21, జనవరి 2026, బుధవారం

సమస్య - 5358

22-1-2026 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“అంచపై గ్రుడ్లగూబకు నలుక యేల”
(లేదా...)
“అంచపైన గ్రుడ్లగూబ కంత కోపమేలనో”
(భరతశర్మ గారి శతావధానంలో కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి గారి సమస్య)

5 కామెంట్‌లు:

  1. అంచపై గ్రుడ్లగూబకు నలుక యేల ?
    వాటి రౌతుల విలువల వామయేను ,
    విద్య యుండిన చాలును విత్తమంటు ,
    విత్తముండిన మాత్రాన విద్య రాదు

    రిప్లయితొలగించండి

  2. అగ్ర తాంబూల మదియేల యాదవునకు
    చూడగను వాడు నవనీత చోరు డంచు
    పలికెడి శిశుపాలుని గని పలికె నొక్క
    డంచపై గ్రుడ్లగూబకు నలుక యేల


    మంచి వాడు కానె కాదు మాయగాడె గాంచ వా
    డంచు నిట్లు చక్రి కేల యడ్డు చెప్ప గొంతు నే
    చించు కొంచు నుండె గాదె చేది రాజు, కెందుకో
    యంచపైన గ్రుడ్లగూబ కంత కోపమేలనో.

    రిప్లయితొలగించండి
  3. తేటగీతి
    విద్యనేర్చిన మనుజుల వెంట స్థిరము
    నుండు వాణి వాహనమౌచు నొందశాంతి,
    సిరుల తల్లి 'చల'ను మ్రోయు చింతకాక
    యంచపై గ్రుడ్లగూబకు నలుక యేల?


    ఉత్సాహము
    చంచలన్ భరింప కష్టసాధ్యమై శ్రమించుటన్
    బంచనుండ సుస్థిరమ్ము వాణినంద పండితుల్
    గొంచమే శ్రమించునంచు కుందికాక, యెక్కుడౌ
    యంచపైన గ్రుడ్లగూబ కంత కోపమేలనో?

    రిప్లయితొలగించండి
  4. అంచపై గ్రుడ్ల గూబకు నలుక యేల
    నెంచి చూడగ విదితమౌ నెన్నికలని
    మంచి పౌరులు రాయంచనెంచినపుడు
    కొంచెపడినదా లంచాల గ్రుడ్లగూబ

    అంచపైన గ్రుడ్లగూబ కంత కోపమేలనో
    కొంచెమైనఁ దేల్చవచ్చు కోరుకొన్న వెంటనే
    లంచగొండి గ్రుడ్లగూబ రాజ్యమేలనెంచినన్
    మంచి హంసనే వరించి మాన్యులెన్నినారనే

    రిప్లయితొలగించండి