19-9-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఇరువురు మువ్వురును నలువు రేవు రొకరె పో”
(లేదా...)
“ఇరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరే కదా”
(రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారికి ధన్యవాదాలతో...)
చ.చిర సుయశోధనార్జనకు చిత్రమునందు నటించె వాడు పే రు రయము దక్క వేషములు, రూపులు మార్చుచు పాత్రలందు తా నెరుగని రీతి తోచెను, యథేచ్ఛను దృశ్యములోన వచ్చెడా యిరువురు మువ్వురున్ నలువురేవురు నార్గురు నొక్కరే కదా !
కందంపరమేశ్వర ప్రతిబింబమువరుసగ నద్దాల మండపమ్మున గాంచన్మెరయగఁ బైన నలుదిశలనిరువురు మువ్వురును నలువు రేవు రొకరె పో!చంపకమాలదరిశనమొంద పంచభుజ దర్పణ మండపమందు కృష్ణునిన్బరవశమొందమే మిగుల పంకజనేత్రుని తేజమొప్పగన్మెరయగఁ జూడ పైనఁగన మిన్నగ చుట్టును దివ్యరూపమేయిరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరే కదా!
కరిముఖుని పూజకొరకై విరాళమును గైకొనుటకు విచ్చేసిరిగా మరల మరల నేతెంచెడుఇరువురు మువ్వురును నలువు రేవు రొకరె పో”
అరివీరభయంకరులే విరటుని సేవించుటదియె వింతయె సుమ్మీనరుడవు వలలుండను మీ రిరువురు, మువ్వురును, నలువు, రేవు రొకరె పో.విరటుని కొల్వుకూటమున వీరులు పాండు కుమారు లెల్లరున్ పరిచరులై చరించుటది వాస్తవ మంచన నుత్తరుండనెన్ నరుడవు నీవు భీముడును నారియు ధర్మజు, మాద్రి పుత్రులాయిరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరే కదా.
స్థిరమగు కీర్తితోడుతను చిత్రపరిశ్రమ యందు ఎంటియార్సిరులు గడించినాడు పలు చిత్రములందు నటించి చక్కగన్విరివిగ మార్చుచున్ తనదు వేషము పాత్రలు కానవచ్చె తాయిరువురు మువ్వురున్ నలువురేవురు నార్గురు నొక్కరే కదా
హరికథకుఁడు చావడిలోపరికించెను ప్రేక్షకాళి పరిమిత మవగాసరియగు సంఖ్యను కనుగొననిరువురు మువ్వురును నలువు రేవు రొకరె పోహరికథ చెప్పఁ దానరిగె నచ్చటి చక్కని రచ్చపట్టుకున్బరిమితమైన ప్రేక్షకులు వచ్చెడి పోయెడి జాడ తోచగాసరియగు సంఖ్యతేల్చుటకు చప్పున లెక్కలు పెట్టి చూడగానిరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరే కదా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
హరిహరులును త్రిభువనములుపరికించగ నాల్గు శ్రుతులు ప్రకృతీ ఋతువుల్ అరయగనద్వైతమ్మున ఇరువురు మువ్వురును నలువురేవురొకరెపో
ఇరవగు కామము మూలముయరిషడ్వర్గమ్ము లనెడు యడుసున గూలన్నరులకునీ యొక్కండునుఇరువురు మువ్వురును నలువు రేవు రొకరె పో
ఇరవుగనొక్క కోర్కి మదినెల్లలు దాటగ వైరి షట్కముల్తెరకుగ వచ్చి చేరునది తీరక కొందలపాటు గూర్చుచున్వరుసగ నొక్కటొక్కటిగ వచ్చెడు దాయలు నెమ్మనమ్మునందిరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరేకదా
చ.
రిప్లయితొలగించండిచిర సుయశోధనార్జనకు చిత్రమునందు నటించె వాడు పే
రు రయము దక్క వేషములు, రూపులు మార్చుచు పాత్రలందు తా
నెరుగని రీతి తోచెను, యథేచ్ఛను దృశ్యములోన వచ్చెడా
యిరువురు మువ్వురున్ నలువురేవురు నార్గురు నొక్కరే కదా !
కందం
రిప్లయితొలగించండిపరమేశ్వర ప్రతిబింబము
వరుసగ నద్దాల మండపమ్మున గాంచన్
మెరయగఁ బైన నలుదిశల
నిరువురు మువ్వురును నలువు రేవు రొకరె పో!
చంపకమాల
దరిశనమొంద పంచభుజ దర్పణ మండపమందు కృష్ణునిన్
బరవశమొందమే మిగుల పంకజనేత్రుని తేజమొప్పగన్
మెరయగఁ జూడ పైనఁగన మిన్నగ చుట్టును దివ్యరూపమే
యిరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరే కదా!
రిప్లయితొలగించండికరిముఖుని పూజకొరకై
విరాళమును గైకొనుటకు విచ్చేసిరిగా
మరల మరల నేతెంచెడు
ఇరువురు మువ్వురును నలువు రేవు రొకరె పో”
రిప్లయితొలగించండిఅరివీరభయంకరులే
విరటుని సేవించుటదియె వింతయె సుమ్మీ
నరుడవు వలలుండను మీ
రిరువురు, మువ్వురును, నలువు, రేవు రొకరె పో.
విరటుని కొల్వుకూటమున వీరులు పాండు కుమారు లెల్లరున్
పరిచరులై చరించుటది వాస్తవ మంచన నుత్తరుండనెన్
నరుడవు నీవు భీముడును నారియు ధర్మజు, మాద్రి పుత్రులా
యిరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరే కదా.
స్థిరమగు కీర్తితోడుతను చిత్రపరిశ్రమ యందు ఎంటియార్
రిప్లయితొలగించండిసిరులు గడించినాడు పలు చిత్రములందు నటించి చక్కగన్
విరివిగ మార్చుచున్ తనదు వేషము పాత్రలు కానవచ్చె తా
యిరువురు మువ్వురున్ నలువురేవురు నార్గురు నొక్కరే కదా
హరికథకుఁడు చావడిలో
రిప్లయితొలగించండిపరికించెను ప్రేక్షకాళి పరిమిత మవగా
సరియగు సంఖ్యను కనుగొన
నిరువురు మువ్వురును నలువు రేవు రొకరె పో
హరికథ చెప్పఁ దానరిగె నచ్చటి చక్కని రచ్చపట్టుకున్
బరిమితమైన ప్రేక్షకులు వచ్చెడి పోయెడి జాడ తోచగా
సరియగు సంఖ్యతేల్చుటకు చప్పున లెక్కలు పెట్టి చూడగా
నిరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరే కదా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిహరిహరులును త్రిభువనములు
తొలగించండిపరికించగ నాల్గు శ్రుతులు ప్రకృతీ ఋతువుల్
అరయగనద్వైతమ్మున
ఇరువురు మువ్వురును నలువురేవురొకరెపో
ఇరవగు కామము మూలము
రిప్లయితొలగించండియరిషడ్వర్గమ్ము లనెడు యడుసున గూలన్
నరులకునీ యొక్కండును
ఇరువురు మువ్వురును నలువు రేవు రొకరె పో
ఇరవుగనొక్క కోర్కి మదినెల్లలు దాటగ వైరి షట్కముల్
రిప్లయితొలగించండితెరకుగ వచ్చి చేరునది తీరక కొందలపాటు గూర్చుచున్
వరుసగ నొక్కటొక్కటిగ వచ్చెడు దాయలు నెమ్మనమ్మునం
దిరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరేకదా