2-5-2026 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అమరులఁ దునుమాడియు సుధ నందిరి దైత్యుల్”
(లేదా...)
“అమరుల సంహరించి సుధనంతయు దైత్యులె పొంది రుద్ధతిన్”
(పి.ఎల్. నాగేశ్వర రావు గారికి ధన్యవాదాలతో...)
కందంకుమతులనాలోచనెపుడునమానుషము లెంచు గాదె! యంబుధి ఫలమున్సమమెంచక స్వప్నంబుననమరులఁ దునుమాడియు సుధ నందిరి దైత్యుల్! చంపకమాలకుమతుల చింతనల్ సతము క్రూరమునే తలపోయు నెప్పుడున్సుముఖత దెల్పియున్ జిలికి సోదర భావము తోడ నంత్యమున్సమముగ పొందుటెందుకను స్వార్థ గుణమ్మున స్వప్నమందు వారమరుల సంహరించి సుధనంతయు దైత్యులె పొంది రుద్ధతిన్!
సవరించిన కందము:కందంకుమతుల యాలోచనలెపుడమానుషము లెంచు గాదె! యంబుధి ఫలమున్సమమెంచక స్వప్నంబుననమరులఁ దునుమాడియు సుధ నందిరి దైత్యుల్!
అమరులు దైత్యులు వారిధినమితముగా త్రచ్చినంత నందెను సుధయేతమరికెవరు తెలిపితిరిటులమరులఁ దునుమాడియు సుధ నందిరి దైత్యుల్?
కొమరుడు పితతో , పేయపుసముద్రమును చిలికినంత సమకూరినదౌయమృతముపై నుడివెనిటుల అమరులఁ దునుమాడియు సుధ నందిరి దైత్యుల్
అమరప్రభువే గాంచెను శమని శయించిన తరుణము స్వప్నము లోనన్ కుమతులు వారలు గావున నమరులఁ దునుమాడియు సుధ నందిరి దైత్యుల్.కుమతులు వారు రాక్షసులు కుట్రల వెన్నియొ పన్ను వారలా యమృతము పొందగా నని ప్రయాగ భయుండట సంశయించుచున్ శమని శయించు వేళ నొక స్వప్నము గాంచగ నందులోన నా యమరుల సంహరించి సుధనంతయు దైత్యులె పొంది రుద్ధతిన్.
అమృతము నాశించి నపుడుతమకముతో పాల్కడలిని త్రచ్చిరి గాదే!తమ వికృతపు తలపులలోనమరులఁ దునుమాడియు సుధ నందిరి దైత్యుల్అమృతము సంభవింపఁ గని నంతట పోరిరి దానికోసమైయమరుల సంహరించి సుధనంతయు దైత్యులె పొంది రుద్ధతిన్దమకది యందకుండెనని తత్క్షణమే సురులంత తెల్పగాబొమముడి వైచి కేశవుడు మోహినియై పొడతెంచె నచ్చటన్[సంహరించు = నిగ్రహించు,నిరోధించు]
అమరులు దైత్యులున్ జలధి నగ్గలికమ్ముగ ద్రచ్చినంతనాక్రమమున పాలసంద్రమున కంజము బుట్టెను దానినిమ్ముగానమరుల పాలొనర్చె హరియన్నది నిక్కువ మెట్టులందువోయమరుల సంహరించి సుధనంతయు దైత్యులె పొంది రుద్ధతిన్?
