7, జూన్ 2025, శనివారం

సమస్య - 5145

8-6-2025 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పూటకు గతి లేనివాఁడె ప్రోచును జనులన్”

(లేదా...)

“పూటకు దిక్కు లేదు మఱి భూజనులెల్లరఁ బ్రోచునెప్పుడున్”

21 కామెంట్‌లు:

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
నాటకమే జీవితమని
నేటికి గలవాడననుచు నిక్కక దయ సా
పాటునిడు చుండి, రాగన్
పూటకు గతి లేనివాఁడె, ప్రోచును జనులన్

ఉత్పలమాల
నాటకమట్లుగన్ జరుగు నమ్మిన నమ్మక పోయినన్ భువిన్
నేటికి గల్గ రేపటికి నీరగు సంపదలంచు జాలి సా
పాటును బాటసారులకు పంచగ నిత్యమహో! గతమ్మునన్
పూటకు దిక్కు లేదు మఱి, భూజనులెల్లరఁ బ్రోచునెప్పుడున్!

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

కం॥ ఆటగఁ దిరిపము నెత్తుచు
పూటకు గతిలేదటంచుఁ బొందిన బిరుదున్
జేటునుఁ బాపు శివుఁడె కద
పూటకు గతిలేనివాఁడె ప్రోచును జనులన్

ఉ॥ ఆటగ బిక్షమెత్తినను హార్దము భక్తిని నిల్పి మ్రొక్కుమా
చేటును బాపు శంకరుఁడు శ్రేయముఁ గూర్చుచు వేడినంతనే
కోటలు దాటు ప్రేమనిడుఁ గోరిన వారికిఁ గల్పవృక్షమౌ
పూటకు దిక్కులేదు మఱి భూజను లెల్లరఁ బ్రోచు నెప్పుడున్

విరించి చెప్పారు...


జూటమున శశిని దాల్చుచు
కాటిని తిరుగాడు వాడు కల్మష గళుడే
పాటలపతియైన శివుడు
పూటకు గతి లేనివాఁడె, ప్రోచును జనులన్.


జూటము నందు చందురుడు శూలము చేతిన గల్గి నిత్యమున్
కాటిని సంచరించు ధరకార్ముకుడాతడె చర్మముండ యా
పాటల యన్నపూర్ణ సగభాగము గాగల యాది భిక్షుకున్
పూటకు దిక్కు లేదు,ౄ మఱి భూజనులెల్లరఁ బ్రోచునెప్పుడున్.


జిగురు సత్యనారాయణ చెప్పారు...

వాటముఁ జూడ బిక్షువగు, వహ్ని లలాటమునుండె, బూషలౌ
కాటులు వేయు పాములన, కప్పెర హస్తముఁబట్టి భిక్షకై
పేటలు సంచరించుచును వేడిన వారిని కాచు శూలికిన్
పూటకు దిక్కు లేదు మఱి భూజనులెల్లరఁ బ్రోచునెప్పుడున్!!

Sitharamayya Solasa చెప్పారు...

ఆటల యందున గెలిచెను
పూటకు గతి లేనివాఁడె ;  ప్రోచును జనులన్
పాటవమును మెచ్చుకొనుచు
సాటి యెవరు లేరని యిడు సంపద తోడన్

M.B.G.TILAK చెప్పారు...

కాటిని తిరుగాడు జటా
జూటుడు నిరతముఁ గనుటకు చోద్యమనంగన్
జీటికి మాటికి వరమిడి
పూటకు గతి లేనివాఁడె ప్రోచును జనులన్

కాటిని సంచరించునట కల్మష కంఠుడు నిత్యమున్ జటా
జూటుడు భస్మ ధారియగు సూక్ష్ముడు చూడఁ ద్రిశూలపాణియై
చాటగ వచ్చుగాదె మరి జాబిలితాల్పుని నాదిభిక్షుగా
పూటకు దిక్కు లేదు మఱి భూజనులెల్లరఁ బ్రోచునెప్పుడున్

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

ఆటల నాడెడు బాలురు
చేటును గలిగించు పనులు జేయుచు నుండన్
దీటుగ స్పందించి యపుడు
పూటకు గతి లేని వాడె ప్రోచును జనులన్

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

Dhanikonda Ravi Prasad చెప్పారు...

