ఉత్పలమాల స్వచ్ఛ మనస్కులున్ గరుప పాలన దేశము నందు పౌర జీ వేచ్ఛయు వృద్ధి గాంచుగద నింపుగ విశ్వమునందు దేశముల్ ముచ్చట దీరగన్ మిగులు పూర్తిగ వర్తకమోడలెక్కగన్ స్వేచ్ఛ మరింత హెచ్చినపుడే సిరులెన్నియొ పొందఁగా నగున్
సమస్య: స్వేచ్ఛ మరింత హెచ్చగను శ్రేయములెన్నియొ పొందగాదగున్
ఉత్పలమాల:
స్వచ్ఛపు గాలి నీరు మన స్వంతము జీవుల నుద్ధరింపగన్ తుచ్ఛపు కోర్కెలన్ పరుల తూలగ నాడ సమంజసంబకో ఇచ్ఛయు లేక సేయు పని యీప్సిత మేగతి తీర్చనోపునే స్వేచ్ఛ మరింత హెచ్చగను శ్రేయములెన్నియొ పొందగాదగున్
13 కామెంట్లు:
ఉ.
సచ్ఛరదంబు భంగి శుభ సాగరమందు భుజంగశాయియై
హృచ్ఛిఖి భాసిలంగ వడి హేలగ శ్రీదయ సంతరించు, నే
యిచ్ఛల వాగురానఁ బడి యిత్తఱి నుండకు, భక్తియౌ లస
త్స్వేచ్ఛ మరింత హెచ్చినపుడే సిరులెన్నియొ పొందగానగున్ !
ఆటవెలది
విత్తమమరు కాదె విశ్వ దేశమ్ముల
పరిమితముగ సాగ వర్తకమ్ము
మిగులు యెగుమతులకు దేశవిదేశాల
స్వేచ్ఛ హెచ్చినపుడె సిరులు కలుగు
ఉత్పలమాల
స్వచ్ఛ మనస్కులున్ గరుప పాలన దేశము నందు పౌర జీ
వేచ్ఛయు వృద్ధి గాంచుగద నింపుగ విశ్వమునందు దేశముల్
ముచ్చట దీరగన్ మిగులు పూర్తిగ వర్తకమోడలెక్కగన్
స్వేచ్ఛ మరింత హెచ్చినపుడే సిరులెన్నియొ పొందఁగా నగున్
మనసుపడిన పనికి మాటిమాటికటుల
యడ్డుపడుచు నుండ నప్పెమిగులు ;
తలచినట్టి పనిని దనరించుటందున
స్వేచ్ఛ హెచ్చినపుడె సిరులు కలుగు
ఆ॥ తుచ్ఛమటు తలఁపక దూకుడు పెంచుచు
నిచ్ఛ విడువక కని యింగితమ్ముఁ
గడు స్వతంత్రుఁడటులఁ గష్టపడినఁ జాలు
స్వేచ్ఛ హెచ్చినపుడె సిరులు కలుగు
ఉ॥ తుచ్ఛముఁ గోరకుండఁగను దూకుడు పెంచుచు కార్యశీలతా
యిచ్ఛకు సానబెట్టి కని యింగిత మెంతయొ విజ్ఞతా ధృతిన్
స్వచ్ఛత యత్నమందునను భాసిల నొప్పు స్వతంత్రుఁడై భువిన్
స్వేచ్ఛ మరింత హెచ్చినపుడే సిరులెన్నియొ పొందఁగానగున్
నాకు తెలిసిన కొందరు సైంటిస్టుల విధమండి
బానిసత్వము విడి స్వంతము గాతాను
వర్తకమ్ము నొకటి పట్టణమున
చేయ నెంచినట్టి చిన్న పాణికునకు
స్వేచ్ఛ హెచ్చినపుడె సిరులు కలుగు.
తుచ్ఛుల చెంతబానిసగ దోషమదెంతగ జేయనేమిరా
యిచ్ఛను దీర్చు విత్తమది నెవ్వడు బొందగ జాలడీ భువిన్
స్వేచ్ఛగ వర్తకమ్మదియె బెట్టుగ జేసెడి కోపు దారికిన్
స్వేచ్ఛ మరింత హెచ్చినపుడే సిరులెన్నియొ పొందఁగా నగున్.
వర్త కంబు సేయ వణిజు ల కెటువంటి
షరతు లేవి లేని సమయ మందు
లబ్ది కలిగి మిగుల లాభ దాయ క మౌను
స్వేచ్ఛ హెచ్చి నపుడె సిరులు కలుగు
పద్ధతెరిఁగి పిల్ల పాపలఁ బెంచుట
మంచిపనియె గాని యెంచి చూడ
నెందుమీఁది సక్తి యేర్పడు దానిపై
స్వేచ్ఛ హెచ్చినపుడె సిరులు కలుగు
ఇచ్ఛనెఱింగి బాలకుల నేమఱకన్ తగురీతి వారికిన్
స్వేచ్ఛనొసంగ నెమ్మియగు విద్యలు నేర్వగ సక్తిఁజూపి, యా
యిచ్ఛయె లుప్తమైనయెడ నేమిఫలంబొనగూడు? గావునన్
స్వేచ్ఛ మరింత హెచ్చినపుడే సిరులెన్నియొ పొందఁగా నగున్
స్వచ్ఛమైన రీతి వర్తకంబు నెరప
వచ్చు చుండు ఫలము హెచ్చుగాను
విశ్వ విపణిపైన విశ్వాస ముంచినన్
స్వేచ్ఛ హెచ్చినపుడె సిరులు కలుగు
తుచ్ఛుల నడ్డగించుటకు తొందర పాటున చట్టమేలరా
స్వచ్ఛత తోడ వర్తకము వర్థిలు చుండును వేగవంతమై
స్వేచ్ఛగ వర్తకమ్మనగ పెంపెసగున్ గ్రయ విక్రయంబులే
స్వేచ్ఛ మరింత హెచ్చినపుడే సిరులెన్నియొ పొందఁగా నగున్
ఇది వల దది వలదు పదిల మంచు సతము
నడ్దు పడిన లాభ మరయఁ గలమె
చెలఁగి చేయ వర్తకుల కమ్మకమ్ముల
స్వేచ్ఛ హెచ్చి నపుడె సిరులు కలుగు
ఐచ్ఛిక సంచయమ్ములకు నన్య జనైక దయారసాప్తికై
స్వచ్ఛ మనస్కు లఱ్ఱులను జాచుట యక్కట హేయ కార్యమే
కృచ్ఛ్రము లెన్ని వచ్చినను కృత్య సమీక్షణ నిర్ణయమ్ములన్
స్వేచ్ఛ మరింత హెచ్చి నపుడే సిరు లెన్నియొ పొందఁగా నగున్
సమస్య:
స్వేచ్ఛ మరింత హెచ్చగను శ్రేయములెన్నియొ పొందగాదగున్
ఉత్పలమాల:
స్వచ్ఛపు గాలి నీరు మన స్వంతము జీవుల నుద్ధరింపగన్
తుచ్ఛపు కోర్కెలన్ పరుల తూలగ నాడ సమంజసంబకో
ఇచ్ఛయు లేక సేయు పని యీప్సిత మేగతి తీర్చనోపునే
స్వేచ్ఛ మరింత హెచ్చగను శ్రేయములెన్నియొ పొందగాదగున్
పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
అన్య మనుజుల పయి నాధార పడకుండ
సొంత వర్తకమ్ము కొంత చేయ
గణుతి లేని యంత గడియించె ధనమును
స్వేచ్ఛ హెచ్చినపుడె సిరులు కలుగు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి