30, సెప్టెంబర్ 2025, మంగళవారం

సమస్య - 5260

1-10-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మారునిం జంపె శక్రకుమారుఁ డెసఁగి”
(లేదా...)
“మారునిఁ జంపె శక్రుని కుమారుఁడు మాధవుఁ డంప నుద్ధతిన్”

6 కామెంట్‌లు:

  1. ఉ.
    తూరుపు బిడ్డ క్రుంగెనని తూపులు వీడి ప్రతిజ్ఞ నిప్డు నే
    దీరుగ నిల్ప లేదనుచు తెల్లపు బాధను మున్గ జక్రముం
    దేఱును సాకు వాడు వడి దీయగ వింటిని బట్టి దుశ్శలా
    మారుని జంపె శక్రుని కుమారుడు మాధవుడంప నుద్ధతిన్ !

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    వెన్నుపోటున పుత్రుని వికృత రీతి
    చిదిమి వైచియు నేటి దుస్థితిని గాంచి
    వీడమన్నను యుద్ధాన విడక రవి కు
    మారునిం జంపె శక్రకుమారుఁ డెసఁగి

    ఉత్పలమాల
    తీరిచి తమ్మిమొగ్గరము దిట్టగ రా నభిమన్యుగూల్చ నే
    మారిచి ధర్మమున్ విడిచి మార్కొని దుష్టచతుష్టయమ్మహో!
    కారణమైన వాడనుచుఁ గ్రమ్మగ చీకటి దుస్సలమ్మకున్
    మారునిఁ జంపె శక్రుని కుమారుఁడు మాధవుఁ డంప నుద్ధతిన్

    రిప్లయితొలగించండి
  3. పాండవుల గెల్చి రాజుకు బహుమతి నిడు
    లక్ష్యముండినను పరశురాముడిడిన
    యస్త్రమును మరువగ నాజియందు రవి కు
    మారునిం జంపె శక్రకుమారుఁ డెసఁగి

    రిప్లయితొలగించండి

  4. తనయుడవనుచు వచ్చిన తరుణి కుంతి
    కభయ మొసగిన యంగరాజావహమున
    యర్జునుడెశత్రువనిన యా యంశుపతి కు
    మారునిం జంపె శక్రకుమారుఁ డెసఁగి.


    వీరుడు తారకా సురుని పీకమడంచెడి యీశపుత్రుడా
    కారణజన్మునుద్గరముకై గద యింద్రుడు పంపినంత నా
    మారుని గూల్చె నీశుడను మాటయె వాస్తవమైన నింక యే
    మారునిఁ జంపె శక్రుని కుమారుఁడు మాధవుఁ డంప నుద్ధతిన్?

    రిప్లయితొలగించండి