13-6-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దైవోపహతునకు సౌఖ్యమబ్బు”
(లేదా...)
“దైవోపహతుండు పోవు కడకుం జేరున్ గదా సౌఖ్యముల్”
(ఛందో గోపనము)
క్షుత్తు కలుగ దానిని దీర్చుకొనగ లేనినెవ్వ జవిగొనుటనునది నిత్యము గొన సాగు దైవోపహతునకు సౌఖ్యమబ్బు ,రేపటికనుచు నేమియు లేనినాడు
చూడగ మనుజులెల్లరుఁ సుఖముఁ గోరుకోరి సల్పిన యత్నముల్ గురిని దప్పతప్పక వెఱచి వ్యర్థుడు తాను జచ్చుచచ్చు దైవోపహతునకు సౌఖ్యమబ్బు
నీ యనుష్ఠాన ఫలమదే నీకు దక్కిస్వర్గ సుఖముల నందింప వచ్చితిగదనన్నిటకు జేర్చె నీదు పుణ్యఫలము ప్రవరాఖ్య! దైవోపహతునకు సౌఖ్యమబ్బు?*(దైవోపహతునకు సౌఖ్యమబ్బదు అని.)*అవమంబౌ క్రియలెన్నియో సలిపు పాపాత్ముండ్రె యైనన్ భువిన్ భవమున్ ద్రుంచెడి వాడటంచు కడు విశ్వాసమ్ము తో కొల్చుచున్ భవుడా లింగపు రూపునిన్ గనిన సంప్రాప్తించు సంసిద్ధి హేశివ! దైవోపహతుండు పోవు కడకుం జేరున్ గదా సౌఖ్యముల్
వేదాధ్యాపకుడైనగాని మదిలో వేసారు దుఃఖంబుతోవేదాంతమ్మును నేర్చుకొన్నఁ బ్రతుకే విస్పష్టమౌ భారమైచేదై తోచగ నిష్ప్రయోజకునిగా జీవేచ్చ కోల్పోయి వేచే దైవోపహతుండు పోవు, కడకుం జేరున్ గదా సౌఖ్యముల్
దైవ లీలల నె న్నంగ దరము గాదు పేద వానికి లభియించు పెన్ని ధు లిల కలిమి కోల్పోయి కొందరు కలత చెంద జగతి దైవో పహతు నకు సౌఖ్య మబ్బు
కం:అహమును వీడిన యాతనిసహనము సతతమ్ము నిడును శాంతిని, దైవోపహతునకు సౌఖ్యమబ్బుట,యిహమున తాత్కాలిక మయి యిడు దుఃఖమునే.
శా:ఏ దుర్మార్గము లేక, దైవ మెదియో యీయంగ, నద్దానినేనాదంచున్ బ్రతుకంగ సేమ మగు లంచమ్ముల్ కడున్ మేయుటే నీదౌ కోర్కెయె ఓ సతీ!వినుము వానిన్ మేయు దుష్టుండె ఓ సీ!దైవోపహతుండు పోవు, కడకుం జేరున్ గదా సౌఖ్యముల్”(లంచాలు మెయ్యటానికి దైవోపహతుడే పోతాడు.వాడి సుఖాలు కడకు చేరతాయి అనగా అంత మౌతాయి అని భార్యతో అన్నట్టు.)
సకల పాప సంచయ వినాశకము చక్రి నామ సంకీర్తనంబె యనవరతమ్ము ధరణి హరినామ నిత్య చింతా నిమిత్త శమిత దైవోపహతునకు సౌఖ్య మబ్బు కర మాశ్చర్యము లింక నశ్వరములం గాంతావతంసంబ యో యరవిందాంబక! సర్వ సంపదల నీయన్నేర్తు వింపార సుస్వర సంకీర్తన సన్నుతుల్ సలిపినం జాంచల్య చిత్తాఖ్య! యో సిరి! దైవోపహతుండు పోవు కడకుం జేరున్గదా సౌఖ్యముల్
తేటగీతిద్వారపాలకుఁడు హరికి వైరియగుచుప్రభువు యానతిన్ భువిపైన ప్రభవమొందిచెలఁగ దైత్యుఁడు దునిమె నృసింహమగుచుశౌరి, దైవోపహతునకు సౌఖ్యమబ్బు!మత్తేభవిక్రీడితముమునులావేశమునొంది శాపమిడగన్ బ్రోవంగ వైకుంఠుడున్దనవారంచును ద్వారపాలకులపై దాక్షిణ్యమున్ జూపుచున్దనరన్ వైరులుకమ్మనెన్ వరముగన్ దండింప ప్రాణంబు బాసిన, దైవోపహతుండు పోవు కడకుం జేరున్ గదా సౌఖ్యముల్!
