27-11-2025 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“పాపిని మెత్తురు సుజనులు పావనుఁ డంచున్”(లేదా...)“పాపముఁ జేయువానిఁ గని పావనుఁ డంచు నుతింత్రు సజ్జనుల్”
ఉ.శాపము భూమి దుర్గుణ నిశామయ హృత్కలితుల్ ధనంబుతోకోపముతోడి స్వైరులయి గొప్పలు వోవుచు నిల్చిరిప్డు వారే పొగరెక్కి యుండ నిజమెప్పు డురుంగును, ప్రాణభీతితో పాపము జేయువాని గని పావనుడంచు నుతింత్రు సజ్జనుల్ !
మాపటి సమయము నందునపాప నిదురపోవ దోమ వ్రాలగ బోయెన్ఓపక దానిని జంపినపాపిని మెత్తురు సుజనులు పావనుఁ డంచున్
దోపిడి తో నార్జించిన పాపపు సొమ్ము నట బంచి పాలకు డైనన్ గోపతియొ యిందుడో యని పాపిని మెత్తురు సుజనులు పావనుఁ డంచున్.దోపిడి చేసినట్టి యొక ధూర్తుడు సంపద కూడబెట్టి యా పాపపు సొమ్ము లోకులకు పంచుచు నెన్నిక లందు నెగ్గుచున్ తా పరి పాలకుండయిన తప్పదటంచు సభాంతరమ్ము నన్ బాపముఁ జేయువానిఁ గని పావనుఁ డంచు నుతింత్రు సజ్జనుల్
పాపపు కృత్యములు సలిపెతాపసి శాపపు మహిమన తానేరకనేపాపము శాపము వలననిపాపిని మెత్తురు సుజనులు పావనుఁ డంచున్కోపము తోడ ఘోరమగు గోమున తాపసుడే శపించగాశాపము నొంది దానిదగు శక్తికి లోబడి ప్రాతవేల్పుగాపాపముఁ జేయువానిఁ గని పావనుఁ డంచు నుతింత్రు సజ్జనుల్పాపమెరుంగడెన్నడును పాపము శాపము వల్లనందురే
శ్రీపతి తూలికయై అంబాపతి కంఠముననలరు ప్రాలంబమ్మైసౌపర్ణారి సుభగుడయెపాపిని మెత్తురు సుజనులు పావనుఁ డంచున్పాపి : సర్పము
లోపము కానిరాని దిటలోకమునందున గాంచలేమె యాలోపములన్ పరిష్కరణరూప మొసంగుచు మానవాళికిన్ దీప రువాణమౌచు నిలదివ్య మహోన్నత మార్గమందు నిష్పాపముఁ జేయువానిఁ గని పావనుఁ డంచు నుతింత్రు సజ్జనుల్!
ఉ.
రిప్లయితొలగించండిశాపము భూమి దుర్గుణ నిశామయ హృత్కలితుల్ ధనంబుతో
కోపముతోడి స్వైరులయి గొప్పలు వోవుచు నిల్చిరిప్డు వా
రే పొగరెక్కి యుండ నిజమెప్పు డురుంగును, ప్రాణభీతితో
పాపము జేయువాని గని పావనుడంచు నుతింత్రు సజ్జనుల్ !
మాపటి సమయము నందున
రిప్లయితొలగించండిపాప నిదురపోవ దోమ వ్రాలగ బోయెన్
ఓపక దానిని జంపిన
పాపిని మెత్తురు సుజనులు పావనుఁ డంచున్
రిప్లయితొలగించండిదోపిడి తో నార్జించిన
పాపపు సొమ్ము నట బంచి పాలకు డైనన్
గోపతియొ యిందుడో యని
పాపిని మెత్తురు సుజనులు పావనుఁ డంచున్.
దోపిడి చేసినట్టి యొక ధూర్తుడు సంపద కూడబెట్టి యా
పాపపు సొమ్ము లోకులకు పంచుచు నెన్నిక లందు నెగ్గుచున్
తా పరి పాలకుండయిన తప్పదటంచు సభాంతరమ్ము నన్
బాపముఁ జేయువానిఁ గని పావనుఁ డంచు నుతింత్రు సజ్జనుల్
పాపపు కృత్యములు సలిపె
రిప్లయితొలగించండితాపసి శాపపు మహిమన తానేరకనే
పాపము శాపము వలనని
పాపిని మెత్తురు సుజనులు పావనుఁ డంచున్
కోపము తోడ ఘోరమగు గోమున తాపసుడే శపించగా
శాపము నొంది దానిదగు శక్తికి లోబడి ప్రాతవేల్పుగా
పాపముఁ జేయువానిఁ గని పావనుఁ డంచు నుతింత్రు సజ్జనుల్
పాపమెరుంగడెన్నడును పాపము శాపము వల్లనందురే
శ్రీపతి తూలికయై అం
రిప్లయితొలగించండిబాపతి కంఠముననలరు ప్రాలంబమ్మై
సౌపర్ణారి సుభగుడయె
పాపిని మెత్తురు సుజనులు పావనుఁ డంచున్
పాపి : సర్పము
లోపము కానిరాని దిట
రిప్లయితొలగించండిలోకమునందున గాంచలేమె యా
లోపములన్ పరిష్కరణ
రూప మొసంగుచు మానవాళికిన్
దీప రువాణమౌచు నిల
దివ్య మహోన్నత మార్గమందు ని
ష్పాపముఁ జేయువానిఁ గని
పావనుఁ డంచు నుతింత్రు సజ్జనుల్!