10, అక్టోబర్ 2021, ఆదివారం

దత్తపది - 179

11-10-2021 (సోమవారం)
"తండా - గ్రామము - ఊరు - నగరము"
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
భారతార్థంలో స్వేచ్ఛాఛందంలో
పద్యం వ్రాయండి.

31 కామెంట్‌లు:

 1. ఆతండాయెగబెబ్బులి
  చేతలసంగ్రామమందుచేవనుఁజూపెన్
  నేతలయూరులుగెలుచుచు
  త్రాతనఁగరమునువడివడిధర్మజుడుండెన్

  రిప్లయితొలగించు
 2. తేటగీతి
  గుబ్బెతండాలుకొననెంచఁ గూడరావె?
  సరస సంగ్రామమున్ జేయు వరుసలేదె?
  విజయ! మరులూరు నూర్వశి వేడుకొనగ
  రమ్ము రమ్మనంగ మగతనమ్ములేదె?

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. తేటగీతి
   అర్జునుండితండా యన నచ్చెరువగు
   సరస సంగ్రామమున్ జేయు వరుసలేదె?
   విజయ! మరులూరు నూర్వశి వేడుకొనగ
   రమ్ము రమ్మనంగ మగతనమ్ములేదె?

   తొలగించు
  2. గురుదేవులకు ప్రణామములు మరియు ధన్యవాదములు.

   తొలగించు
 3. పద్మవ్యూహంలో అశ్వత్థామ దుర్యోధనునితో.....

  అరయ నర్జునునకు ని'తం డా'త్మజుండు
  కడగి చేయంగ వచ్చె సం'గ్రామము' నిదె
  చేరియున్ రెచ్చగొట్టిన 'నూరు'కొనఁడు
  జనులు 'నగర ము'ప్పని నీవు వెనుదిరిగిన.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మంచిదత్తపదినిపరిచయముచేశారుఅభినందనలుగురువుగారు

   తొలగించు
 4. ఆతండాయెను భీముడు
  ప్రీతిన్ సంగ్రామ మందు పెల్లుగ పోరెన్
  రాతలు మార్చి న గరమున
  చేతలతో నూరువులను శీఘ్రమె ద్రుంచెన్

  రిప్లయితొలగించు

 5. (ఉత్తర తో బృహన్నల గురించి ఉత్తరుని మాటలు)

  ఆతండా సంగ్రామము
  భీతిన్ విడి నిలుచునె కడు వీరుండను నా
  కాతడు తూగునె? యూరుకొ
  భ్రాత నుడులవినగరమ్ము వ్యర్థుడతండే.

  రిప్లయితొలగించు
 6. దత్తపది :

  తండా - గ్రామము - ఊరు - నగరము - పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ - భారతపరంగా - స్వేచ్ఛా ఛందస్సు

  ( జలస్తంభనవిద్యతో నీటిమడుగులో దాగిన దుర్యోధనుని భీముడు తొడలు విరుగగొట్టి మట్టుబెట్టవలెనని ధర్నజునికి చెబుతున్న కృష్ణుడు )

  తేటగీతి
  ............

  ధర్మరాజ ! యాతం డాహ్రదమున దాగె ;
  నింక సంగ్రామము ముగియునితనిజంప
  నూరువుల భీముగద గొట్టుటొప్పునయ్య !
  తప్పన నగర మున్ముందుతరమువారు?

  రిప్లయితొలగించు
 7. (భీష్ముని సేనాధిపతిగ , కర్ణుని అర్ధరథిగ నియమించి నపుడు)

  తే॥గీ॥

  ఉత్తమ పదవి కాదని “యూరు” కొనక
  ముందరగ న”తండా”వేశ పూరి తుడయి
  ఎద”న గరము”పుట్టగ నార్కి యిడ నిడె నని
  వీడ , సం”గ్రామము” సలుప భీష్ము డుండ

  గరము = విషము ; ఆర్కి = కర్ణుడు
  ఇడ = మాట ; అని = యుద్ధము

  రిప్లయితొలగించు
 8. కుంతి పుత్రుడా’తండా’ వృకోధరుండు
  ‘ఊరు’పోక సం’గ్రామము’ గోరు వాడు
  నీఛ కీచకున్ జంపిన నిశ్చలుండు
  క’నగ రము’డుగా తోచెడు కాల యముడు

  ఊరుపోక = ఉబుసుపోక; కాలక్షేపము
  రముడు = మన్మథుడు

  రిప్లయితొలగించు
 9. ఎవడాతండా రుండిక
  నవిరళ సంగ్రామమందు నతిదైన్యముగా
  నవమాన గరము గ్రక్కుచు
  నవనిని యూరువులుభంగమవగాన్పించున్