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.వచ్చు నాపదల్ బ్రతుకున వ్యవధి లేకజగతి దైవోపహతునకు; సౌఖ్యమబ్బుదానముల్ జేసి తనకున్న దానిలోనెసత్పథమునందు నడచెడు సజ్జనులకు.
మనమందున్ ధృతిలేక సంశమము సంభావింపఁగా మృగ్యమైతన వారెవ్వరు తోడురాక నిలలో దానొంటియైయుండనీశుని నీమంబుగ నిల్పి నెమ్మనమునన్ శుద్ధాత్ముడై పూజ జేసిన దైవోపహతుండు పోవు కడకుం జేరున్ గదా సౌఖ్యముల్
దెబ్బపైనదెబ్బపడుచు దిశయు చెడునుజగతి*“దైవోపహతునకు, సౌఖ్య మబ్బు”*సతము సన్మార్గ మందున సాగు మంచివారలకు దైవ కృప చేత వసుధ యందుడా బల్లూరి ఉమాదేవి అడుగుల్ మూడును చాలటంచునట నాబాలుండుపల్కంగనేవడిగానెంచెనొసంగగా విభుడటన్వారించినన్శుక్రుడున్తడవున్సేయకమూడులోకములతాదానంబొసంగన్నటన్*చెడి"దైవోపహతుండు పోవు కడకుం జేరున్ గదా సౌఖ్యముల్”*:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
14 కామెంట్లు:
క్షుత్తు కలుగ దానిని దీర్చుకొనగ లేని
నెవ్వ జవిగొనుటనునది నిత్యము గొన
సాగు దైవోపహతునకు సౌఖ్యమబ్బు ,
రేపటికనుచు నేమియు లేనినాడు
చూడగ మనుజులెల్లరుఁ సుఖముఁ గోరు
కోరి సల్పిన యత్నముల్ గురిని దప్ప
తప్పక వెఱచి వ్యర్థుడు తాను జచ్చు
చచ్చు దైవోపహతునకు సౌఖ్యమబ్బు
నీ యనుష్ఠాన ఫలమదే నీకు దక్కి
స్వర్గ సుఖముల నందింప వచ్చితిగద
నన్నిటకు జేర్చె నీదు పుణ్యఫలము ప్రవ
రాఖ్య! దైవోపహతునకు సౌఖ్యమబ్బు?
*(దైవోపహతునకు సౌఖ్యమబ్బదు అని.)*
అవమంబౌ క్రియలెన్నియో సలిపు పాపాత్ముండ్రె యైనన్ భువిన్
భవమున్ ద్రుంచెడి వాడటంచు కడు విశ్వాసమ్ము తో కొల్చుచున్
భవుడా లింగపు రూపునిన్ గనిన సంప్రాప్తించు సంసిద్ధి హే
శివ! దైవోపహతుండు పోవు కడకుం జేరున్ గదా సౌఖ్యముల్
వేదాధ్యాపకుడైనగాని మదిలో వేసారు దుఃఖంబుతో
వేదాంతమ్మును నేర్చుకొన్నఁ బ్రతుకే విస్పష్టమౌ భారమై
చేదై తోచగ నిష్ప్రయోజకునిగా జీవేచ్చ కోల్పోయి వే
చే దైవోపహతుండు పోవు, కడకుం జేరున్ గదా సౌఖ్యముల్
దైవ లీలల నె న్నంగ దరము గాదు
పేద వానికి లభియించు పెన్ని ధు లిల
కలిమి కోల్పోయి కొందరు కలత చెంద
జగతి దైవో పహతు నకు సౌఖ్య మబ్బు
కం:అహమును వీడిన యాతని
సహనము సతతమ్ము నిడును శాంతిని, దైవో
పహతునకు సౌఖ్యమబ్బుట,
యిహమున తాత్కాలిక మయి యిడు దుఃఖమునే.
