26, జూన్ 2025, గురువారం

సమస్య - 5164

27-6-2025 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“అండముఁ గలుపంగఁ జారు కద్భుత రుచియౌ”

(లేదా...)

“అండమ్మున్ గలుపంగఁ జారునకు దివ్యస్వాదమందెన్ గదా”

18 కామెంట్‌లు:

కంది శంకరయ్య చెప్పారు...

మెండుగ నుడికిన పప్పును
పిండియుఁ దగు చింత పులుసు వేసి పొగిచినన్
వెండియు దినుసులు మఱి కూ
ష్మాండముఁ గలుపంగఁ జారు కద్భుత రుచియౌ.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
పండినవని పొరుగింటను
దండిగ, మాకొక్కటివ్వ, దంపతి పలికెన్
వండెద, శామీలపు కూ
ష్మాండముఁ గలుపంగఁ జారు కద్భుత రుచియౌ!

Dhanikonda Ravi Prasad చెప్పారు...

కం:వండగ శాకము లెన్నియు
పండుగ యాచారి కగును పప్పును వేయన్
నిండుగ మాంసాహారము
నండముఁ గలుపంగఁ జారు కద్భుత రుచియౌ”
(భోజనానికి వచ్చిన వారిలో ఒకడు ఆచారి.ఒకడు జార్.)

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

శార్దూలవిక్రీడితము
పండంగన్ పొరుగింటిలో పెరడునన్ బంపించ మాయింటికిన్
దండమ్మంచును గారవించి సతియే దట్టించి తా నింగువన్
వండంగన్ దగురీతి పక్వముగ సర్వామోదమౌ భూతికూ
ష్మాండమ్మున్ గలుపంగఁ జారునకు దివ్యస్వాదమందెన్ గదా!

(బూడిద గుమ్మడికాయ మజ్జిగ పులుసు/చారు నేపథ్యంగా...)

Dhanikonda Ravi Prasad చెప్పారు...

శా:దండమ్ముల్ పలు బెట్టి పిల్చితి జమీందారైన యా జారునిన్,
దండన్ వేసితి స్వాగత మ్మనుచు, మోద మ్మొందు విం దిచ్చితిన్,
వండన్ గుమ్మడి కాయ కూర మురిసెన్,వాడింక నా వాడె కూ
ష్మాండమ్మున్ గలుపంగఁ జారునకు దివ్యస్వాదమందెన్ గదా”
(చాలా హైక్లాస్ జారిణి. జమీందారైన జారుణ్ని ఇంత మర్యాద తో వలలో వేసింది.ఆ గుమ్మడికాయ కూరకే జమీందారు తన వా డైపోతాడని నమ్మకం.)

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

కం॥ మెండగు రుచులను వలచిరి
నిండుగ మనుజులు ధరణిని నెరి పలలమటుల్
వండి తిను జనులు తెలిపిరి
యండముఁ గలుపంగఁ జారు కద్భుత రుచియౌ

శా॥ వండంగన్ దరుశాకమూలముల భవ్వంబంచు భావించఁగన్
గండల్ పుష్టిగ వృద్ధిఁ జెందునని శాకాహారులౌ భోక్తలున్
జండా పాఁతుచుఁ దెల్పిరే జనులు మాంసాహార భోజ్యంబులో
నండమ్మున్ గలుపంగఁ జారునకు దివ్యస్వాదమందెన్ గదా!

నెరి ఆచారము విధము (నిఘంటువు సహాయమండి)

విరించి చెప్పారు...


దండి పిరిమితో నీవిట
వండిన వంటలవి యెల్ల బ్రహ్మాండంబే
చండిక! సుగంధ ద్రవ్యపు
బండముఁ గలుపంగఁ జారు కద్భుత రుచియౌ.


దండై వచ్చిరి వంట సేయగను బ్రాతఃకాలమున్ కొమ్మలే
రండో బాలకులార యంచు పిలువన్ బ్రాజ్ఞా నిధుల్ వారలే
భాండమ్మందున నున్న వంట గని ద్రవ్యాలైన ధాన్యాకముల్
బండమ్మున్ గలుపంగఁ జారునకు దివ్యస్వాదమందెన్ గదా.

*(బండము....వస్తుసామాగ్రి)*

పఠానేని కార్తిక్ చెప్పారు...

శా.
పండై ముగ్గెను దీపితోఁ బనస యాస్వాదింపగం జక్కగా
నిండెం జెట్టున కొమ్మపైఁ గనగ నా నేత్రంబులుల్లాసమై
పండెన్, ముక్కలు కోసి వంటను వడిన్ వాడం దగుం దండ్రి బ్ర
హ్మాండమ్ముం, గలుపంగఁ జారునకు దివ్య స్వాదమందెన్ గదా !

