8-5-2026 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సీతకుఁ గర్ణుండు బావ సెప్పిరి ప్రాజ్ఞుల్”
(లేదా...)
“ధరణీజాతకు బావ కర్ణుఁడు గదా ధర్మజ్ఞు లౌనందురే”
త్రేతన రాముడు పతియగుసీతకుఁ ; గర్ణుండు బావ సెప్పిరి ప్రాజ్ఞుల్ఆతీగవ యుగము నందున కౌంతేయుల, మాద్రి సుతుల గాదిలి తోడన్
నాతియె త్రేతా యుగమని ఖ్యాతి గడించెను గాదె కర్ణుండిలలో నీతీరు గనిన గాడని సీతకుఁ గర్ణుండు బావ సెప్పిరి ప్రాజ్ఞుల్.సురనే గ్రోలి వచింతువేమొ యిదియే చోద్యంబు గా దోచెనే ధరణిన్ నిన్ను క్షమింతురే జనులు సత్యానిట్టులేమార్చినన్ సరి కాదంచును తెల్పెనమ్ముమిది శాస్త్రాలెల్ల కాదంచనెన్ ధరణీజాతకు బావ కర్ణుఁడు గదా, ధర్మజ్ఞు లౌనందురే.
-ఏతాటి చెట్టు కల్లునిమోతాదుకు మించి త్రాగి మునిగితివో యేరా తుంటరి భడవా యేసీతకు కర్ణుండు బావ సెప్పిరి విదురుల్ ?
చేతము చెడిపోయినదోవాతము క్రమ్మెనొ తనువుకు వాచాలుఁడవోనీతివిడచి యనదగునాసీతకుఁ గర్ణుండు బావ సెప్పిరి ప్రాజ్ఞుల్?
పరమాత్ముండగు రామచంద్రు సతియౌ వైదేహికిన్ సీతకున్ధరలో కర్ణునితోడ బంధమును సంధానించ నీకొప్పునేసురనుం గ్రోలి వచించు చుంటివొకొ బల్ చోద్యమ్ముగా నిట్టులన్:"ధరణీజాతకు బావ కర్ణుఁడు గదా" ధర్మజ్ఞు లౌనందురే?
కం:ఏ తీరు భారతమ్మునసీతకుఁ గర్ణుండు బావ? సెప్పిరి ప్రాజ్ఞుల్”త్రేతా యుగకథ సీతదియా తరువాతి కథ కర్ణు దని యో చెనటీ!
చేతన మొట్లొప్పెను నీవీతీరుగ కానిపోని వింతలు సెప్పన్శ్రోతలు విని యడ్గుదు రే సీతకుఁ గర్ణుండు బావ సెప్పిరి ప్రాజ్ఞుల్?
మ:వరసంజాతగ, యాజ్ఞ సేనిగను సద్వంశప్రకీర్తిన్ నిరంతరమున్ నిల్పిన సాధ్వికిన్, దగిన యన్నన్ గల్గు పాంచాల సద్ధరణీజాతకు బావ కర్ణుఁడు గదా ! ధర్మజ్ఞు లౌనందురే?హరి యాద్రౌపది నీకు దక్కుననియే ఆ కర్ణు తొ జెప్పుటన్. (ఆమె ధరణీ జాత అంటే పాంచాలధరణీ జాత. ఆ సాధ్వి బావ ఐన కర్ణుణ్ని వరిస్తుం దని కృష్ణుడే అన్నా డంటే ధర్మజునులు ఔనంటారా? అది అపార్థం. )
మ॥ ధరలో మూర్ఖున కెట్లు తెల్పఁదగు సంధానించి కౌశల్యమున్గరపన్ ద్రౌపది బావ కర్ణుఁడని వక్కాణించి పల్మాఱులున్మరపున్ బొందిన జ్ఞాని వోలెఁ బలికెన్ మందుండు స్పష్టమ్ముగాధరణీజాతకు బావ కర్ణుఁడు గదా ధర్మజ్ఞు లౌనందురే!(పరమానందయ్య శిష్యుడండి)
త్రేతా యుగమున భూసుత,నాతి ద్రుపదరాజపుత్రి నారాయణియే ఖ్యాతినబేధవశమునన్ సీతకుఁ గర్ణుండు బావ సెప్పిరి ప్రాజ్ఞుల్
శ్రోత లమా యకు లనుకొని రోతగ ప్రవచించు నొకడు రూడి గ నని యెన్ పూత చరిత్ర యనె డు నా సీతకు గర్ణు o డు బావ సె ప్పిరి ప్రాజ్నుల్
