తే.గీ:నీవు గూఢచారి వనుచు నే నెరుగుదు మగడ! అంత మాత్రమ్మున మన కొడుకును, కోడలును గది లోన మా టాడ నెట్లు చాటుమాటుగా వినుట సంస్కారమగును”? (ఆ గూఢచారి కెందుకో కొడుకు మీద,కొత్త కోడలి మీద దౌటొచ్చింది.వాళ్ల లో అదీ సహజమే.)
మ:నిను నే నమ్మితి సాధ్వి వంచు, నెవడో నిన్ గూర్చి మాటాడ న మ్మను,నన్ గూర్చియు నీకు జెప్ప చెడుగా మన్నించ కా మాటలన్ మనకున్ దంపులు వెట్టు చుందు రెపుడున్ మా వారు మీవారు ,న వ్విననొప్పున్ గద చాటుమాటుగఁ బరుల్ వేర్వేర మాటాడఁగన్” (ఈ భార్యా భర్తలకి ఒకరి మీద ఒకరికి సాడీలు చెప్పే వాళ్లున్నారు కానీ నమ్మ వద్దని,ఇక చాటుగా మాట్లాడుకుంటే నవ్వుకుంటే సరిపోతుందని.)
తేటగీతి
రిప్లయితొలగించండివ్యక్తిగత గోప్యతయన రాజ్యాంగ హక్కు
యేలికలె దాని హరియించ నేహ్యమగును
చట్టపరిధి నేరస్తుల గుట్టుఁ దెలియ
చాటుమాటుగా వినుట సంస్కారమగును
మత్తేభవిక్రీడితము
మనరాజ్యాంగము వ్యక్తి గోప్యతను సంభావించఁగన్ హక్కుగన్
వినిరే యేలికలైన నీచమనగన్వేదింప ప్రత్యర్థులన్!
జన సేమమ్మను దృష్టి చట్ట పరిధిన్ సాధింప నేరస్తులన్
విననొప్పున్ గద చాటుమాటుగఁ బరుల్ వేర్వేర మాటాడఁగన్
అంటురోగము పురమునందడరు వేళ
రిప్లయితొలగించండివైద్యశాలకు క్రొత్తగ వచ్చి నట్టి
రోగి కున్న రోగమును దెలుసుకోనుటకు
చాటుమాటుగా వినుట సంస్కారమగును
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'కొనుటకు' టైపాటు.
తొలగించండి🙏
తొలగించండి
రిప్లయితొలగించండిబాధ్యతగల యుద్యోగ నిర్వహణ యనుచు
వృత్తి ధర్మాన్ని నెరవేర్చు వేగుల కది
తప్పదయ్యె కనగనది ధర్మమేను
చాటుమాటుగా వినుట సంస్కారమగును.
తనదౌ వృత్తిని సక్రమమ్ముగను నిత్య మ్మాచరింపం గ వే
తనమున్ గైకొని చేయు కార్యమనుచున్ ధర్మమ్మటంచయ్యదే
ఘనమంచున్ దలపోయు వేగులకు సత్కార్యంబదే కాంచగన్
విననొప్పున్ గద చాటుమాటుగఁ బరుల్ వేర్వేర మాటాడఁగన్.
దుష్ట శక్తులు చెలరేగి దుష్కృతముల
రిప్లయితొలగించండిసలుపఁ బూనఁగ నరికట్ట వలసినపుఁడు
చట్ట పరిధిలో సేయఁగ గుట్టురట్టు
చాటుమాటుగా వినుట సంస్కారమగును
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితే॥ శత్రు చేష్టలఁ బసికట్టి జన్మభూమి
రిప్లయితొలగించండిరక్షణఁ గనఁగ వేగులు లక్ష్యసిద్ధిఁ
గోరి ప్రాణములొడ్డి నిగూఢతనటు
చాటు మాటుగా వినుట సంస్కారమగును
మ॥ కనఁగన్ భద్రత గూఢచర్యమిల సత్కార్యమ్ముగా నొప్పెడిన్
దనువుల్ ప్రాణము దేశరక్షణను సంధానించఁగా నొడ్డెడిన్
ఘనులా వేగులు శత్రు చేష్టలనుఁ బొంగార్చంగ నన్వేషణన్
విన నొప్పున్ గద చాటుమాటుగఁ బరుల్ వేర్వేర మాటాడఁగన్
వనసీమన్ వసియించి పౌరులకు రాభస్యమ్ము పోకార్చగా
రిప్లయితొలగించండిననిశమ్మున్ సమయోగముల్ నెరపు దుర్మార్గంబు రోధించగన్
జనసంక్షేమముఁగోరి రక్షక భటుల్ సవ్యంపు మార్గమ్మునన్
విననొప్పున్ గద చాటుమాటుగఁ బరుల్ వేర్వేర మాటాడఁగన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమ.
