10, జూన్ 2025, మంగళవారం

సమస్య - 5148

11-6-2025 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పగఁ బెంచెడి మాట వినిన భద్రము గల్గున్”

(లేదా...)

“పగలం బెంచెడి మాటలన్ వినినచో భద్రంబు నీకయ్యెడిన్”

26 కామెంట్‌లు:

పఠానేని కార్తిక్ చెప్పారు...

మ.
భగవల్లీలలు దివ్య గాథలు జుమీ భాగ్యంబుగా నెంచగన్
విగళత్భక్తి రస ప్రవాహ లహరుల్ వేఁ బారి నిండారి చిత్
ప్రగతిం జూపును లోకమున్ విడని యీ పాప స్వభావమ్ముపైఁ
బగలం బెంచెడి మాటలన్ వినినచో భద్రంబు నీకయ్యెడిన్ !

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

తగులమ్మున తగులుకొనిన
మిగులును సౌఖ్యమ్ము, మిగుల మేలొనగూడున్
తగవులు మనలో తగవవి
పగఁ బెంచెడి, మాట వినిన భద్రము గల్గున్

Sitharamayya Solasa చెప్పారు...

జగమున వింతగు యంహతి
యగుపడి వేగముగ వ్యాప్తి యగుచున్నదనన్
నగరమునందు జనుల గా
పగఁ బెంచెడి మాట వినిన భద్రము గల్గున్

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
తగు రీతి దేశమున నా
పగలున్ సంధానమొనరి ప్రతి పొలమున పా
రగ జలమందు వసతులొ
ప్పగఁ బెంచెడి మాట వినిన భద్రము గల్గున్


మత్తేభవిక్రీడితము
దిగులుంజెందెడు రైతునాదుకొనెడున్ దీరెంచి కాపాడగన్
దగురీతిన్ నదులెల్లఁ గూడనను సంధానమ్ము మేలంచు నిం
పగ నెంచంగ జలాశయాల జలముల్ పారించు సౌకర్యమా
పగలం బెంచెడి మాటలన్ వినినచో భద్రంబు నీకయ్యెడిన్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

పగలున్ రాతిరు లేలనో పగలు కార్పణ్యమ్ములీ తీరుగన్
తగులమ్ముల్ దగులన్ పరస్పరము విస్తారమ్ముగా మేలగున్
తగవుల్ చాలును మాటలన్ విననిచో తథ్యమ్ముగా కయ్యముల్
పగలం బెంచెడి, మాటలన్ వినినచో భద్రంబు నీకయ్యెడిన్

విరించి చెప్పారు...

సుగమమున తోయ మందిన
జగతికి యాహార మదియె జాస్తిగ లభియిం
చుగద నిక వలదనక నా
పగఁ బెంచెడి మాట వినిన భద్రము గల్గున్.



జగతిన్ గాంచగ మానవాళి బ్రతుకన్ సర్వమ్మె ప్రాధాన్యమౌ
సుగమంబౌ కమతమ్మటన్ పొలములే శోభించు నిత్యంబు, నీ
చగ తీరంబున కోవెలల్ వెలిసె విస్తారమ్ముగా గాదె యా
పగలం బెంచెడి మాటలన్ వినినచో భద్రంబు నీకయ్యెడిన్.

M.B.G.TILAK చెప్పారు...

జగడంబులు మటుమాయము
పగలన్ బంతములఁ విడుచు పరిణతి తోడన్
జగమంతా సుఖమయమౌ
పగఁ బెంచెడి మాట వినిన భద్రము గల్గున్

జగమంతా సుఖశాంతులే మనుజులే సంసిద్ధులై యుండగా
సుగుణాలే తనరించు నట్టి దిశగా చూపించి సన్మార్గమున్
జగడంబుల్ తొలగంగ సూక్తులిడుచున్ సౌశీల్యమున్ జూపుమా
పగలం బెంచెడి మాటలన్ వినినచో భద్రంబు నీకయ్యెడిన్

[పెంచు = చంపు, రూపుమాపు]

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

కం॥ వగపులఁ గనని బ్రదుకెలమి
సొగసుగ సద్గుణములొదవ శుభములు విరయున్
జగతిని దుర్గుణములపైఁ
బగఁ బెంచెడి మాట వినిన భద్రము గల్గున్

మ॥ వగపుల్ గాంచక జీవితమ్మొదవ సద్భాగ్యమ్ముతో నొప్పెడిన్
సొగసుల్ మీరఁగ సద్గుణమ్ములు ధరన్ శోభిల్లఁ బ్రాప్తించఁగన్
నగవుల్ పూయవె దుర్గుణమ్ములను మానంగన్ సదా వాటిపైఁ
బగలం బెంచెడి మాటలన్ వినినచో భద్రంబు నీకయ్యెడిన్

చూపఁగ పాపఁగ ఆపఁగ మాపఁగ ఇలాంటివన్ని గకుముందు అర్ధానుస్వరముతో కూడుకున్నాయని వేరే విధంగా వ్రాసానండి.