చం॥ అమృతము నొందు ఘట్టమును నా హరి యుక్తి పఠించి మోదమైఅమరులఁ జేయ దేవతల నచ్యుతు లీలల నెంచి భక్తితోఁదమిఁగని నిద్ర పోవనటు ధన్యతఁ గాంచుచు స్వప్న మందహోఅమరుల సంహరించి సుధనంతయు దైత్యులె పొందిరుద్ధతన్
కం:అమృతమె మృత సంజీవనియమలిను డౌ కచుడు దాని నందక ము న్నాసమరముల జచ్చుచుండియు నమరులఁ దునుమాడియు సుధ నందిరి దైత్యుల్”(కచుడు మృతసంజీవని నేర్వక ముందు దేవతలు మరణించే వాళ్లు.రాక్షసులు మరణించినా బతికే వాళ్లు.ఆ విద్యయే అమృతం వంటిది. )
చం:అమలిన చిత్తు డౌ కచు డహమ్మును వీడుచు శుక్ర శిష్యుడైయమృతము బోలు విద్య బడయన్ శుభ మయ్యెను గాని పూర్వ మాఅమరుల సంహరించి సుధనంతయు దైత్యులె పొంది, రుద్ధతిన్సమరము లందు చచ్చియును జన్మము లొందుచు నుండి రక్కటా!
సుమధుర స్వప్నము నందున కమనీ యపు దృశ్య మొకటి కనుపించ o గా ప్రమదంబు న దెలిపె నొకడు " నమరుల దునుమాడియు సుధ నందిరి దైత్యుల్
సమయము కా దిది పరిహాసమున కసురు లేడ యమర సంహర మేడా భ్రమ పడఁగ నేల యెచ్చట నమరులఁ దునుమాడియు సుధ నందిరి దైత్యుల్ దమనులు నాదితేయులును దైత్యులుఁ గశ్యపు బిడ్డ లైననుం గుమతులు దైత్యు లెల్ల రని కొందఱు నిత్యము దల్చుచుంద్రు దోషములకు నెల్ల మూలము నిశాచరు లంచు వచింతు రిట్లహో యమరుల సంహరించి సుధ నంతయు దైత్యులె పొంది రుద్ధతిన్
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.అమృతమ్మును కోరి చిలుకనమరులు నసురులును కలసి, హరియే పంచెన్అమరుల కమృతము,మరెపుడునమరులఁ దునుమాడియు సుధ నందిరి దైత్యుల్?
కందం
రిప్లయితొలగించండికుమతులనాలోచనెపుడు
నమానుషము లెంచు గాదె! యంబుధి ఫలమున్
సమమెంచక స్వప్నంబున
నమరులఁ దునుమాడియు సుధ నందిరి దైత్యుల్!
చంపకమాల
కుమతుల చింతనల్ సతము క్రూరమునే తలపోయు నెప్పుడున్
సుముఖత దెల్పియున్ జిలికి సోదర భావము తోడ నంత్యమున్
సమముగ పొందుటెందుకను స్వార్థ గుణమ్మున స్వప్నమందు వా
రమరుల సంహరించి సుధనంతయు దైత్యులె పొంది రుద్ధతిన్!
సవరించిన కందము:
తొలగించండికందం
కుమతుల యాలోచనలెపు
డమానుషము లెంచు గాదె! యంబుధి ఫలమున్
సమమెంచక స్వప్నంబున
నమరులఁ దునుమాడియు సుధ నందిరి దైత్యుల్!
అమరులు దైత్యులు వారిధి
రిప్లయితొలగించండినమితముగా త్రచ్చినంత నందెను సుధయే
తమరికెవరు తెలిపితిరిటు
లమరులఁ దునుమాడియు సుధ నందిరి దైత్యుల్?
కొమరుడు పితతో , పేయపు
రిప్లయితొలగించండిసముద్రమును చిలికినంత సమకూరినదౌ
యమృతముపై నుడివెనిటుల
అమరులఁ దునుమాడియు సుధ నందిరి దైత్యుల్
రిప్లయితొలగించండిఅమరప్రభువే గాంచెను
శమని శయించిన తరుణము స్వప్నము లోనన్
కుమతులు వారలు గావున
నమరులఁ దునుమాడియు సుధ నందిరి దైత్యుల్.
కుమతులు వారు రాక్షసులు కుట్రల వెన్నియొ పన్ను వారలా
యమృతము పొందగా నని ప్రయాగ భయుండట సంశయించుచున్
శమని శయించు వేళ నొక స్వప్నము గాంచగ నందులోన నా
యమరుల సంహరించి సుధనంతయు దైత్యులె పొంది రుద్ధతిన్.
