13, జూన్ 2025, శుక్రవారం

సమస్య - 5151

14-6-2025 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“స్త్రీ మీసము మీఁద నడచె చీమ రయమునన్”

(లేదా...)

“స్త్రీ మీసమ్ముల మీఁదఁ జీమ నడచెన్ జీకాకు గల్గించుచున్”

21 కామెంట్‌లు:

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
ఏమా సందేహమ్మది?
చీమలు తీపిఁ దిన చేరు చిత్రమ్మదియా!
భామ పెదవంటితో? శా
స్త్రీ! మీసము మీఁద నడచె చీమ రయమునన్!

శార్దూలవిక్రీడితము
ఏమా సందియమట్లు చూచెదవొకో! యెంచంగ సత్యమ్మనన్
చీమల్ తీపిని చుట్టుచున్ తిరుగుటల్ చిత్రమ్మె? ప్రేమార్ద్రమై
భామన్ గౌగిటఁ జేర్చి మోవిఁ గొనితో! పైనంటెనో తీపి! శా
స్త్రీ! మీసమ్ముల మీఁదఁ జీమ నడచెన్ జీకాకు గల్గించుచున్!

Sitharamayya Solasa చెప్పారు...

ఏమి జరిగెనో తెలుసా !
ప్రేమగ నాయన యొసగిన విగ్రహములలో
కోమలికి మీస దిద్దగ
స్త్రీ మీసము మీఁద నడచె చీమ రయమునన్

విరించి చెప్పారు...


ఏమని చెప్పను ప్రేమగ
భామయె కట్టించినట్టి పరమాన్నముతో
జేమనము భుజించిన మే
స్త్రీ మీసము మీఁద నడచె చీమ రయమునన్.



ప్రేమాప్యాయత తోడ భర్తకొరకై పెండ్లాము బోనమ్ముగా
క్షేమమ్మిచ్చెడి శాకహార కడియున్ క్షీరాన్నమున్ బెట్టగా
నామధ్యాహ్నము నారగించు వడిలోనాపాయ సంబంటి శా
స్త్రీ మీసమ్ముల మీఁదఁ జీమ నడచెన్ జీకాకు గల్గించుచున్.

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

ఏమని దెల్పుదు వనమున
సేమముగా పూలతలకు చెలువము మీరన్
దామము ముడివేసెడు మే
స్త్రీ మీసము మీఁద నడచె చీమ రయమునన్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

ఆమీసమ్ముల సౌరు యభ్రపథమం దంభోధరంబేసుమీ
యేమావొంపులు పాఱుచున్నఝరియై యేపారు చుండెన్ గనన్
సామీరిన్ తలపించుచున్ గుబురు మీసంబుల్ మిటారించ, శా
స్త్రీ మీసమ్ముల మీఁదఁ జీమ నడచెన్ జీకాకు గల్గించుచున్

M.B.G.TILAK చెప్పారు...

చీమలపై శోధనకై
గ్రామంబులఁ దిరిగి చూడగా మిక్కుటమౌ
చీమల పుట్టలు సాల
స్త్రీ మీసము మీఁద నడచె చీమ రయమునన్

స్త్రీ మూలంబున కల్గుపాట్ల వలనన్ జింతించు చున్నట్టి శా
స్త్రీ! మోమాటము లేనివౌ పనులతోఁ జీత్కారముల్ పొందు మే
స్త్రీ! మాచాకలి మోముపైనఁ గనుమా చేపట్ట వస్త్రాల ని
స్త్రీ మీసమ్ముల మీఁదఁ జీమ నడచెన్ జీకాకు గల్గించుచున్

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

నీమము తో కష్టపడుచు
కామితముగ నిదుర వోవు కమ నీ యున కున్
మోమున పెరిగిన దౌ మే
స్త్రీ మీసము మీద నడిచె చీమ రయము నన్

Dhanikonda Ravi Prasad చెప్పారు...

కం:ఏమని వర్ణింతు ప్రియా
!
నీ మథురాథరము ప్రేమ నింపుచు నిన్నన్
నా మూతి దాకగా నో
స్త్రీ ! మీసము మీఁద నడచె చీమ రయమునన్”
(ఇదొక అతిశయోక్తి తో చమత్కారం.తనని ఒక స్త్రీ ముద్దు పెడితే అది తియ్యగా ఉండి ఆ తరవాత ఆ తీపి కోసం ఒక చీమ నడిచిందని కవిత్వం చెప్పినట్టు.యథాతథ పూరణ.)

