20, జులై 2026, సోమవారం

సమస్య - 5534

21-7-2026 (మంగళవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“జ్ఞానము లేనట్టివాఁడె గౌరవమందున్”

(లేదా...)

“జ్ఞానవిహీనుఁడే ఘనుఁడు గౌరవనీయుఁడు సంఘమందునన్”

(న.చ. సాహిత్ అర్ధశతావధానంలో మరుమాముల దత్తాత్రేయ శర్మ గారి సమస్య)

15 కామెంట్‌లు:

  1. కందం
    జ్ఞాన విహీనుఁడు పిరికిగ
    మానెదనని పోరు 'గీత' మార్చఁగ గెలిచెన్
    దీనతఁ గలిగించెడు న
    జ్ఞానము లేనట్టివాఁడె గౌరవమందున్

    ఉత్పలమాల
    మేనున నీరసమ్మొదిగి మీరగ శంకలు యుద్ధమన్నదే
    మానెదనంచు విల్లు విడ మార్చిన గీత జయంబు గూర్చెనే
    దీనత పెంచి వేగ తలదించగఁ జేసెడు మేచకంపుట
    జ్ఞానవిహీనుఁడే ఘనుఁడు గౌరవనీయుఁడు సంఘమందునన్!

    రిప్లయితొలగించండి
  2. మానవుని జీవితంబున
    వాని యొడలున గల యాత్మ పాడగుననుచున్ ,
    మేను తిరమని తలచు య
    జ్ఞానము లేనట్టివాఁడె గౌరవమందున్”

    రిప్లయితొలగించండి
  3. జ్ఞానము సముపార్జించిన
    మానవులకు లోకమందు మన్నన గలుగున్
    మానితముగ మసలుచు న
    “జ్ఞానము లేనట్టివాఁడె గౌరవమందున్”

    రిప్లయితొలగించండి
  4. మానవకోటికెల్లరకు మాన్యతఁ బెంచును జ్ఞానమొక్కటే
    దానమొసంగినన్ తరుగు దానికి నేర్పడ దెన్నడేనియున్
    జ్ఞానమె గౌరవప్రదము జ్ఞానమె పెన్నిధి యెంచిచూడ న
    జ్ఞానవిహీనుఁడే ఘనుఁడు గౌరవనీయుఁడు సంఘమందునన్

    రిప్లయితొలగించండి

  5. దాన మొసగు వారలు దే
    వానాం ప్రియులంచు భువిని వారలు కడుకున్
    కీనాశు లగుదురనె య
    జ్ఞానము లేనట్టివాఁడె గౌరవమందున్.


    ధ్యానమదే విమోచన పథమ్మును చూపు నటంచు నెల్లెడన్
    భానువు సన్నిధానమదె భాగ్య మటంచును విశ్వ సించుచున్
    స్యోనము లన్న రోసెడి మహోన్నత వ్యక్తియె లోక్యమంచనే
    జ్ఞానవిహీనుఁడే ఘనుఁడు గౌరవనీయుఁడు సంఘమందునన్.

    రిప్లయితొలగించండి
  6. జ్ఞాన సముపార్జనమె య
    జ్ఞానమును దొలంగజేయు సాధనమౌ వి
    జ్ఞానము కల్గిన యెడ న
    జ్ఞానము లేనట్టివాఁడె గౌరవమందున్

    జ్ఞానమనంగ నొప్పు మతి శాస్త్రము సంగతి విత్తి దేవతా
    ధ్యానము నిశ్చయమ్మెఱుక తప్పదు పొందక మానవాళి వి
    జ్ఞానము లేనివాడు మరి సాగడు ముందుకు లోకమందు న
    జ్ఞానవిహీనుఁడే ఘనుఁడు గౌరవనీయుఁడు సంఘమందునన్

    రిప్లయితొలగించండి
  7. ఉ॥ తానొక దిట్టనంచుఁ గడు దక్షుడ నంచటు విఱ్ఱవీగుచున్
    మానఁగ నాలసత్వమున మక్కువ విజ్ఞతఁ గాంచ మూర్ఖుఁడౌ
    తాను పరిశ్రమమ్ముఁ గను తప్పులు దిద్దుకు సాగు నట్టి య
    జ్ఞానవిహీనుఁడే ఘనుఁడు గౌరవనీయుఁడు సంఘమందునన్

    (Success is 99% perspiration and 1% inspiration; an English proverb అండి)

    రిప్లయితొలగించండి
  8. దానము ధర్మము సేయుచు
    దీనుల యెడ కరుణ జూపు దివ్యాత్ముడు నై
    మానితు డై వెలి గెడు న
    జ్ఞానము లేనట్టి వాడె గౌ రవ మందున్

    రిప్లయితొలగించండి
  9. కం:జ్ఞానము నరకొర బొందియె
    తానే జ్ఞాని నను నజ్ఞ తాత్త్వికు కంటెన్
    జ్ఞాని నను నహము నెరుగని,
    జ్ఞానము లేనట్టివాఁడె గౌరవమందున్”
    (సగం జ్ఞానము పొంది తానే తత్త్వవేత్తని అనుకొనే వాడి కంటే తాను అజ్ఞాని నని అంగీకరించే అజ్ఞానే నయం.)

    రిప్లయితొలగించండి
  10. ఉ:జ్ఞానము నీయ దేవళపు స్థాపన జేసిరి రాజు లిప్పుడా
    స్థానము భ్రష్టు బట్టినది సాత్త్విక బుద్ధి యదేల ? గట్టిదౌ
    స్థానము రాజకీయమున దక్కిన జాలును, పారమార్థిక
    జ్ఞానవిహీనుఁడే ఘనుఁడు గౌరవనీయుఁడు సంఘమందునన్”
    (ప్రజాస్వామ్యం లో దేవాలయాల పై అధికారం జ్ఞానులకు పండితులకు లేక రాజకీయ ప్రాబల్యం ఉన్న వారి చేతుల్లో ఉంటున్నది.)

    రిప్లయితొలగించండి