అమృతము నాశించి నపుడు
రిప్లయితొలగించండితమకముతో పాల్కడలిని త్రచ్చిరి గాదే!
తమ వికృతపు తలపులలో
నమరులఁ దునుమాడియు సుధ నందిరి దైత్యుల్
అమృతము సంభవింపఁ గని నంతట పోరిరి దానికోసమై
యమరుల సంహరించి సుధనంతయు దైత్యులె పొంది రుద్ధతిన్
దమకది యందకుండెనని తత్క్షణమే సురులంత తెల్పగా
బొమముడి వైచి కేశవుడు మోహినియై పొడతెంచె నచ్చటన్
[సంహరించు = నిగ్రహించు,నిరోధించు]
అమరులు దైత్యులున్ జలధి నగ్గలికమ్ముగ ద్రచ్చినంతనా
రిప్లయితొలగించండిక్రమమున పాలసంద్రమున కంజము బుట్టెను దానినిమ్ముగా
నమరుల పాలొనర్చె హరియన్నది నిక్కువ మెట్టులందువో
యమరుల సంహరించి సుధనంతయు దైత్యులె పొంది రుద్ధతిన్?
చం॥ అమృతము నొందు ఘట్టమును నా హరి యుక్తి పఠించి మోదమై
రిప్లయితొలగించండిఅమరులఁ జేయ దేవతల నచ్యుతు లీలల నెంచి భక్తితోఁ
దమిఁగని నిద్ర పోవనటు ధన్యతఁ గాంచుచు స్వప్న మందహో
అమరుల సంహరించి సుధనంతయు దైత్యులె పొందిరుద్ధతన్
కం:అమృతమె మృత సంజీవని
రిప్లయితొలగించండియమలిను డౌ కచుడు దాని నందక ము న్నా
సమరముల జచ్చుచుండియు
నమరులఁ దునుమాడియు సుధ నందిరి దైత్యుల్”
(కచుడు మృతసంజీవని నేర్వక ముందు దేవతలు మరణించే వాళ్లు.రాక్షసులు మరణించినా బతికే వాళ్లు.ఆ విద్యయే అమృతం వంటిది. )
చం:అమలిన చిత్తు డౌ కచు డహమ్మును వీడుచు శుక్ర శిష్యుడై
రిప్లయితొలగించండియమృతము బోలు విద్య బడయన్ శుభ మయ్యెను గాని పూర్వ మా
అమరుల సంహరించి సుధనంతయు దైత్యులె పొంది, రుద్ధతిన్
సమరము లందు చచ్చియును జన్మము లొందుచు నుండి రక్కటా!
సుమధుర స్వప్నము నందున
రిప్లయితొలగించండికమనీ యపు దృశ్య మొకటి కనుపించ o గా
ప్రమదంబు న దెలిపె నొకడు
" నమరుల దునుమాడియు సుధ నందిరి దైత్యుల్
సమయము కా దిది పరిహా
రిప్లయితొలగించండిసమున కసురు లేడ యమర సంహర మేడా
భ్రమ పడఁగ నేల యెచ్చట
నమరులఁ దునుమాడియు సుధ నందిరి దైత్యుల్
దమనులు నాదితేయులును దైత్యులుఁ గశ్యపు బిడ్డ లైననుం
గుమతులు దైత్యు లెల్ల రని కొందఱు నిత్యము దల్చుచుంద్రు దో
షములకు నెల్ల మూలము నిశాచరు లంచు వచింతు రిట్లహో
యమరుల సంహరించి సుధ నంతయు దైత్యులె పొంది రుద్ధతిన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
అమృతమ్మును కోరి చిలుక
నమరులు నసురులును కలసి, హరియే
పంచెన్
అమరుల కమృతము,మరెపుడు
నమరులఁ దునుమాడియు సుధ నందిరి
దైత్యుల్?