8-5-2026 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సీతకుఁ గర్ణుండు బావ సెప్పిరి ప్రాజ్ఞుల్”
(లేదా...)
“ధరణీజాతకు బావ కర్ణుఁడు గదా ధర్మజ్ఞు లౌనందురే”
త్రేతన రాముడు పతియగుసీతకుఁ ; గర్ణుండు బావ సెప్పిరి ప్రాజ్ఞుల్ఆతీగవ యుగము నందున కౌంతేయుల, మాద్రి సుతుల గాదిలి తోడన్
నాతియె త్రేతా యుగమని ఖ్యాతి గడించెను గాదె కర్ణుండిలలో నీతీరు గనిన గాడని సీతకుఁ గర్ణుండు బావ సెప్పిరి ప్రాజ్ఞుల్.సురనే గ్రోలి వచింతువేమొ యిదియే చోద్యంబు గా దోచెనే ధరణిన్ నిన్ను క్షమింతురే జనులు సత్యానిట్టులేమార్చినన్ సరి కాదంచును తెల్పెనమ్ముమిది శాస్త్రాలెల్ల కాదంచనెన్ ధరణీజాతకు బావ కర్ణుఁడు గదా, ధర్మజ్ఞు లౌనందురే.
-ఏతాటి చెట్టు కల్లునిమోతాదుకు మించి త్రాగి మునిగితివో యేరా తుంటరి భడవా యేసీతకు కర్ణుండు బావ సెప్పిరి విదురుల్ ?
చేతము చెడిపోయినదోవాతము క్రమ్మెనొ తనువుకు వాచాలుఁడవోనీతివిడచి యనదగునాసీతకుఁ గర్ణుండు బావ సెప్పిరి ప్రాజ్ఞుల్?
పరమాత్ముండగు రామచంద్రు సతియౌ వైదేహికిన్ సీతకున్ధరలో కర్ణునితోడ బంధమును సంధానించ నీకొప్పునేసురనుం గ్రోలి వచించు చుంటివొకొ బల్ చోద్యమ్ముగా నిట్టులన్:"ధరణీజాతకు బావ కర్ణుఁడు గదా" ధర్మజ్ఞు లౌనందురే?
త్రేతన రాముడు పతియగు
రిప్లయితొలగించండిసీతకుఁ ; గర్ణుండు బావ సెప్పిరి ప్రాజ్ఞుల్
ఆతీగవ యుగము నందున
కౌంతేయుల, మాద్రి సుతుల గాదిలి తోడన్
రిప్లయితొలగించండినాతియె త్రేతా యుగమని
ఖ్యాతి గడించెను గాదె కర్ణుండిలలో
నీతీరు గనిన గాడని
సీతకుఁ గర్ణుండు బావ సెప్పిరి ప్రాజ్ఞుల్.
సురనే గ్రోలి వచింతువేమొ యిదియే చోద్యంబు గా దోచెనే
ధరణిన్ నిన్ను క్షమింతురే జనులు సత్యానిట్టులేమార్చినన్
సరి కాదంచును తెల్పెనమ్ముమిది శాస్త్రాలెల్ల కాదంచనెన్
ధరణీజాతకు బావ కర్ణుఁడు గదా, ధర్మజ్ఞు లౌనందురే.
-
రిప్లయితొలగించండిఏతాటి చెట్టు కల్లుని
మోతాదుకు మించి త్రాగి మునిగితివో యే
రా తుంటరి భడవా యే
సీతకు కర్ణుండు బావ సెప్పిరి విదురుల్ ?
చేతము చెడిపోయినదో
రిప్లయితొలగించండివాతము క్రమ్మెనొ తనువుకు వాచాలుఁడవో
నీతివిడచి యనదగునా
సీతకుఁ గర్ణుండు బావ సెప్పిరి ప్రాజ్ఞుల్?
పరమాత్ముండగు రామచంద్రు సతియౌ వైదేహికిన్ సీతకున్
రిప్లయితొలగించండిధరలో కర్ణునితోడ బంధమును సంధానించ నీకొప్పునే
సురనుం గ్రోలి వచించు చుంటివొకొ బల్ చోద్యమ్ముగా నిట్టులన్:
"ధరణీజాతకు బావ కర్ణుఁడు గదా" ధర్మజ్ఞు లౌనందురే?