2, జూన్ 2025, సోమవారం

సమస్య - 5140

3-6-2025 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“వాడ దొంగ యెటుల్ భగవంతుఁడగును”

(లేదా...)

“వాడ వాడల దొంగిలించెడి వాసుదేవుఁడు దేవుఁడా”

15 కామెంట్‌లు:

Sitharamayya Solasa చెప్పారు...

లోకులు నుడువుచుండిన రూపును విని ,
తనను కోరిన రుక్మిణీ తరుణిని మను
వాడ , దొంగ యెటుల్  ? భగవంతుఁడగును
కోమలికి , తాను వేడిన కోర్కె దీర్చ

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

తేటగీతి
వెన్న మీగడ దోచియు వీధులిండ్ల
నంగనలు జలకాలాడ తొంగి చూచి
చీరలెత్తుకు పోయిన శ్రీకరుండె!
వాడ? దొంగ! యెటుల్ భగవంతుఁడగును?

మత్తకోకిల
చూడకూడదటన్న జ్ఞానము సుంతయైనను లేకయే
నాడువారలు తానమాడగ నందిపోయెను చీరలన్
తోడు దొంగలు వెంటనంటగ దూరి యిండ్లను వెన్నలన్
వాడ వాడల దొంగిలించెడి వాసుదేవుఁడు దేవుఁడా?

పఠానేని కార్తిక్ చెప్పారు...

(కృష్ణుని వెన్నదొంగతనం చూసి ఆశ్చర్యపడిన ఓ ఇల్లాలి మాటలు)

మత్తకోకిల.
వేడుకల్ దరి చేరుచున్నవి వెన్న ముద్దులు మాయమై
నేడు గంటికిఁ గానిపించెను, నిస్తులంబగు నేర్పుతో
ప్రోడయౌచట తస్కరించెను బోసి నవ్వులఁ జింది యా
వాడ వాడల దొంగిలించెడి వాసుదేవుడు, దేవుడా !!

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

☝☝☝అగ్ర పూజకెంచిన శ్రీకృష్ణుని గురించి శిశుపాలుడు ధర్మరాజుతో.....

విరించి చెప్పారు...


జలకములనాడు పడతుల శాటికలను
దొంగిలించెనతడు, సగంధులను కూడి
తక్రసారమ్ము నిశివేళ తస్కరించు
వాడ దొంగ యెటుల్ భగవంతుఁడగును.


వీడినెవ్విధి గారవింతురు వృద్ధులిందరు నుండగా
నాడవారలు స్నానమాడగ నంబరమ్ముల నెత్తెనే
తోడుగా సఖులండ జూచుక దొంగిలించెను వెన్నెనే
వాడ వాడల దొంగిలించెడి వాసుదేవుఁడు దేవుఁడా?


*(శిశుపాలుని మాటలుగా)*

M.B.G.TILAK చెప్పారు...

పురజనుల మేలు కోరిన గిరిధరుండు
వేణుగానామృతము పంచి పెట్టువాడు
గోపకాంతల యెడదలు కొల్లగొట్టు
వాడ! దొంగ యెటుల్ భగవంతుఁడగును

వీడ కుండగ నెల్ల వేళల వెన్నపూస నవశ్యమున్
వాడ వాడల దొంగిలించెడి వాసుదేవుఁడు దేవుఁడా !
కోడెకత్తెల పావడాలను కొల్లగొట్టిన ధీరుడా !
చూడచక్కని రూపుకల్గిన సుందరాంగుడు దేవుడా !

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

చీర లెత్తుకు వెళ్లిన చిలిపి వాని
పొగడు చుందు ర దే ల కో పొంగి పోయి
వెన్న మీగడ కొఱ కు నై వెదుకు చుండు
వాడు దొంగ యెటు ల్ భగవంతుడ గును?

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

ఆడువారలు తానమాడగ అంబరమ్ముల దొంగిలెన్
తోడునీడగ గోపబాలురు దొంగలై నడయాడగా
వాడు యిండ్లను మ్రుచ్చిలించెను పాలు మీగడ వెన్నలన్
వాడ వాడల దొంగిలించెడి వాసుదేవుఁడు దేవుఁడా

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

వెన్న మీగడల్ దొంగిలి తిన్నవాడు
వాడ కన్నెలు తానములాడుచుండ
చీరలెత్తుకు పోయిన చిన్నవాడు
వాడ దొంగ, యెటుల్ భగవంతుఁడగును

Dhanikonda Ravi Prasad చెప్పారు...

తే.గీ:మతము మార్చగ నొక డిట్లు మాట లాడె
అల్లరుల్ జేయుచున్ పోయి గొల్ల యిండ్ల
వెన్న గాజేసె కృష్ణుడు ,వినుము పిచ్చి
వాడ !దొంగ యెటుల్భగవంతుఁడగును”

Dhanikonda Ravi Prasad చెప్పారు...

2)మ.కో:చేడియల్ వగ తో యశోదను జేరి కృష్ణుని చేష్టలన్
వీడ కొక్కటి చెప్పుచుండగ వించు జాలిగ జూచుచున్
వాడ వాడల దొంగిలించెడి వాసుదేవుఁడు "దేవుఁడా!
చూడు మిచ్చటె యుంటిగా !"యనుచున్ వచించెడు నమ్మతోన్.
(కృస్ణు డేవో ఆగాలు చేసా డని స్త్రీలు వచ్చి యశోద తో చెపుతుంటే "దేవుడా! నే నిక్కడే ఉన్నా కదా!అంటాడు కృష్ణుడు యశోద తో.)

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

మగువ లెల్లరు విన మాయ మాట లడర
గీత లోనఁ గన్పడు కొన్ని గిరల నుడివి
గాంతలను జూచుచుండును గామి బుద్ధి
వాడ దొంగ యెటుల్ భగవంతుఁ డగును

[వాడు=మ్లాన మవు]


ఆఁడుదానిని పాలు త్రాగుచు నంపెఁ గాలుని వీటికే
తోడుగా జలకమ్ము లాడఁగ దొంగిలించెను బట్టలే
పాఁడి నమ్మెడి గోపకాంతల వారిజాక్షులఁ దన్పెనే
వాడ వాడల దొంగిలించెడి వాసుదేవుఁడు దేవుఁడా

Dr H Varalakshmi చెప్పారు...

మత్తకోకిల :

మేడ మిద్దెల చూడబోడుగ మేలు వెన్నను మ్రుచ్చిలన్
కూడియాడుచు గోపబాలుర కూర్మి యిల్లిలు దిర్గునే
పీడ రక్కసి మూకలన్ భళి పెక్కు జంపిన బాలుడే
వాడ వాడల దొంగిలించెడి వాసుదేవుఁడు దేవుఁడా !

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

బాల్యమున గొనె పూతన ప్రాణములను
మన్ను తింటివట యనుచు వెన్ను నడుగ
చూపె నోటిలో విశ్వమున్ చోద్యముగను
వాడ దొంగ!యెటుల్? భగవంతుడగును.