22, జూన్ 2025, ఆదివారం

సమస్య - 5160

23-6-2025 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“అవధానమ్మునకు జ్ఞాన మక్కర యగునా”

(లేదా...)

“అవధానమ్మున జ్ఞాననేత్రమును మూయం జెల్లు గెల్పొందఁగన్”

15 కామెంట్‌లు:

Sitharamayya Solasa చెప్పారు...

కవులెడపదడప జేసెడి
యవధానమ్మునకు జ్ఞాన మక్కర యగునా”
అవివేకి యట్టుల నడుగగ
ఎవరయినను‌ గాని వానికెరిగించ నగున్

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
కవనము పాండిత్యమ్ములు
స్తవనీయమమై సమస్య సాధింపఁదగున్!
జవమున నాక్షేపించెడు
నవధానమ్మునకు జ్ఞాన మక్కర యగునా?

మత్తేభవిక్రీడితము
కవనమ్మొల్కుచు పాండితీ ప్రభలతోఁ గావింపగన్ బృచ్ఛకుల్
స్తవనీయమ్మని మెచ్చనొప్పెడు సమస్యాపూరణల్ భావ్యమౌ!
వ్యవహారమ్మది పూరణాసరళినే వారించు నాక్షేపణౌ
యవధానమ్మున జ్ఞాననేత్రమును మూయం జెల్లు గెల్పొందఁగన్

పఠానేని కార్తిక్ చెప్పారు...

ఆక్షేపణయౌ అని ఉండాలండి. తత్సమ శబ్దం కనుక.

పఠానేని కార్తిక్ చెప్పారు...

మ.
కవనోత్సాహ విలాస భావముల సౌఖ్యంబొంద లేనట్టిదై
పవలుం కాంతిగ వెల్గె వేదికయె సంపద్వాద్య బృందమ్ముతో
వివరంబెందుకు రాగ మాలికల ప్రావీణ్యంబుఁ జూపించెడీ
యవధానమ్మున జ్ఞాన నేత్రమును మూయం జెల్లు
గెల్పొందగన్ ‌!

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

కం॥ కవుల నడుగ పాడి యగునె
అవధానమ్మునకు జ్ఞాన మక్కర యగునా
కవితా రసఝరి పారఁగ
నవధిఁ గనని జ్ఞానమొకటె యాధారమగున్

మ॥ నవకమ్ముఁ గని పద్యపూరణల సన్నాటా మొనన్ దాటఁగన్
గవి విన్యాసము విజ్ఞతా ప్రతిభ సాక్షాత్కారమౌఁ గాంచఁగా
నవధానమ్మున జ్ఞాననేత్రమును, మూయంజెల్లు గెల్పొందఁగన్
జెవులన్ దాను సభాస్థలిన్ విరియు విచ్ఛేదమ్ములన్ బూర్తిగా

సన్నాటా అల్లకల్లోము మొన వ్యూహము (నిఘంటువు సహాయమండి) విచ్ఛేదము అంటే ఆటంకము ఖండనలు అన్నీ వస్తాయనే భావముతో నండి

M.B.G.TILAK చెప్పారు...

వ్యవధానము శూన్యంబగు
యవధానమ్మునకు జ్ఞాన మక్కర యగునా?
వివరింప నేల కనుగొన
నవధానికి వలయు జ్ఞాన మద్భుత రీతిన్

అవధానమ్మును చూచుచుందురు కదా యాద్యంతమాస్వాద్యమై
వ్యవధానమ్ము రవంతలేని దయినన్ బాలించు విజ్ఞానమే
లవలేశంబగు వాస్తవమ్ము కలదా లంకించు వ్యాఖ్యానమే
'యవధానమ్మున జ్ఞాననేత్రమును మూయం జెల్లు గెల్పొందఁగన్'

విరించి చెప్పారు...


కవమున్ జెప్పగ లేని కు
కవులే ప్రాశ్నికులు గాగ గాలోడితులౌ
వివరిణులు ప్రేక్ష కులయిన
నవధానమ్మునకు జ్ఞాన మక్కర యగునా.


జవమున్ బద్యము జెప్పలేని పలు పార్షద్యుండ్రె ప్రశ్నింప పా
టవమేలేధి సవాలులన్ విసర కష్టంబంచు భావింపగా
సవరింపంగను లేనిసూరి యొకడున్ సంచాలకుండైనచో
యవధానమ్మున జ్ఞాననేత్రమును మూయం జెల్లు గెల్పొందఁగన్.

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

కవుల సమస్య ల పూరణ
కవ ధా న మ్ము న కు జ్ఞాన మక్కర యగు :: నా
కవి వరునకు దగు ప్రతిభ యు
జవమున ధారణ ము జేయు చతురత వలయున్

Dhanikonda Ravi Prasad చెప్పారు...

