7, మే 2026, గురువారం

సమస్య - 5462

8-5-2026 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“సీతకుఁ గర్ణుండు బావ సెప్పిరి ప్రాజ్ఞుల్”

(లేదా...)

“ధరణీజాతకు బావ కర్ణుఁడు గదా ధర్మజ్ఞు లౌనందురే”

5 కామెంట్‌లు:

  1. త్రేతన రాముడు పతియగు
    సీతకుఁ ; గర్ణుండు బావ సెప్పిరి ప్రాజ్ఞుల్
    ఆతీగవ యుగము నందున
    కౌంతేయుల, మాద్రి సుతుల గాదిలి తోడన్

    రిప్లయితొలగించండి

  2. నాతియె త్రేతా యుగమని
    ఖ్యాతి గడించెను గాదె కర్ణుండిలలో
    నీతీరు గనిన గాడని
    సీతకుఁ గర్ణుండు బావ సెప్పిరి ప్రాజ్ఞుల్.


    సురనే గ్రోలి వచింతువేమొ యిదియే చోద్యంబు గా దోచెనే
    ధరణిన్ నిన్ను క్షమింతురే జనులు సత్యానిట్టులేమార్చినన్
    సరి కాదంచును తెల్పెనమ్ముమిది శాస్త్రాలెల్ల కాదంచనెన్
    ధరణీజాతకు బావ కర్ణుఁడు గదా, ధర్మజ్ఞు లౌనందురే.

    రిప్లయితొలగించండి
  3. -
    ఏతాటి చెట్టు కల్లుని
    మోతాదుకు మించి త్రాగి మునిగితివో యే
    రా తుంటరి భడవా యే
    సీతకు కర్ణుండు బావ సెప్పిరి విదురుల్ ?


    రిప్లయితొలగించండి
  4. చేతము చెడిపోయినదో
    వాతము క్రమ్మెనొ తనువుకు వాచాలుఁడవో
    నీతివిడచి యనదగునా
    సీతకుఁ గర్ణుండు బావ సెప్పిరి ప్రాజ్ఞుల్?

    రిప్లయితొలగించండి
  5. పరమాత్ముండగు రామచంద్రు సతియౌ వైదేహికిన్ సీతకున్
    ధరలో కర్ణునితోడ బంధమును సంధానించ నీకొప్పునే
    సురనుం గ్రోలి వచించు చుంటివొకొ బల్ చోద్యమ్ముగా నిట్టులన్:
    "ధరణీజాతకు బావ కర్ణుఁడు గదా" ధర్మజ్ఞు లౌనందురే?

    రిప్లయితొలగించండి