24-3-2026 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“వీణాధరీ దుర్గ విభవమ్ము లిమ్ము”(లేదా...)“వరవీణామృదుపాణివై వరలు శర్వాణీ సిరుల్ గూర్చుమా”
ద్విపదవాణివై యొకచోట వాసిగా వెలసిరాణివై పరమేశు ప్రాణసఖివనరాణకెక్కితివె కొల్హాపురి రమగవీణాధరీ! దుర్గ! విభవమ్ము లిమ్ముమత్తేభవిక్రీడితముస్థిరకీర్తిన్ గని బ్రోచితే జనని కాశ్మీరమ్మునన్ వాణివై!వర విశ్వేశ్వర తీర్థమందు మము గావంగన్ విశాలాక్షివైకురువన్ సంపద లక్ష్మివై మిగులగన్ గొల్హాపురంబందునన్వరవీణామృదుపాణివై వరలు శర్వాణీ !సిరుల్ గూర్చుమా!
మ.స్థిర హృత్పీఠమునందు నీదు రుచిమత్సిందూర యుక్తాంఘ్రులం గరమౌ పూనికతోడి నిల్పెదను నీకై వేచి సద్బుద్ధికై వరవీణామృదుపాణివై వరలు శర్వాణీ, సిరుల్ గూర్చుమా ధర నారాయణపత్నివౌచు సకలాధారంబు నీవే చుడీ !
ద్విపద
రిప్లయితొలగించండివాణివై యొకచోట వాసిగా వెలసి
రాణివై పరమేశు ప్రాణసఖివన
రాణకెక్కితివె కొల్హాపురి రమగ
వీణాధరీ! దుర్గ! విభవమ్ము లిమ్ము
మత్తేభవిక్రీడితము
స్థిరకీర్తిన్ గని బ్రోచితే జనని కాశ్మీరమ్మునన్ వాణివై!
వర విశ్వేశ్వర తీర్థమందు మము గావంగన్ విశాలాక్షివై
కురువన్ సంపద లక్ష్మివై మిగులగన్ గొల్హాపురంబందునన్
వరవీణామృదుపాణివై వరలు శర్వాణీ !సిరుల్ గూర్చుమా!
మ.
రిప్లయితొలగించండిస్థిర హృత్పీఠమునందు నీదు రుచిమత్సిందూర యుక్తాంఘ్రులం
గరమౌ పూనికతోడి నిల్పెదను నీకై వేచి సద్బుద్ధికై
వరవీణామృదుపాణివై వరలు శర్వాణీ, సిరుల్ గూర్చుమా
ధర నారాయణపత్నివౌచు సకలాధారంబు నీవే చుడీ !