ఆతత సంతోషమ్మున వీత సకల దుఃఖముల భువిఁ దగ వెలుఁగుమా నీతి గతిఁ జరింపుమ యని సీతకుఁ గర్ణుండు బావ సెప్పిరి ప్రాజ్ఞుల్ [కర్ణనాముఁడు మఱియు బావ యిద్దఱు సెప్పిరి, వారు ప్రాజ్ఞులు] నరనాథాత్మజుఁడై రమేశుఁ డిలలోనం బుట్ట రాముండు నా సిరియే పుట్టెను సీత నామ మలరన్ శ్రీరామభద్రాఖ్యునే ధరణీ నిర్జర దుఃఖ సాగర తరిత్రశ్రేష్ఠకర్ణుం డనన్ ధరణీజాతకు బావ కర్ణుఁడు గదా ధర్మజ్ఞు లౌనందురే [కర్ణము = చుక్కాను]
'ధరణీజాత'గ నామమున్న సకికే తానక్క భర్తైనచో?హరిపుత్రుండగు కుంతి కన్న కొడుకౌ నావ్యక్తి పేరేమిటో?ధరపై నాగటి చాలులో దొరకెనా తన్వంగి వైదేహియే?ధరణీజాతకు బావ; కర్ణుఁడు గదా; ధర్మజ్ఞు లౌనందురే
వాతాయువు ప్రియమెవరికి?జ్యోతికి కుంతికి తనయుడు? సోదరిమగడౌ? సీతా రాముల చరితము?సీతకుఁ; గర్ణుండు; బావ; సెప్పిరి ప్రాజ్ఞుల్
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.కోతియె సాయము చేసెనుసీతకుఁ; గర్ణుండు బావ, సెప్పిరి ప్రాజ్ఞుల్పూతనను చంపిన హరికిమాత యశోదట పెరిగిన మాధవునికినిన్.
త్రేతన రాముడు పతియగు
రిప్లయితొలగించండిసీతకుఁ ; గర్ణుండు బావ సెప్పిరి ప్రాజ్ఞుల్
ఆతీగవ యుగము నందున
కౌంతేయుల, మాద్రి సుతుల గాదిలి తోడన్
రిప్లయితొలగించండినాతియె త్రేతా యుగమని
ఖ్యాతి గడించెను గాదె కర్ణుండిలలో
నీతీరు గనిన గాడని
సీతకుఁ గర్ణుండు బావ సెప్పిరి ప్రాజ్ఞుల్.
సురనే గ్రోలి వచింతువేమొ యిదియే చోద్యంబు గా దోచెనే
ధరణిన్ నిన్ను క్షమింతురే జనులు సత్యానిట్టులేమార్చినన్
సరి కాదంచును తెల్పెనమ్ముమిది శాస్త్రాలెల్ల కాదంచనెన్
ధరణీజాతకు బావ కర్ణుఁడు గదా, ధర్మజ్ఞు లౌనందురే.
-
రిప్లయితొలగించండిఏతాటి చెట్టు కల్లుని
మోతాదుకు మించి త్రాగి మునిగితివో యే
రా తుంటరి భడవా యే
సీతకు కర్ణుండు బావ సెప్పిరి విదురుల్ ?
చేతము చెడిపోయినదో
రిప్లయితొలగించండివాతము క్రమ్మెనొ తనువుకు వాచాలుఁడవో
నీతివిడచి యనదగునా
సీతకుఁ గర్ణుండు బావ సెప్పిరి ప్రాజ్ఞుల్?
పరమాత్ముండగు రామచంద్రు సతియౌ వైదేహికిన్ సీతకున్
రిప్లయితొలగించండిధరలో కర్ణునితోడ బంధమును సంధానించ నీకొప్పునే
సురనుం గ్రోలి వచించు చుంటివొకొ బల్ చోద్యమ్ముగా నిట్టులన్:
"ధరణీజాతకు బావ కర్ణుఁడు గదా" ధర్మజ్ఞు లౌనందురే?
కం:ఏ తీరు భారతమ్మున
రిప్లయితొలగించండిసీతకుఁ గర్ణుండు బావ? సెప్పిరి ప్రాజ్ఞుల్”
త్రేతా యుగకథ సీతది
యా తరువాతి కథ కర్ణు దని యో చెనటీ!
