26-11-2025 (బుధవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“శ్రావ్యగళస్వనమునన్ ఖరమె మేటి గదా”(లేదా...)“శ్రావ్యగళస్వనమ్మున ఖరమ్మున కెయ్యది సాటి వచ్చురా”
ఉ.దివ్యము కాని, వీనులకు తీపులు పంపెడు రీతి కాని, స త్కావ్యము కాని, ముద్దుచిలుకల్ తగ పల్కెడు పల్కు కాని, సం భావ్యము కాని, హ్లాదముల పండగ జేయని రోతయైన య శ్రావ్యగళస్వనమ్మున ఖరమ్మున కెయ్యది సాటి వచ్చురా ?
అవ్యాజపు పల్కులనుట నే వ్యాపకములుగ నెంచి యెసకమునాడేఈ వ్యతిరేకపు క్రీడనుశ్రావ్యగళస్వనమునన్ ఖరమె మేటి గదా
తాళి కట్టు శుభవేళ అను పాట చివరలో గాడిద గొంతు ననుకరింపగ బాలుగారు అదియే మేటి కదా! అను భావముతో.... కందంనవ్యత కోరఁగ శ్రోతలుసవ్యముగ స్వరానుకరణ సలిపెడు పాటన్భవ్యమొలుక 'బాలు' తుదినిశ్రావ్యగళస్వనమునన్ ఖరమె మేటి గదా!దివ్య గళంబునన్ జెలఁగి తీర్చిన పాటను బాలుగారలున్నవ్యముగా స్వరానుకరణంబును సల్పుచు నాలపించగన్భవ్యమనంగ సాగుచు రవమ్ములతో మురి పించఁగన్ తుదిన్శ్రావ్యగళస్వనమ్మున ఖరమ్మున కెయ్యది సాటి వచ్చురా!
భవ్యమెటులుండునో మరి సవ్యముగా లేదనునది జనులకు దెలుపన్ అవ్యయముగ కూత నిడెడుశ్రావ్యగళస్వనమునన్ ఖరమె మేటి గదా
దివ్యము దాని రూపు వినుతింపఁగ చాలవు వేయి వక్త్రముల్నవ్యత గానవచ్చు వదనమ్మున చొక్కటముం గనుంగొనన్భవ్యము జీవనమ్ము పలు బట్టలు మూపునఁ దాల్చి మోయు సుశ్రావ్యగళస్వనమ్మున ఖరమ్మున కెయ్యది సాటి వచ్చురా
భవ్య వసంతములో యళి యవ్యయ గానము గనంగ నద్భుత మదియే శ్రావ్యమ్మన్న భువిని య శ్రావ్యగళస్వనమునన్ ఖరమె మేటి గదా.నవ్య వసంత కాలమున నల్దిశ లందు మనోహరమ్ముగా నవ్యయ మైన గానమగు శ్యామపు గాత్రమె లోకమందునన్ శ్రావ్యమనంగనొప్పదె హిరణ్యద మందున గాంచి నంత య శ్రావ్యగళస్వనమ్మున ఖరమ్మున కెయ్యది సాటి వచ్చురా.
శంకరాభరణం సమస్య ••••• •••• •••• •••• •••• •••• •••• సమస్య - 25 / 11 / 2025 **** **** **** **** **** **** ****శ్రావ్యగళస్వనమ్మున ఖరమ్మున కెయ్యది సాటి వచ్చురా”ఉత్పలమునవ్య కచేరులన్ గనగ నాణ్య తొకింతయు లేదు.స్పష్టతల్,శ్రావ్యత లేని రాగములు. శబ్దము కర్ణ కఠోరమైననున్సవ్యమటంచుఁ బల్కెదరు ఛాందస వాదులు. వారి దృష్టిలోశ్రావ్యగళస్వనమ్మున ఖరమ్మున కెయ్యది సాటి వచ్చురా ఆకుల శాంతి భూషణ్ వనపర్తి
శ్రావ్యత పరిగణనముకైశ్రావ్యగళరవమనఁ గోకిలయె మేటి గదాశ్రావ్యత లోపంబన నశ్రావ్యగళస్వనమునన్ ఖరమె మేటి గదాశ్రావ్యగళస్వనమ్మున పసందుగ పాడగ సాటి లేనిదౌదివ్య మనోజ్ఞ చేతనము తేకువ తోడ చెలంగు కోకిలేసవ్యము కాని సంగతము శ్రావ్యత యించుక లేనిదైన నశ్రావ్యగళస్వనమ్మున ఖరమ్మున కెయ్యది సాటి వచ్చురా
ఉ.