కం:వివరమ్ము నెరుగకున్నను
చెవితో విని తిరిగి యప్ప జెప్పుట చాలున్
చెవి కింపు గూర్చు వేదపు
టవధానమ్మునకు జ్ఞాన మక్కర యగునా”
(అవధానం అనేది మొదట వేదవిద్య తో వచ్చింది.దాని అర్ధం తెలియకున్నా అది వినటానికి సొంపుగానే ఉంటుంది.)

Dhanikonda Ravi Prasad చెప్పారు...

మ:ఎవడో గిట్టని వాని మెచ్చుకొని ని న్నే యొక్కడో చెప్ప నా
శువు కోరంగనె" వాడు నచ్చడు కదా!శుంఠన్ బ్రశంసించుటా ?
కవి నౌ నాకిది ధర్మమా?" యనకు నీ కర్మమ్ము కీర్తించుటే
అవధానమ్మున జ్ఞాననేత్రమును మూయం జెల్లు గెల్పొందఁగన్”
(అవధానానికి అంతరాత్మ తో,తన సిద్ధాంతాలతో నిమిత్తం లేదు.ఎవడో ఫలానా నాయకుణ్ని ప్రశంసిస్తూ ఆశువు చెప్పు అంటే చెప్పటమే. కాసేపు జ్ఞాననేత్రాన్ని మూసుకోవటమే.)

Dr H Varalakshmi చెప్పారు...

సమస్య:
అవధానమ్మున జ్ఞాననేత్రమును మూయం జెల్లు గెల్పొందఁగన్”

మత్తేభము:

అవధానంబది సేయసాధ్యమగునే యా యంత్రబున్ గాంచియే
వ్యవధానంబున ప్రాశ్నికుల్ నుడువరే వ్యాజ్యంపు మేల్ పూరణల్
నవ యంత్రమ్ముల సాయమున్ ఘనవధానంబే సుఖంబే యనా
అవధానమ్మున జ్ఞాననేత్రమును మూయం జెల్లు, గెల్పొందఁగన్”
శ్రవణానందము లేని లోపమున ప్రాశస్థ్యంబు నే నొల్లనే

(ఒక పిల్ల అవధానిగారు గణింతయంత్రం లో నా సమస్య పెట్టుకుంటూ, ఇప్పుడందరూ పిల్ల పృచ్ఛకురాళ్లే నీలాగా అన్నాడు. అప్పటి నించి అవధానాలకి, అవధానులకి దూరంగా ఉంటున్నాను.. అది గుర్తొచ్చి వ్రాసినది )






కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

వివరింపఁగ మోక్షార్థ
మ్ము విరిసిన తెలివియె జ్ఞానము తదితరము కా
దవనీ తలమున నెన్నఁడు
నవధానమ్మునకు జ్ఞాన మక్కఱ యగునా


భువిలో నెందుఁ బరాజయమ్ము కలదే పూజింపఁ గాత్యాయనిన్
శ్రవణానందముగా నుతింతు సతి శర్వాణిన్ విశేషించి నే
నవలోకించి సనాతనంపు గతిఁ బూజార్థమ్ము పీఠమ్ముపై
నవ ధానమ్మున జ్ఞాన నేత్రమును మూయం జెల్లు గెల్పొందఁగన్

[అవ ధానమ్మున = అవ్వను నుంచుట యందు; మూయను =మూసియుంచను; చెల్లు = తగును]

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

అవధుల్ మీరిన యంతరాయములతో నవ్యక్తమౌ ప్రశ్నలన్
యవధానిన్కెరలించు ప్రాశ్నికుల హాస్యమ్మున్ నిభాయించుచున్
వివరించంగ వధాని పృచ్ఛకులకున్ విన్నాణముం జూపుచున్
అవధానమ్మున జ్ఞాననేత్రమును మూయం జెల్లు గెల్పొందఁగన్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

అవధులు దాటిన ప్రశ్నలు
నవధానికి విసుగుదెచ్చు నప్రస్తుతముల్
వివరించగ ప్రతివాద
మ్మవధానమ్మునకు జ్ఞాన మక్కర యగునా

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

జవముగ ప్రాశ్నికులడుగగ
జవాబులనిడియెడునేర్పుచక్కగ యున్నన్
కవికికలుగ వాణిదయయు
*"అవధానమ్మునకు జ్ఞాన మక్కర యగునా”*

స్తవనమ్మున్ విడకుండగన్ సతముభాషాలక్ష్మినేతల్చుచున్
యవధానంబునుచేయు వారలకు సవ్యంబౌసమాధానముల్
నవభావమ్ములతోడపొంగగనునానారీతులన్నచ్చటన్
*“అవధానమ్మున జ్ఞాననేత్రమును మూయం జెల్లు గెల్పొందఁగన్”*