17, మార్చి 2026, మంగళవారం

సమస్య - 5411

18-3-2026 (బుధ వారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ద్రౌపది యన జానకికి సోదరియె కాదె”
(లేదా...)
“మైథిలి చెల్లి కృష్ణ యని మాన్య వరేణ్యులు చెప్పి రెప్పుడో ”

4 కామెంట్‌లు:

  1. తేటగీతి
    అన్న శ్రీరామచంద్రునిననుసరించి
    లక్ష్మణుండు కానలకేగ రమ్య సుగుణ
    మనగ నిదురనెంచిన 'నూర్మిళనెవర' నుచు?
    ద్రౌపది యన, 'జానకికి సోదరియె కాదె'

    తేటగీతి
    భర్తవలదన్న కానల బాటనెంచి
    యశము గన్నట్టి సీతమ్మ ననుసరించి
    పతులతో వనములకేగు పథమునందు
    ద్రౌపది యన జానకికి సోదరియె కాదె!

    నాథుడు చేయలేవనిన నర్మిలి తా వనవాసమెంచుచున్
    గాధకు మూలమై యశము గాంచిన జానకి మార్గమెంచుచున్
    నాథుల వెంట కానలకు నాతిగ సాగగఁ దత్పథమ్మునన్
    మైథిలి చెల్లి కృష్ణ యని మాన్య వరేణ్యులు చెప్పి రెప్పుడో!

    రిప్లయితొలగించండి

  2. సీత యగ్ని పరీక్ష తో చిచ్చు సుతగ
    మారె, ద్రౌపది పుట్టె నంగారమందు
    నిరువు రిటుల చూడగ వింత యేమి కనగ
    ద్రౌపది యన జానాకికి సోదరియె కాదె.


    నాథుడు కోరినంత ధరుణమ్మున దూకిన రామపత్ని యా
    మైథిలి ధూమకేతునకు మాలిక యయ్యెను, భారతమ్మనే
    గాథను జూడ ద్రోవదియు ఘాసి కొమార్తెయె కాదె కాంచగా
    మైథిలి చెల్లి కృష్ణ యని మాన్య వరేణ్యులు చెప్పి రెప్పుడో.

    రిప్లయితొలగించండి
  3. మగని యెంచు కొనె మొదట మైథిలి గద ,
    దానిని గని పై యుగమున దగిన దనుచు
    దృపద సుతయు పాటించె , నీ తీరు జూడ
    ద్రౌపది యన జానకికి సోదరియె కాదె

    రిప్లయితొలగించండి