31-3-2026 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“ద్వేషమె సోదరుల కిడెను విరివిగ శుభముల్”(లేదా...)“ద్వేషమె యన్నదమ్ములకుఁ దెచ్చెను సర్వశుభమ్ము లొక్కటన్”
పాషాణ హృదయులనకుముభోషాణము నందు దూరి పొత్తము లదినన్మూషికములపై కలిగినద్వేషమె , సోదరుల కిడెను విరివిగ శుభముల్”
కందంభాషణమున కౌంతేయులభూషణమగు ధర్మబద్ధ పోకడయె మదిన్ఘోషింప నధర్మముపయిద్వేషమె సోదరుల కిడెను విరివిగ శుభముల్ఉత్పలమాలభాషణమందు తల్లి గురువర్యులు సేసిన బోధలందునన్భూషణమైన వర్తనము పోకడలందున ధర్మబద్ధ యావేషమె పాండునందనుల విజ్ఞత దెల్పగనా యధర్మ విద్వేషమె యన్నదమ్ములకుఁ దెచ్చెను సర్వశుభమ్ము లొక్కటన్
పాషాణ హృదయులనకుము
రిప్లయితొలగించండిభోషాణము నందు దూరి పొత్తము లదినన్
మూషికములపై కలిగిన
ద్వేషమె , సోదరుల కిడెను విరివిగ శుభముల్”
కందం
రిప్లయితొలగించండిభాషణమున కౌంతేయుల
భూషణమగు ధర్మబద్ధ పోకడయె మదిన్
ఘోషింప నధర్మముపయి
ద్వేషమె సోదరుల కిడెను విరివిగ శుభముల్
ఉత్పలమాల
భాషణమందు తల్లి గురువర్యులు సేసిన బోధలందునన్
భూషణమైన వర్తనము పోకడలందున ధర్మబద్ధ యా
వేషమె పాండునందనుల విజ్ఞత దెల్పగనా యధర్మ వి
ద్వేషమె యన్నదమ్ములకుఁ దెచ్చెను సర్వశుభమ్ము లొక్కటన్