రిప్లయితొలగించండిఘన సామ్రాజ్య విరూఢి సంకలిత సంస్కారాఢ్య సందీప్తుడై
జన హృన్నేతగ పేరుగాంచెనొక రాజశ్రేష్ఠుడాశించి తా
మొనసెం బల్లెలకేగి దానముగ సొమ్ముల్ పంచు కాలంబునన్
విననొప్పున్ గద చాటుమాటుగఁ బరుల్ వేర్వేర మాటాడగన్ !
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిచట్టబద్దత లేనట్టి చారుచర్య
రిప్లయితొలగించండిహద్దు మీరుచు సల్పిన సుద్దులేల
కనుగొనుటకు చక్కని వీలు కలిగినపుడు
చాటుమాటుగా వినుట సంస్కారమగును
[సంస్కారము = సామర్థ్యము]
మన రాజ్యాంగపు హద్దుమీరుటయె సామాన్యంబుగా మారెగా
మనసొప్పున్ గద గూఢచర్యల విధిన్ మర్మంబులన్ గన్గొనన్
విననొప్పున్ గద చాటుమాటుగఁ బరుల్ వేర్వేర మాటాడఁగన్
యొనగూడున్ గద స్వప్రయోజనములే యోచింపగా హాయిగా
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి'మాటాడఁగన్ + ఒనగూడు' అన్నపుడు యడాగమం రాదు.
ధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండితే.గీ:నీవు గూఢచారి వనుచు నే నెరుగుదు
రిప్లయితొలగించండిమగడ! అంత మాత్రమ్మున మన కొడుకును,
కోడలును గది లోన మా టాడ నెట్లు
చాటుమాటుగా వినుట సంస్కారమగును”?
(ఆ గూఢచారి కెందుకో కొడుకు మీద,కొత్త కోడలి మీద దౌటొచ్చింది.వాళ్ల లో అదీ సహజమే.)
పరుల లేఖలు చదువుట పాడి కాదు
రిప్లయితొలగించండివారు గోప్యము గా సల్పు భాష ణంబు
దొంగ వలె చేరి నక్కియు దోష మెటుల
చాటు మాటుగా వినుట సంస్కార మగును?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమ:నిను నే నమ్మితి సాధ్వి వంచు, నెవడో నిన్ గూర్చి మాటాడ న
రిప్లయితొలగించండిమ్మను,నన్ గూర్చియు నీకు జెప్ప చెడుగా మన్నించ కా మాటలన్
మనకున్ దంపులు వెట్టు చుందు రెపుడున్ మా వారు మీవారు ,న
వ్విననొప్పున్ గద చాటుమాటుగఁ బరుల్ వేర్వేర మాటాడఁగన్”
(ఈ భార్యా భర్తలకి ఒకరి మీద ఒకరికి సాడీలు చెప్పే వాళ్లున్నారు కానీ నమ్మ వద్దని,ఇక చాటుగా మాట్లాడుకుంటే నవ్వుకుంటే సరిపోతుందని.)
సమస్య:
రిప్లయితొలగించండి“విననొప్పున్ గద చాటుమాటుగఁ బరుల్ వేర్వేర మాటాడఁగన్”
మత్తేభము:
కనమంజెప్పవు వేరు కృష్ణ సతులే కాంతున్ బిగిం గట్టిరో !
ఘనమౌ సత్యకు తోడునీడనుచు నే గారంబునే పొందితిన్
చనమం జెప్పిరి పుట్టినింట నను నీ సంతోషమే గాంచగా
“విననొప్పున్ గద చాటుమాటుగఁ బరుల్ వేర్వేర మాటాడఁగన్”