1, మే 2026, శుక్రవారం

సమస్య - 5456

2-5-2026 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“అమరులఁ దునుమాడియు సుధ నందిరి దైత్యుల్”

(లేదా...)

“అమరుల సంహరించి సుధనంతయు దైత్యులె పొంది రుద్ధతిన్”

(పి.ఎల్. నాగేశ్వర రావు గారికి ధన్యవాదాలతో...)

13 కామెంట్‌లు:

  1. కందం
    కుమతులనాలోచనెపుడు
    నమానుషము లెంచు గాదె! యంబుధి ఫలమున్
    సమమెంచక స్వప్నంబున
    నమరులఁ దునుమాడియు సుధ నందిరి దైత్యుల్!

    చంపకమాల
    కుమతుల చింతనల్ సతము క్రూరమునే తలపోయు నెప్పుడున్
    సుముఖత దెల్పియున్ జిలికి సోదర భావము తోడ నంత్యమున్
    సమముగ పొందుటెందుకను స్వార్థ గుణమ్మున స్వప్నమందు వా
    రమరుల సంహరించి సుధనంతయు దైత్యులె పొంది రుద్ధతిన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవరించిన కందము:

      కందం
      కుమతుల యాలోచనలెపు
      డమానుషము లెంచు గాదె! యంబుధి ఫలమున్
      సమమెంచక స్వప్నంబున
      నమరులఁ దునుమాడియు సుధ నందిరి దైత్యుల్!

      తొలగించండి
  2. అమరులు దైత్యులు వారిధి
    నమితముగా త్రచ్చినంత నందెను సుధయే
    తమరికెవరు తెలిపితిరిటు
    లమరులఁ దునుమాడియు సుధ నందిరి దైత్యుల్?

    రిప్లయితొలగించండి
  3. కొమరుడు పితతో , పేయపు
    సముద్రమును చిలికినంత సమకూరినదౌ
    యమృతముపై నుడివెనిటుల
    అమరులఁ దునుమాడియు సుధ నందిరి దైత్యుల్

    రిప్లయితొలగించండి

  4. అమరప్రభువే గాంచెను
    శమని శయించిన తరుణము స్వప్నము లోనన్
    కుమతులు వారలు గావున
    నమరులఁ దునుమాడియు సుధ నందిరి దైత్యుల్.


    కుమతులు వారు రాక్షసులు కుట్రల వెన్నియొ పన్ను వారలా
    యమృతము పొందగా నని ప్రయాగ భయుండట సంశయించుచున్
    శమని శయించు వేళ నొక స్వప్నము గాంచగ నందులోన నా
    యమరుల సంహరించి సుధనంతయు దైత్యులె పొంది రుద్ధతిన్.

    రిప్లయితొలగించండి
  5. అమృతము నాశించి నపుడు
    తమకముతో పాల్కడలిని త్రచ్చిరి గాదే!
    తమ వికృతపు తలపులలో
    నమరులఁ దునుమాడియు సుధ నందిరి దైత్యుల్

    అమృతము సంభవింపఁ గని నంతట పోరిరి దానికోసమై
    యమరుల సంహరించి సుధనంతయు దైత్యులె పొంది రుద్ధతిన్
    దమకది యందకుండెనని తత్క్షణమే సురులంత తెల్పగా
    బొమముడి వైచి కేశవుడు మోహినియై పొడతెంచె నచ్చటన్

    [సంహరించు = నిగ్రహించు,నిరోధించు]

    రిప్లయితొలగించండి
  6. అమరులు దైత్యులున్ జలధి నగ్గలికమ్ముగ ద్రచ్చినంతనా
    క్రమమున పాలసంద్రమున కంజము బుట్టెను దానినిమ్ముగా
    నమరుల పాలొనర్చె హరియన్నది నిక్కువ మెట్టులందువో
    యమరుల సంహరించి సుధనంతయు దైత్యులె పొంది రుద్ధతిన్?

    రిప్లయితొలగించండి
  7. చం॥ అమృతము నొందు ఘట్టమును నా హరి యుక్తి పఠించి మోదమై
    అమరులఁ జేయ దేవతల నచ్యుతు లీలల నెంచి భక్తితోఁ
    దమిఁగని నిద్ర పోవనటు ధన్యతఁ గాంచుచు స్వప్న మందహో
    అమరుల సంహరించి సుధనంతయు దైత్యులె పొందిరుద్ధతన్

    రిప్లయితొలగించండి
  8. కం:అమృతమె మృత సంజీవని
    యమలిను డౌ కచుడు దాని నందక ము న్నా
    సమరముల జచ్చుచుండియు
    నమరులఁ దునుమాడియు సుధ నందిరి దైత్యుల్”
    (కచుడు మృతసంజీవని నేర్వక ముందు దేవతలు మరణించే వాళ్లు.రాక్షసులు మరణించినా బతికే వాళ్లు.ఆ విద్యయే అమృతం వంటిది. )

    రిప్లయితొలగించండి
  9. చం:అమలిన చిత్తు డౌ కచు డహమ్మును వీడుచు శుక్ర శిష్యుడై
    యమృతము బోలు విద్య బడయన్ శుభ మయ్యెను గాని పూర్వ మా
    అమరుల సంహరించి సుధనంతయు దైత్యులె పొంది, రుద్ధతిన్
    సమరము లందు చచ్చియును జన్మము లొందుచు నుండి రక్కటా!

    రిప్లయితొలగించండి
  10. సుమధుర స్వప్నము నందున
    కమనీ యపు దృశ్య మొకటి కనుపించ o గా
    ప్రమదంబు న దెలిపె నొకడు
    " నమరుల దునుమాడియు సుధ నందిరి దైత్యుల్

    రిప్లయితొలగించండి
  11. సమయము కా దిది పరిహా
    సమున కసురు లేడ యమర సంహర మేడా
    భ్రమ పడఁగ నేల యెచ్చట
    నమరులఁ దునుమాడియు సుధ నందిరి దైత్యుల్


    దమనులు నాదితేయులును దైత్యులుఁ గశ్యపు బిడ్డ లైననుం
    గుమతులు దైత్యు లెల్ల రని కొందఱు నిత్యము దల్చుచుంద్రు దో
    షములకు నెల్ల మూలము నిశాచరు లంచు వచింతు రిట్లహో
    యమరుల సంహరించి సుధ నంతయు దైత్యులె పొంది రుద్ధతిన్

    రిప్లయితొలగించండి

  12. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    అమృతమ్మును కోరి చిలుక
    నమరులు నసురులును కలసి, హరియే
    పంచెన్
    అమరుల కమృతము,మరెపుడు
    నమరులఁ దునుమాడియు సుధ నందిరి
    దైత్యుల్?

    రిప్లయితొలగించండి