చేతన మొట్లొప్పెను నీ
రిప్లయితొలగించండివీతీరుగ కానిపోని వింతలు సెప్పన్
శ్రోతలు విని యడ్గుదు రే
సీతకుఁ గర్ణుండు బావ సెప్పిరి ప్రాజ్ఞుల్?
మ:వరసంజాతగ, యాజ్ఞ సేనిగను సద్వంశప్రకీర్తిన్ నిరం
రిప్లయితొలగించండితరమున్ నిల్పిన సాధ్వికిన్, దగిన యన్నన్ గల్గు పాంచాల స
ద్ధరణీజాతకు బావ కర్ణుఁడు గదా ! ధర్మజ్ఞు లౌనందురే?
హరి యాద్రౌపది నీకు దక్కుననియే ఆ కర్ణు తొ జెప్పుటన్.
(ఆమె ధరణీ జాత అంటే పాంచాలధరణీ జాత. ఆ సాధ్వి బావ ఐన కర్ణుణ్ని వరిస్తుం దని కృష్ణుడే అన్నా డంటే ధర్మజునులు ఔనంటారా? అది అపార్థం. )
మ॥ ధరలో మూర్ఖున కెట్లు తెల్పఁదగు సంధానించి కౌశల్యమున్
రిప్లయితొలగించండిగరపన్ ద్రౌపది బావ కర్ణుఁడని వక్కాణించి పల్మాఱులున్
మరపున్ బొందిన జ్ఞాని వోలెఁ బలికెన్ మందుండు స్పష్టమ్ముగా
ధరణీజాతకు బావ కర్ణుఁడు గదా ధర్మజ్ఞు లౌనందురే!
(పరమానందయ్య శిష్యుడండి)
త్రేతా యుగమున భూసుత,
రిప్లయితొలగించండినాతి ద్రుపదరాజపుత్రి నారాయణియే
ఖ్యాతినబేధవశమునన్
సీతకుఁ గర్ణుండు బావ సెప్పిరి ప్రాజ్ఞుల్
శ్రోత లమా యకు లనుకొని
రిప్లయితొలగించండిరోతగ ప్రవచించు నొకడు రూడి గ నని యెన్
పూత చరిత్ర యనె డు నా
సీతకు గర్ణు o డు బావ సె ప్పిరి ప్రాజ్నుల్
ఆతత సంతోషమ్మున
రిప్లయితొలగించండివీత సకల దుఃఖముల భువిఁ దగ వెలుఁగుమా
నీతి గతిఁ జరింపుమ యని
సీతకుఁ గర్ణుండు బావ సెప్పిరి ప్రాజ్ఞుల్
[కర్ణనాముఁడు మఱియు బావ యిద్దఱు సెప్పిరి, వారు ప్రాజ్ఞులు]
నరనాథాత్మజుఁడై రమేశుఁ డిలలోనం బుట్ట రాముండు నా
సిరియే పుట్టెను సీత నామ మలరన్ శ్రీరామభద్రాఖ్యునే
ధరణీ నిర్జర దుఃఖ సాగర తరిత్రశ్రేష్ఠకర్ణుం డనన్
ధరణీజాతకు బావ కర్ణుఁడు గదా ధర్మజ్ఞు లౌనందురే
[కర్ణము = చుక్కాను]
'ధరణీజాత'గ నామమున్న సకికే తానక్క భర్తైనచో?
రిప్లయితొలగించండిహరిపుత్రుండగు కుంతి కన్న కొడుకౌ నావ్యక్తి పేరేమిటో?
ధరపై నాగటి చాలులో దొరకెనా తన్వంగి వైదేహియే?
ధరణీజాతకు బావ; కర్ణుఁడు గదా; ధర్మజ్ఞు లౌనందురే
వాతాయువు ప్రియమెవరికి?
తొలగించండిజ్యోతికి కుంతికి తనయుడు? సోదరిమగడౌ?
సీతా రాముల చరితము?
సీతకుఁ; గర్ణుండు; బావ; సెప్పిరి ప్రాజ్ఞుల్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
కోతియె సాయము చేసెను
సీతకుఁ; గర్ణుండు బావ, సెప్పిరి ప్రాజ్ఞుల్
పూతనను చంపిన హరికి
మాత యశోదట పెరిగిన మాధవునికినిన్.