19, మార్చి 2026, గురువారం

సమస్య - 5413

 20-3-2026 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ధవునిఁ జేరినంత దర్ప ముడుగు”
(లేదా...)
“ధవునిం జేరినయంత లుప్తమగు నీ దర్పంబు చంద్రాననా”

3 కామెంట్‌లు:

  1. పట్టుమని పదేండ్లు పాఠశాలకు బోయి
    విద్య నభ్య సించి విర్ర వీగు
    పిల్ల దానికిపుడు విద్వాంసు డైనట్టి
    ధవునిఁ జేరినంత దర్ప ముడుగు

    రిప్లయితొలగించండి
  2. విష్ణుమూర్తి గంగాదేవితో...

    ఆటవెలది
    సగర పౌత్రుఁడడుగ గగనవీధి వదలి
    ధరణివైపు సాగు ధాటి పెరుగ
    జూటమందు నోప సుముఖుడైనట్టి యు
    ధవునిఁ జేరినంత దర్ప ముడుగు

    మత్తేభవిక్రీడితము
    అవనిన్ జార భగీరథుండడుగ సాయమ్మీయ నౌనంటివే
    భువనంబున్ విడి భూమికేగెడు పథమ్మున్ ధాటి జృంభింపగన్
    భవుడే యోపఁగ నొప్పె జూటమున నీ భారమ్మదే! పార్వతీ
    ధవునిం జేరినయంత లుప్తమగు నీ దర్పంబు చంద్రాననా!

    ✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*

    రిప్లయితొలగించండి

  3. అల్ప బుద్ధి తోడ హరిని దూషింపకు
    మేటి నంచు నీవు మిడిసి పడకు
    మెంత వారలైన యీశ్వరేశ్వరుడు మా
    ధవునిఁ జేరినంత దర్ప ముడుగు.


    అవనిన్ జేరగ నా భగీరథుడు తానర్థింపగా నప్పుడా
    భవుడొక్కండె సమర్థుడంచు పలుకన్ ప్రార్థింపగా భక్తితో
    శివుడే సమ్మతి తెల్పెనయ్యె నిక హేసీమంతనీ యా యుమా
    ధవునిం జేరినయంత లుప్తమగు నీ దర్పంబు చంద్రాననా.

    రిప్లయితొలగించండి