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

తగు విధ సూచన లొసగుచు
రగడలు లేకుండ జేయు రమణియ పథ o
బగణి త సందియములు బా
పగ బెంచె డి మాట వినిన భద్ర ము గల్గు న్

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'యంహతి' ?

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

M.B.G.TILAK చెప్పారు...

ధన్యవాదాలు గురూజీ 🙏

Dhanikonda Ravi Prasad చెప్పారు...

కం:పగ కాదు బిడ్డ నీ యెడ,
పగలును రాత్రియును కష్ట పడు, గల్లా నిం
పగ జెప్పెతి,బేరము ని
ల్పగఁ, బెంచెడి మాట వినిన భద్రము గల్గున్
(అని వ్యాపారస్తుడు కొడుక్కి చెప్పాడు.)

Dhanikonda Ravi Prasad చెప్పారు...

మ:పగవారెవ్వరు లేరు ,గెల్తు ననుచున్ భావించ కో నాయకా!
పగ నీ పక్షము నందు కొందరికి నేర్పాటయ్యె,నీ మిత్రులన్
పగలం బెంచెడి వారి ఘోష వినినన్ భద్రంబు నీకయ్యెడిన్”
పగలన్ దీర్చు నుపాయ మైన వెదుకన్ బాగౌను నీ కెన్నికన్.
(నీ పక్షం లోనే నీకు పగవాళ్లున్నారు.నీ మిత్రుల్లో పగ పెంచే మాటలు మాట్లాడుతున్నారు.అవ్వి విను.పగ తీర్చే ఉపాయ మైనా ఆలోచిస్తే మంచిది.)

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

నగ పతిత వర్ష జల మిం
పుగ నొక చోఁ గూడు యత్నము లొనర్చి వెసం
దగు రీతిని విమల జ లా
పగఁ బెంచెడి మాట వినిన భద్రము గల్గున్


తగునే పంతము లెల్ల వేళల వృథా దర్పమ్ము నీ కేలనో
వగలే కల్గును బూనినం బగలు సంబంధమ్ము లెల్లం జెడుం
జిగురింపంగ సహోదరత్వ మిలఁ గించిత్స్నేహమున్, మాన్పుచుం
బగలం, బెంచెడి మాటలన్ వినినచో భద్రంబు నీ కయ్యెడిన్

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

దివ్యగాథలు సుమీ ; విగళద్భక్తి ; వే పాఱి

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

అగణిత సందియములు – వైరి సమాసము; సందియములు వాపఁగ

శేషాద్రి సోమయాజులు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
శేషాద్రి సోమయాజులు చెప్పారు...

తగువులు తంటాలుండక‌
తగుసంస్కారము‌ విలువలు‌ ధర్మము‌ తెలిపే‌
టి గురువు మన మంచికి చె‌
ప్పగఁ బెంచెడి మాట వినిన భద్రము గల్గున్

Dr H Varalakshmi చెప్పారు...

సమస్య:
“పగలం బెంచెడి మాటలన్ వినినచో భద్రంబు నీకయ్యెడిన్”

మత్తేభవిక్రీడితము:

సిగలం బట్టుచు రౌద్రమున్ వలదుగా శీఘ్రంపు నొప్పందమున్
పగలే లేవుగ, జ్ఞాతివైరమను కోపంబేమి లేదే మరీ
తగవే వెట్టుచు పాలుపంచకయు తాత్సర్యంబు నేలో భళా
పగలం బెంచెడి మాటలన్, వినినచో, భద్రంబు నీకయ్యెడిన్”

(ధర్మరాజు సంధి సందేశం)

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

రగులును కలహము లింకను
పగఁ బెంచెడి మాట వినిన; భద్రము గల్గున్
పగ వలనకలుగు నష్టము
తగు రీతిగ నచ్చ చెప్ప తగవులయందున్.

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

జగతిని ననవరతమ్మును
జగతిని యాపంగనెంచు జనముల పనులన్
రగిలెడు కలహంబుల నా
*"పగఁ బెంచెడి మాట వినిన భద్రము గల్గున్”*



తగదీకార్యమువీనులార విను మీదాక్షిణ్యమున్వీడుమా
పగతుండీతడు కాడు బాలుడితడున్ వారించగా నెంచెగన్
జగదీశుండితడంచువేగ పలికెన్ శాంతమ్ము గారాజుతో
*“పగలం బెంచెడి మాటలన్ వినినచో భద్రంబు నీకయ్యెడిన్”*