26, మార్చి 2026, గురువారం

సమస్య - 5420

27-3-2026 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రామ వివాహముఁ గనంగ రావణుఁ డేఁగెన్”
(లేదా...)
“సీతారాముల పెండ్లిఁ జూడఁ జనుదెంచెన్ రావణుం డొయ్యనన్”

2 కామెంట్‌లు:

  1. కందం
    స్వామిని రామునిగ, రమను
    కోమలి జానకి యనఁగ వికుంఠము దీర్చన్
    మేముంటి మని 'జయుఁడనన్'
    రామ వివాహముఁ గనంగ 'రావణుఁ' డేఁగెన్!

    శార్దూలవిక్రీడితము
    ప్రాతఃకాలమునందు విష్ణువును శ్రీరాముండనన్ లక్ష్మినిన్
    సీతాదేవిగ నా వికుంఠపురినన్ జేయంగ కల్యాణమున్
    బ్రీతిన్ గాంచ 'జయుండనన్' మురిసి నుద్వేగంబునుప్పొంగగన్
    సీతారాముల పెండ్లిఁ జూడఁ జనుదెంచెన్ 'రావణుం' డొయ్యనన్!

    రిప్లయితొలగించండి
  2. గోముగ లోకులు వెడలిరి
    రామ వివాహముఁ గనంగ ; రావణుం డేఁగెన్
    తామసమున లంకాపురి
    భామిని జానకి తనకిక బడయని కతనన్

    రిప్లయితొలగించండి