేదవేద్యుడున్ధీమతిదుష్టభంజనుడు దిగ్విజయంబుగగెల్చెధాత్రినేభూమినినేకఛత్రమున పుణ్యచరిత్రుడెనేలెనే పరంధాముడు రాక్షసోత్తముని ధన్యునిజేసెనదెట్టులన్న? శ్రీరాముడురావణుందునిమి రాజుగనయ్యెను స్వర్ణలంకకున్
ఏమరిచిన నిద్దురలోధీమంతుడు గోచరించె త్రిజటకు కలలో!భీమరమందు విజయుడైరాముఁడు లంకానగరికి రాజయ్యెఁ గదానీమములన్ గణింపుము ప్రణీతములైనవి ధర్మ సూత్రముల్భీమర మందునెగ్గగనె వీరునిదౌనట శత్రు రాజ్యమేఏమఱు పాటునన్ ద్రిజట కీవిధి కల్గెను స్వప్నమేలనోరాముఁడు రావణుం దునిమి రాజుగ నయ్యెను స్వర్ణలంకకున్
రాముండాశ్రయ మిచ్చుచు ప్రేమించిన వాడయిన విభీషణుడనిలో నామమడంచగ రావణు రాముఁడు, లంకానగరికి రాజయ్యెఁ గదా.కోమలి వాయు పుత్రునట కోరిన కోరిక తీర్చె నెట్లనన్ రాముఁడు రావణుం దునిమి, రాజుగ నయ్యెను స్వర్ణలంకకున్భామను రాము జేర్చుటది పాడి యటంచు వచించి నట్టి యా రాముని వైరి సోదరుడు రాక్షసు డైన విభీషణుండె గా
కందం
రిప్లయితొలగించండినీమము దప్ప దశాస్యుడు,
'సేమమునెంచి విభీషణుండు చేర',సమరమునన్
భీమ బలమ్మున దునుమన్
రాముఁడు, 'లంకానగరికి రాజయ్యెఁ గదా!'
ఉత్పలమాల
నీమమునొప్ప జానకిని నీరజనేత్రునకందఁ జేసినన్
సేమమనన్ విభీషణునిఁ జేయగ నిందను,జేరవచ్చినన్
సౌమనసమ్మునందభయశాలిగఁ గూరిమి నప్పగించగన్
రాముఁడు రావణుం దునిమి, రాజుగ నయ్యెను స్వర్ణలంకకున్
రిప్లయితొలగించండిభూమిజ విముక్తికి వెడలె
రాముఁడు లంకానగరికి ; రాజయ్యెఁ గదా
యా మండోదరి మరదియె ,
రాముడు నిష్ఠించినటుల లభ్యపు రీతిన్
కందం:
రిప్లయితొలగించండినామమడచె దశకంఠుని
రాముఁడు, లంకానగరికి రాజయ్యెఁ గదా
ధీమతి విభీషణుఁడు శ్రీ
రాముని యామంత్రణమున రాజ్యమునేలన్
ఉత్పలమాలిక.
రిప్లయితొలగించండిశ్రీమహిజాతనాథుడు వశీకృతచిత్తుడు లోకపాలుడున్
శ్యామలకోమలాంగుడు దయాగుణ శీలుడు ధర్మరూపుడున్
సోమహృదాంతరస్థితవిశుద్ధవినిర్మలవేదవేద్యుడున్
ధీమతిదుష్టభంజనుడు దిగ్విజయంబుగగెల్చెధాత్రినే
భూమినినేకఛత్రమున పుణ్యచరిత్రుడెనేలెనే పరం
ధాముడు రాక్షసోత్తముని ధన్యునిజేసెనదెట్టులన్న? శ్రీ
రాముడురావణుందునిమి రాజుగనయ్యెను స్వర్ణలంకకున్
ఏమరిచిన నిద్దురలో
రిప్లయితొలగించండిధీమంతుడు గోచరించె త్రిజటకు కలలో!
భీమరమందు విజయుడై
రాముఁడు లంకానగరికి రాజయ్యెఁ గదా
నీమములన్ గణింపుము ప్రణీతములైనవి ధర్మ సూత్రముల్
భీమర మందునెగ్గగనె వీరునిదౌనట శత్రు రాజ్యమే
ఏమఱు పాటునన్ ద్రిజట కీవిధి కల్గెను స్వప్నమేలనో
రాముఁడు రావణుం దునిమి రాజుగ నయ్యెను స్వర్ణలంకకున్
రిప్లయితొలగించండిరాముండాశ్రయ మిచ్చుచు
ప్రేమించిన వాడయిన విభీషణుడనిలో
నామమడంచగ రావణు
రాముఁడు, లంకానగరికి రాజయ్యెఁ గదా.
కోమలి వాయు పుత్రునట కోరిన కోరిక తీర్చె నెట్లనన్
రాముఁడు రావణుం దునిమి, రాజుగ నయ్యెను స్వర్ణలంకకున్
భామను రాము జేర్చుటది పాడి యటంచు వచించి నట్టి యా
రాముని వైరి సోదరుడు రాక్షసు డైన విభీషణుండె గా