Dhanikonda Ravi Prasad చెప్పారు...

శా:ఆ మూర్ఖత్వ మదేమొ!దాని సొగసే ఐపోయె,దా నేలనో
వ్యామోహమ్మున ముద్దిడెన్ కవితలో వర్ణించ ,"చుంబించ నా
స్త్రీ మీసమ్ముల మీఁదఁ జీమ నడచెన్ జీకాకు గల్గించుచున్
నా మీసమ్ములె తీసి వేతు వదిలించన్ మైలయే వానికిన్"
(వయస్సు మళ్లిన ఒక స్త్రీ బలవంతం గా ముద్దెట్టుకుంటే వీడికి మీసాల మీద చీమలు పాకినట్టు అనిపించింది.)

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సౌరు + అభ్రపథ' మన్నపుడు యడాగమం రాదు. 'వొంపులు' అనడం సాధువు కాదు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

వాట్సప్ సమూహంలో సమీక్షించిన పద్యాలను ఇక్కడ ఉపేక్షించడం జరిగింది. గమనించగలరు.

M.B.G.TILAK చెప్పారు...

ధన్యవాదాలు గురూజీ 🙏

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

మీ మీఁదఁ జరింపం గల
దేమఱకుండ వలె మాన వేశ్వర! నిత్యం
బో మాననీయ! లాలిత
స్త్రీ! మీ సము మీఁద నడచెఁ జీమ రయమునన్


ఏమీ వింత యొకింత యేని భయ మీ హీనాంగి దా నూనదే
యీ మర్త్యోత్తముఁ గాంచి యిప్పగిది నీ వీక్షించి వే పల్కుమా
ధీమంతా! ఫలితమ్ము నిట్లయిన జ్యోతిశ్శాస్త్ర విజ్ఞాన శా
స్త్రీ! మీసమ్ముల మీఁదఁ జీమ నడచెన్జీకాకు గల్గించుచున్

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

భామామణి పాయసమిడ
ప్రేమగ గైకొనుచునుండ పెదవిని నంటన్
చీమలు పట్టుట గనె, శా
స్త్రీ!మీసము మీద నడచె చీమ రయమునన్.

Dr H Varalakshmi చెప్పారు...

ఏమాయాత్రము మమ్ము కంట గనవే యేమార్తువే ప్రేయసీ !
మా మాటే వినవేల గాంచవుగదా మా శౌర్య రూపంబులన్
నీ మాయన్ కనుగప్ప వేఱు దలపే నీపేరు మంత్రంబు, నో
స్త్రీ, మీసమ్ములమీద జీమ నడిచెన్ జీకాకు గల్గించుచున్
లేమా నీవెగ దిక్కు సాయపడగన్ మేలెంచు రక్షింపగన్

Surya చెప్పారు...

ఆ మీసంబును దీయకే చెలగి భావావేశ సంస్ఫూర్తితో
రామారావల నాగమాంబగ నటప్రావీణ్యమున్ జూపినన్
నేమా తత్తరపాటు సుంతన నతండే బల్కె హాస్యంబుగా
స్త్రీ మీసమ్ముల మీఁదఁ జీమ నడచెన్ జీకాకు గల్గించుచున్

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

ప్రేమగ గనుచును పతినా
స్త్రీ,మీసముమీదనడచె చీమరయముగన్
సేమమునరయుచువడిగా
సామముతోడతొలగించెజవముగ దానిన్

డా బల్లూరి ఉమాదేవి

మోమోటమ్మదిలేకమందిరము నన్ మున్ముందుగానచ్చటన్
తోమోదమ్మునపానకమ్మునుగొనన్తోషమ్ముతోడన్వడిన్
తామోహమ్మునబొందుచున్నట వడిన్ త్రాగంగచేరెంగ మే
*“స్త్రీ మీసమ్ముల మీఁదఁ జీమ నడచెన్ జీకాకు గల్గించుచున్*.