శా:ఏ దుర్మార్గము లేక, దైవ మెదియో యీయంగ, నద్దానినే
నాదంచున్ బ్రతుకంగ సేమ మగు లంచమ్ముల్ కడున్ మేయుటే
నీదౌ కోర్కెయె ఓ సతీ!వినుము వానిన్ మేయు దుష్టుండె ఓ
సీ!దైవోపహతుండు పోవు, కడకుం జేరున్ గదా సౌఖ్యముల్”
(లంచాలు మెయ్యటానికి దైవోపహతుడే పోతాడు.వాడి సుఖాలు కడకు చేరతాయి అనగా అంత మౌతాయి అని భార్యతో అన్నట్టు.)
సకల పాప సంచయ వినాశకము చక్రి
నామ సంకీర్తనంబె యనవరతమ్ము
ధరణి హరినామ నిత్య చింతా నిమిత్త
శమిత దైవోపహతునకు సౌఖ్య మబ్బు
కర మాశ్చర్యము లింక నశ్వరములం గాంతావతంసంబ యో
యరవిందాంబక! సర్వ సంపదల నీయన్నేర్తు వింపార సు
స్వర సంకీర్తన సన్నుతుల్ సలిపినం జాంచల్య చిత్తాఖ్య! యో
సిరి! దైవోపహతుండు పోవు కడకుం జేరున్గదా సౌఖ్యముల్
తేటగీతి
ద్వారపాలకుఁడు హరికి వైరియగుచు
ప్రభువు యానతిన్ భువిపైన ప్రభవమొంది
చెలఁగ దైత్యుఁడు దునిమె నృసింహమగుచు
శౌరి, దైవోపహతునకు సౌఖ్యమబ్బు!
మత్తేభవిక్రీడితము
మునులావేశమునొంది శాపమిడగన్ బ్రోవంగ వైకుంఠుడున్
దనవారంచును ద్వారపాలకులపై దాక్షిణ్యమున్ జూపుచున్
దనరన్ వైరులుకమ్మనెన్ వరముగన్ దండింప ప్రాణంబు బా
సిన, దైవోపహతుండు పోవు కడకుం జేరున్ గదా సౌఖ్యముల్!
పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
వచ్చు నాపదల్ బ్రతుకున వ్యవధి లేక
జగతి దైవోపహతునకు; సౌఖ్యమబ్బు
దానముల్ జేసి తనకున్న దానిలోనె
సత్పథమునందు నడచెడు సజ్జనులకు.
మనమందున్ ధృతిలేక సంశమము సంభావింపఁగా మృగ్యమై
తన వారెవ్వరు తోడురాక నిలలో దానొంటియైయుండనీ
శుని నీమంబుగ నిల్పి నెమ్మనమునన్ శుద్ధాత్ముడై పూజ జే
సిన దైవోపహతుండు పోవు కడకుం జేరున్ గదా సౌఖ్యముల్
దెబ్బపైనదెబ్బపడుచు దిశయు చెడును
జగతి*“దైవోపహతునకు, సౌఖ్య మబ్బు”*
సతము సన్మార్గ మందున సాగు మంచి
వారలకు దైవ కృప చేత వసుధ యందు
డా బల్లూరి ఉమాదేవి
అడుగుల్ మూడును చాలటంచునట నాబాలుండుపల్కంగనే
వడిగానెంచెనొసంగగా విభుడటన్వారించినన్శుక్రుడున్
తడవున్సేయకమూడులోకములతాదానంబొసంగన్నటన్
*చెడి"దైవోపహతుండు పోవు కడకుం జేరున్ గదా సౌఖ్యముల్”*:
కామెంట్‌ను పోస్ట్ చేయండి