Sitharamayya Solasa చెప్పారు...

పండుగ దివసమునందున
వండిన పాకముల లోన ప్రముఖత నొందన్
కొండికగ మురిగొనిన కూ
ష్మాండముఁ గలుపంగఁ జారు కద్భుత రుచియౌ”

విరించి చెప్పారు...

దండి పిరిమితో నీవిట
వండిన వంటలవి యెల్ల బ్రహ్మాండంబే
చండిక! ముక్కలుగను కూ
ష్మాండముఁ గలుపంగఁ జారు కద్భుత రుచియౌ.


దండై వచ్చిరి వంట సేయగను బ్రాతఃకాలమున్ కొమ్మలే
రండో బాలకులార యంచు పిలువన్ బ్రాజ్ఞా నిధుల్ వారలే
భాండమ్మందున నున్న వంట గని ద్రవ్యాలున్ ప్రవర్ధిల్లు కూ
ష్మాండమ్మున్ గలుపంగఁ జారునకు దివ్యస్వాదమందెన్ గదా.

M.B.G.TILAK చెప్పారు...

వండుట పరిపాటియె బ్ర
హ్మాండమగు రుచినిడు వంట నానందముతో
వండెడు పదార్థమున కూ
ష్మాండముఁ గలుపంగఁ జారు కద్భుత రుచియౌ

పండున్ పంటలు మిక్కుటంబుగ సదా వారున్న గ్రామాన బ్ర
హ్మాండంబౌరుచి నిచ్చు వంట లవియే మాధుర్యముప్పొంగులే
వండెన్ భామిని పప్పుచారు శుచిగా పాకంబు నందొక్క కూ
ష్మాండమ్మున్ గలుపంగఁ జారునకు దివ్యస్వాదమందెన్ గదా

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

వండుట యందున నేరుపు
మెండుగ జూపు వన జాక్షి మేలిమి కూర న్
వండుచు ముక్కలు గా కూ
ష్మా o డము గలుపo గ జారు క ద్భు త రుచి యవ్

రామోక్తం చెప్పారు...

మెండుగ పప్పులు మిరియము
దండిగ కరివేప నేయి ధనియము లున్నన్
వండెడు సమయమ్మున క
ల్కండముఁ గలుపంగఁ జారు కద్భుత రుచియౌ

రామోక్తం చెప్పారు...

చెండంత చింత పండును
మెండుగ సంబారము కరి మిరియపు పొడులన్
దండిగ యుడికించిన కూ
ష్మాండముఁ గలుపంగఁ జారు కద్భుత రుచియౌ

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

వండించంగను బిండి వంటలను

సంభావ్యంపు సాంబారునున్

కొండంతాశను బెట్టుకొంచు మది

సంకోశించకన్ బిల్చె ను

ద్దండుండొక్కని జేయ చారు, న

తడున్ దత్కాలమే వచ్చి కూ

ష్మాండంబున్ గలపంగ జారునకు

దివ్య స్వాదమందెన్ గదా!









కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

దండిగ వండ నగును మఱి
భాండమ్ములు చాల వెపుడు స్వాస్థ్యము కలుగున్
మెండుగ జనాళికి మరీ
చాండముఁ గలుపంగఁ జారు కద్భుత రుచియౌ

[మరీచము = మిరియము]


వండన్ మేలుగ సాటి దీని కిఁక విశ్వంబందు నెచ్చోటు నం
దుండన్ నేర్చునె యన్య పాకములు భక్ష్యౌఘమ్ము లం దెల్ల బ్ర
హ్మాండం బందుఁ బ్రశస్త మౌను దువరీ సంయుక్త మాధుర్య కూ
ష్మాండమ్మున్గలుపంగఁ జారునకు దివ్యస్వాద మందెన్ గదా

తువరి = కంది

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

పండుగ వంటలు చేయుచు
మెండుగ దినుసులను వేయ మిరియపు
పొడితో
దండిగ యింగువ నిడ, బ్ర
హ్మాండముఁ; గలుపంగఁ జారు కద్భుత
రుచియౌ.

Dr H Varalakshmi చెప్పారు...

సమస్య:
“అండమ్మున్ గలుపంగఁ జారునకు దివ్యాస్వాదమందెన్ గదా !!”

శార్దూలము:

పిండాకూడని దిట్టుచున్ మరి మరీ పీడించిరే వడ్డనన్
అండంబేలను భోక్తలే దినగ సేయంబూనిరే శాకముల్
భాండంబున్ సరి వంటలెన్నిమది కాహ్లాదంబు గూర్చంగ, కూ
ష్మాండమ్మున్ గలుపంగఁ జారునకు దివ్యాస్వాదమందెన్ గదా !!