3-1-2026 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“నమ్మి కొలిచె గోదాదేవి నాగధరుని”(లేదా...)“తన చిత్తంబున నమ్మి శంకరుని గోదాదేవి గొల్చెం దమిన్”(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి దుబాయి శతావధాన సమస్య)
తేటగీతిచదివిన విషయమ్మున్ శిష్య! సక్రమముగవ్రాయమెచ్చని పంతులు వసుధఁ గలఁడె?తప్పు వ్రాసితె! నీ సమాధానమందునమ్మి కొలిచె గోదాదేవి నాగధరుని!మత్తేభవిక్రీడితముఅనయంబున్ గడు నిష్ఠగన్ జదివి యభ్యాసమ్మునన్ వ్రాసినన్నిను మెచ్చున్ జగమందు నొప్పయిన నా నేర్పించెడున్ బంతులున్కనుమా! వ్రాయగ నీవు నాగశయనున్ గాట్రేనిగన్, మారుచున్"తన చిత్తంబున నమ్మి శంకరుని గోదాదేవి గొల్చెం దమిన్"
పూలమాలలతో వెన్నుఁ బూజ చేసినమ్మి కొలిచె గోదాదేవి, నాగధరునివలచి యర్ధాంగి కాగోరి పగలు రేయితరుణి వలిగట్టుదొరపట్టి తపమొనర్చె
"నమ్మి కొలిచె గోదాదేవి నాగధరుని"నాగధరుని కాదు సఖుడా నగధరుడిని ;నాగధరుడన శివుడగు ; నగధరుడనగిరినియెత్తి రక్షించిన కృష్ణుడగును
పాశురముల రచించిన భక్తురాలు భక్తితో రంగనాథుని పతియటంచు నమ్మి కొలిచె గోదాదేవి, నాగధరుని.పతిగ పొంద తపము జేసె పర్వత సుత.మనుజండెవ్వడు నమ్మబోడు కద నీమాటల్ సఖా యెందుకీయనృతంబౌ పలుకుల్ వచింతువిక సత్యంబేమిటో తెల్సు గా జనులన్ మోసము చేయబోకుమది క్రచ్ఛమ్మందురే యప్పుడో తన చిత్తంబున నమ్మి శంకరుని గోదాదేవి గొల్చెం దమిన్?
సతతమా మనోహరుడగు శైలధరునినమ్మి కొలిచె గోదాదేవి; నాగధరునివలచి పెండ్లాడె చలిమలపట్టి గౌరి ప్రేమ చిగురించె నిరువురి భామలకునుచిననాడే మనసాడిపాడెను గదా శ్రీకృష్ణునిన్ దల్చుచున్మనసంతా కరివేల్పు నిండగ మనో మందారుడౌ కృష్ణుడేతన సర్వస్వము కాగ సౌఖ్యమిడుచున్ దారాడు సౌహార్ధమేతన చిత్తంబున నమ్మి శంకరుని గోదాదేవి గొల్చెం దమిన్[ శంకరుడు = సుఖమును గలుగఁజేయువాఁడు ]
తేటగీతి
రిప్లయితొలగించండిచదివిన విషయమ్మున్ శిష్య! సక్రమముగ
వ్రాయమెచ్చని పంతులు వసుధఁ గలఁడె?
తప్పు వ్రాసితె! నీ సమాధానమందు
నమ్మి కొలిచె గోదాదేవి నాగధరుని!
మత్తేభవిక్రీడితము
అనయంబున్ గడు నిష్ఠగన్ జదివి యభ్యాసమ్మునన్ వ్రాసినన్
నిను మెచ్చున్ జగమందు నొప్పయిన నా నేర్పించెడున్ బంతులున్
కనుమా! వ్రాయగ నీవు నాగశయనున్ గాట్రేనిగన్, మారుచున్
"తన చిత్తంబున నమ్మి శంకరుని గోదాదేవి గొల్చెం దమిన్"
పూలమాలలతో వెన్నుఁ బూజ చేసి
రిప్లయితొలగించండినమ్మి కొలిచె గోదాదేవి, నాగధరుని
వలచి యర్ధాంగి కాగోరి పగలు రేయి
తరుణి వలిగట్టుదొరపట్టి తపమొనర్చె
"నమ్మి కొలిచె గోదాదేవి నాగధరుని"
రిప్లయితొలగించండినాగధరుని కాదు సఖుడా నగధరుడిని ;
నాగధరుడన శివుడగు ; నగధరుడన
గిరినియెత్తి రక్షించిన కృష్ణుడగును
రిప్లయితొలగించండిపాశురముల రచించిన భక్తురాలు
భక్తితో రంగనాథుని పతియటంచు
నమ్మి కొలిచె గోదాదేవి, నాగధరుని.
పతిగ పొంద తపము జేసె పర్వత సుత.
మనుజండెవ్వడు నమ్మబోడు కద నీమాటల్ సఖా యెందుకీ
యనృతంబౌ పలుకుల్ వచింతువిక సత్యంబేమిటో తెల్సు గా
జనులన్ మోసము చేయబోకుమది క్రచ్ఛమ్మందురే యప్పుడో
తన చిత్తంబున నమ్మి శంకరుని గోదాదేవి గొల్చెం దమిన్?
సతతమా మనోహరుడగు శైలధరుని
రిప్లయితొలగించండినమ్మి కొలిచె గోదాదేవి; నాగధరుని
వలచి పెండ్లాడె చలిమలపట్టి గౌరి
ప్రేమ చిగురించె నిరువురి భామలకును
చిననాడే మనసాడిపాడెను గదా శ్రీకృష్ణునిన్ దల్చుచున్
మనసంతా కరివేల్పు నిండగ మనో మందారుడౌ కృష్ణుడే
తన సర్వస్వము కాగ సౌఖ్యమిడుచున్ దారాడు సౌహార్ధమే
తన చిత్తంబున నమ్మి శంకరుని గోదాదేవి గొల్చెం దమిన్
[ శంకరుడు = సుఖమును గలుగఁజేయువాఁడు ]