  (రుండిక=యుద్ధభూమి; గరము= విషము)

  రిప్లయితొలగించు


 10. కృష్ణుడు సుయోధనునితో
  ఆ *తండా* గ్రహము కదుర
  చేతము *నఁ, గరము* నఁ దాల్చి చెన్నైన గదన్
  ఘాతమున ద్రుంపు *నూరు* వు
  భీతిని సంగ్రామముఁ గొన వెల్లువ లచటన్

  రిప్లయితొలగించు
 11. ఖలుఁడ(తండా) శకుని రేపె గలహమటుల
  తుదకు సం(గ్రామము)న జేర్చె ద్యూతకరుఁడు
  భాగినేయుఁడయో (ఊరు) భంగమొంద
  జిమ్మె మనము(న గరము)ను జెరచె కులము

  రిప్లయితొలగించు
 12. ఊరువుల విఱిచి నిన్ను న
  పార ఘన గరమును మ్రింగి బ్రతికిన వాఁడన్
  వీరగ్రామము గనఁగా
  వారువ తండాంతరమున వధియింతు ననిన్

  రిప్లయితొలగించు
 13. అర్జునుని యుద్ధ పరాక్రమం.

  ఆటవెలది
  సంకు చితకురుబలతండాలు సంగ్రామ
  మున గరమును పూన్చు ముల్కులుతగు
  లంగ వారి ఊరు సంధులూడగ జేసి
  జంపి విజయు డుద్య మించె నంత.
  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటర్.

  రిప్లయితొలగించు
 14. గీతోపదేశం

  ఊరుకోవయ్య పార్థుడ! ఉవిద వోలె
  కనుల నీరునుగార్చ సంగ్రామమందు
  నగర మున్ముందు తరములు నరుని దలచి!
  వదలు మితండాత్మీయుడన్ భావమింక

  రిప్లయితొలగించు
 15. కురు పాండవ సంగ్రామము
  జరిగిన నీ యూరువులను
  సమరము నందే
  విరచెదనన గరము కసిచే,
  నరయ నతండా సభ కడచ్చెరు
  వొందన్

  రిప్లయితొలగించు
 16. ఉత్తర గోగ్రహణ ఘట్టము ఆధారంగా ఈ నా ప్రయత్నము:

  శా:

  ఆతండా వుల ద్రిప్ప డంబు నుడువన్నా కాశమే హద్దుగా
  నేతెంచన్ పరిమార్చ కౌరవుల దా నేకాంగి సంగ్రామమున్
  భీతెంచంగను నూరుకొమ్మనెను నా బీభత్సు మారంగనై
  నీతెంచెన్నగ రమ్ము రమ్మనెను తూణీరమ్మునే దేవగన్

  ఏకాంగి =ఒక్కడు
  నీతెంచన్నగ =నీతెంచన్ + నగ
  (అర్జునుడు నవ్వినట్లు)

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించు
 17. ఈ నాటి శంకరాభఱణము వారి సమస్య
  (తండా, గ్రామము, ఊరు, నగరము) ఈ పదములు అన్యార్ధములో వాడుచు భారతార్ధములో పూరణము
  కీచకుని సంభాషణ సైరంధ్రితో

  అంబుజానన, చూపు మభిమ(తం, డా)కొను చుంటివేల ఘనమౌ, సోయగములు

  దోచెగా మనము, మదోద(గ్రా, మము)కరుణించుము, మదవతీ, పంచ వలయు

  సౌఖ్యమీ నృపునకు, సౌరత గగనని (మ్నగ, రము)ని శరముల్ నన్ను తాక

  కోరుచు నుండెగా (నూరు)ఘట్టనము వలపులాడి, కావు సైరంధ్రి వీవు


  దివములో తిరుగాడు రంభవని తలచు

  చుండె నీ కీచకుండు, నా గుండె మంట

  రయముగా చల్ల బరచు సురదన యనుచు

  బల్కె ద్రౌపదిని గని భూపాలుడపుడు


  అభిమతం = కోరిక, డాకొను =దూరముగా ఉండుట, మదోదగ్రా = నారీ , సౌరత సంభోగ
  గగననిమ్నగ = గంగ, రముని =మన్మధుని ఊరుఘట్టనము= రతి క్రీడలో ఒక భాగము సురదన =స్త్రీ

  రిప్లయితొలగించు