రిప్లయితొలగించండిదివ్యము కాని, వీనులకు తీపులు పంపెడు రీతి కాని, స
త్కావ్యము కాని, ముద్దుచిలుకల్ తగ పల్కెడు పల్కు కాని, సం
భావ్యము కాని, హ్లాదముల పండగ జేయని రోతయైన య
శ్రావ్యగళస్వనమ్మున ఖరమ్మున కెయ్యది సాటి వచ్చురా ?
అవ్యాజపు పల్కులనుట
రిప్లయితొలగించండినే వ్యాపకములుగ నెంచి యెసకమునాడే
ఈ వ్యతిరేకపు క్రీడను
శ్రావ్యగళస్వనమునన్ ఖరమె మేటి గదా
తాళి కట్టు శుభవేళ అను పాట చివరలో గాడిద గొంతు ననుకరింపగ బాలుగారు అదియే మేటి కదా! అను భావముతో....
రిప్లయితొలగించండికందం
నవ్యత కోరఁగ శ్రోతలు
సవ్యముగ స్వరానుకరణ సలిపెడు పాటన్
భవ్యమొలుక 'బాలు' తుదిని
శ్రావ్యగళస్వనమునన్ ఖరమె మేటి గదా!
దివ్య గళంబునన్ జెలఁగి తీర్చిన పాటను బాలుగారలున్
నవ్యముగా స్వరానుకరణంబును సల్పుచు నాలపించగన్
భవ్యమనంగ సాగుచు రవమ్ములతో మురి పించఁగన్ తుదిన్
శ్రావ్యగళస్వనమ్మున ఖరమ్మున కెయ్యది సాటి వచ్చురా!
భవ్యమెటులుండునో మరి
రిప్లయితొలగించండిసవ్యముగా లేదనునది జనులకు దెలుపన్
అవ్యయముగ కూత నిడెడు
శ్రావ్యగళస్వనమునన్ ఖరమె మేటి గదా
దివ్యము దాని రూపు వినుతింపఁగ చాలవు వేయి వక్త్రముల్
రిప్లయితొలగించండినవ్యత గానవచ్చు వదనమ్మున చొక్కటముం గనుంగొనన్
భవ్యము జీవనమ్ము పలు బట్టలు మూపునఁ దాల్చి మోయు సు
శ్రావ్యగళస్వనమ్మున ఖరమ్మున కెయ్యది సాటి వచ్చురా
రిప్లయితొలగించండిభవ్య వసంతములో యళి
యవ్యయ గానము గనంగ నద్భుత మదియే
శ్రావ్యమ్మన్న భువిని య
శ్రావ్యగళస్వనమునన్ ఖరమె మేటి గదా.
నవ్య వసంత కాలమున నల్దిశ లందు మనోహరమ్ముగా
నవ్యయ మైన గానమగు శ్యామపు గాత్రమె లోకమందునన్
శ్రావ్యమనంగనొప్పదె హిరణ్యద మందున గాంచి నంత య
శ్రావ్యగళస్వనమ్మున ఖరమ్మున కెయ్యది సాటి వచ్చురా.
శంకరాభరణం సమస్య
రిప్లయితొలగించండి••••• •••• •••• •••• •••• •••• ••••
సమస్య - 25 / 11 / 2025
**** **** **** **** **** **** ****
శ్రావ్యగళస్వనమ్మున ఖరమ్మున కెయ్యది సాటి వచ్చురా”
ఉత్పలము
నవ్య కచేరులన్ గనగ నాణ్య తొకింతయు లేదు.స్పష్టతల్,
శ్రావ్యత లేని రాగములు. శబ్దము కర్ణ కఠోరమైననున్
సవ్యమటంచుఁ బల్కెదరు ఛాందస వాదులు. వారి దృష్టిలో
శ్రావ్యగళస్వనమ్మున ఖరమ్మున కెయ్యది సాటి వచ్చురా
ఆకుల శాంతి భూషణ్
వనపర్తి
శ్రావ్యత పరిగణనముకై
రిప్లయితొలగించండిశ్రావ్యగళరవమనఁ గోకిలయె మేటి గదా
శ్రావ్యత లోపంబన న
శ్రావ్యగళస్వనమునన్ ఖరమె మేటి గదా
శ్రావ్యగళస్వనమ్మున పసందుగ పాడగ సాటి లేనిదౌ
దివ్య మనోజ్ఞ చేతనము తేకువ తోడ చెలంగు కోకిలే
సవ్యము కాని సంగతము శ్రావ్యత యించుక లేనిదైన న
శ్రావ్యగళస్వనమ్మున ఖరమ్మున కెయ్యది సాటి వచ్చురా