కం:మాటాడెను దైవజ్ఞుడు
పూట గడువ టీల నమ్ము బుడుతని గని "య
మ్మా! టీ బాలుడె ప్రభువగు
పూటకు గతి లేని వాడె ప్రోచును జగమున్
(చాయ్ వాలా భవిష్యత్తు లో దేశాన్ని పరిపాలిస్తా డని జ్యోతిష్యుడు అన్నట్టు.)

Dhanikonda Ravi Prasad చెప్పారు...

ఉ:పూటకు తిండి లేకయు ప్రభుత్వము దిట్టుచు సామ్యవాది యై
మాటలు బల్కు నొక్క డభిమానము తో నిలువంగ నెన్నికన్
తోటి జనమ్ము మెచ్చకయు తోచియు తోచక బల్కి రిట్టులన్
"పూటకు దిక్కు లేదు మఱి భూజనులెల్లరఁ బ్రోచునెప్పుడున్”

M.B.G.TILAK చెప్పారు...

ధన్యవాదాలు గురూజీ 🙏

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

కూటము రుద్రావాసము
మేటి తిరిపెగాడతండు మేదినియందున్
చేటును తాఁ దొలగించును
పూటకు గతి లేనివాఁడె ప్రోచును జనులన్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

కూటము వల్లకాడు తను కోరడు భోగము భాగ్యమెన్నడున్
మేటియతండు భక్తులకు మేలగు నభ్యుదయమ్ము గూర్చుటన్
కూటికి నన్నపూర్ణకడ క్షుత్తును దీర్చఁగనేగు శర్వుకున్
పూటకు దిక్కు లేదు మఱి భూజనులెల్లరఁ బ్రోచునెప్పుడున్

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

మేటి ధనవంతుఁ డాతఁడు
సాటి కుబేరునకు నెన్నఁ జక్కఁగ నెత్తెం
గోటికిఁ బడగ లనఁగఁ దాఁ
బూటకు గతి లేని వాఁడె! ప్రోచును జనులన్


కోటలఁ గాంచఁ డుండుటకుఁ గుంజర చర్మము కట్టు గుడ్డ యౌఁ
గాటిఁ జరించు చుండుఁ దమిఁ గంఠము నందు వెలుంగుఁ బుఱ్ఱెలే
కూటికి బిచ్చ మెత్త వలెఁ గొంకక నిత్తెము నాదిబిక్షువే
పూటకు దిక్కు లేదు మఱి భూజను లెల్లరఁ బ్రోచు నెప్పుడున్

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

కోటలు లేకున్నను తా
దీటుగ చేయుచు పనులను తీరుగ నెపుడున్
మాటలు మంచిగ నాడుచు
పూటకు గతిలేని వాడు ప్రోచును జనులన్

జూటము నందుగంగనిడి శూలియు చేతను దాల్చికప్పెరన్
వాటికలేకతిర్గుసతివామపు భాగమునందుయొప్పగన్
మాటలతోనుతింపగనుమానసమందునమెచ్చుశూలికిన్
*“పూటకు దిక్కు లేదు మఱి భూజనులెల్లరఁ బ్రోచునెప్పుడున్”*

Dr H Varalakshmi చెప్పారు...

సమస్య:
"పూటకు దిక్కు లేదు మఱి భూజనులెల్లరఁ బ్రోచునెప్పుడున్”

ఉత్పలమాల (లు) :

1 చేటును గల్గగా సరియు శ్రేయము గూర్చగ వచ్చు శీఘ్రమే
రోటను గట్ట నందసతి రోదన చేయుచు యక్ష మోక్షమున్
పూటకు తింటివా యనెడు పుణ్యము తల్లికి దక్క నిచ్చెనే
నాటక సూత్రధారి మరి న్యాయము తిన్నది పాలువెన్నయే
పూటకు దిక్కులేదు మఱి భూజను లెల్లరఁ బ్రోచు నెప్పుడున్

2 పూటకుపూటకున్ లయము పూరణ యంచును కాశి వీధులన్
నాటక జన్మ దీర్చ మరి నాయకుడీతడు మోక్ష మీయగన్
చాటుగ పూర్ణ చేరి కయి జాచును నా యమ పాత్ర నింపగా
పూటకు దిక్కు లేదు మఱి భూజనులెల్లరఁ బ్రోచునెప్పుడున్”


పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

నీటుగ బూడిద నలదుచు
కాటిని రేయింబవళ్లు కాయుచునుండున్
కూటికి తిరిపంబెత్తుచు
పూటకు గతిలేనివాడె ప్రోచును జనులన్.