22-10-2021 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“నన్నున్ నగ్నముగఁ గనుట న్యాయమె నీకున్”(లేదా...)“నన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగాఁ గన నీకు న్యాయమా”
సమస్య :నన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగా గన నీకు న్యాయమా ( దిగంబరంగా కనబడమని తనను కోరిన వేమారెడ్డితో వారకాంత విశ్వద పలుకులు )ఎన్నగ రెడ్డి వంశమున నెంతయొ పున్నెము జేసికొన్న యా మిన్నగు రాజదంపతుల మేలిమి బిడ్డవు వేమనాఖ్యుడా !చెన్నగు కార్యమే యిటుల చేయుట ? వేశ్యనె కాని యయ్యయో !నన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగా గన నీకు న్యాయమా ?
కన్నులచెదరనికాంతులమిన్నునచంద్రుడువెలుగులమీరుచురాగాకన్నెయుకలుునడిగెనునన్నున్నగ్నమునఁగనుటన్యాయమెనీకున్
పన్నగ దుష్టచింతనల పాచిగ లాటను లాడగా సభన్మిన్నగు క్రోధ మందగను మేదిని జెల్లని క్రూర బుద్ధితోచెన్నగు కార్యమా?నిటుల చిన్నది చింతిల,నీడ్చిలాగగన్నన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగా గన నీకు న్యాయమా?!!
ఎన్నడు లేని కోరికిది యెందుకుకోరుచు నుంటివో కదా!నన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగా గన నీకు న్యాయమా !విన్నప మాలకించుమయ వేశ్యనునే నయి నంత నేమి సంపన్నము సేయ లేను ప్రియ! పంతమువీడుము కామకూటుడా!
అనసూయమాతత్రిమూర్తులతోఅన్నిటమీరలేగదరయాగినిసేయగబాలురైతిరాకన్నుకుగానరెప్పుడునుఖండితరూపములేదుమీకుగావన్నెలచిన్నెలన్నటనవంశమువ్రుద్ధినిఁబోందయాడుడీనన్నిటులన్నయమ్మువిడినగ్నముగాగననీకున్యాయమా
చేబంతి తప్పి పడెనని...... యూహతోవెన్నయు మీగడల్ పెరుగు వేడుక తోడుత దోచివేస్తివేయెన్నగ లేము నీ మహిమ నెవ్వరు నైన జగంబునందునన్తిన్నగ బంతి వచ్చెనని తెంపరివై యదు నందనందనా!నన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగాఁ గన నీకు న్యాయమా?
విన్నపము జేసె వేమన చెన్నుగ గనుపించు మంచు జేడి య నొకె తన్ మిన్నగ బదు లొసగె ను దను"నన్నున్ నగ్నముగ గనుట న్యాయమె నీకున్? "
భర్త మిత్రుడు గీచిన తన చిత్రము గురించి సతి పతితో...కందంతిన్నగ చిత్రమ్మున నాకున్నను లేనట్లు వల్వలొప్పఁగ గీయన్మన్నింతురె? నల్వురిలోనన్నున్ నగ్నముగఁ గనుట న్యాయమె నీకున్?ఉత్పలమాలతిన్నగ చిత్రకారుఁడని తెచ్చిన మీసఖుఁడున్ లిఖించ నాకున్నను లేవులేవనుచు నొప్పెడు వల్వల నాదు చిత్రమున్మన్నన జేతువే మగడ! మానుము నల్గురి మధ్య, పత్నినౌనన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగాఁ గన నీకు న్యాయమా?
"సాలార్ జంగ్ మ్యూజియము" లోని పాలరాతి శిల్పము పలుకరించితే......ఇలా ఉత్పలమాల:ఎన్నగ శక్యమే "నరబు" యింతి, ఘనీభవ క్షీర మూర్తి బల్వన్నెలు వేనవేలు తలపై జలతారు దుపట్ట జార గాకన్నియ మ్యూజియమ్మున ఫకాలున నవ్వుచు పల్కెనిట్టులే “నన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగాఁ గన నీకు న్యాయమా”---కటకం వేంకటరామ శర్మ.
ఒక కొండ మానవునితో మిన్నగ వర్షధారలను మీదట నీయగ నౌషధంబులన్పన్నుగ పచ్చగానిలచి ప్రాణమునిల్పెడు వృక్షసంతతిన్తిన్నగనుండనీక పలుతీరుల ద్రుంచుచు నార్జనంబుకైనన్నిటులన్ నయమ్మువిడి నగ్నముగాగన నీకు న్యాయమా?
👌👌👌
"కన్నులు కట్టిన వైనన్ నన్నున్ నగ్నముగఁ గనుట న్యాయమె నీకున్ చెన్నుగ తాకుచు" , యనియెన్ మిన్నగ గాంధారి తడిమి, బెంచిన కొడుకే!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. మూడవ పాదంలో టైపాటు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "పాచికలాటను కౌరవుల్ సభన్... కార్యమా యిటుల.." అనండి.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "వంశపు వృద్ధిని బొంద నాడుడీ" అనండి.
ఉ: నిన్నటి రాత్రినుండి యెల నిద్దుర లేక విరామమెంచకన్దన్నగు స్వాపతేయమును దండిగ నోడగ చీట్లపేకనున్పన్నుగ తీర్తువా కడమ వస్త్రము విప్పు మటన్న వేడనౌనన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగా గన నీకు న్యాయమేవై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'తాను'ను 'తను' అనరాదు. "బదు లొసగెను గద" అనండి.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
నిన్నారాధన జేసితిమన్నించితి వీవు బావ;మమతల పెండ్లైయున్నాము సిగ్గికేలానన్నున్ నగ్నముగ గనుట న్యాయమె నీకున్.
అన్నులమిన్నలనెల్లెడమన్నన సేయంగనొప్పు మాఘుడ వగుచున్ బన్నపరచ గులకాంతను నన్నున్ నగ్నముగఁ గనుట న్యాయమె నీకున్.
(అనసూయను వివస్త్రవై భిక్షమొసంగమని అడిగిన త్రిమూర్తులలో ఒకరితోనాడిన మాటలుగ)మన్ననలందుకో గలుగు మాన్యులటుంచును నమ్మితిన్ భువిన్ వెన్నెలకోలు నందుకొను పెద్దలు మీరు వివస్త్రనౌచు నన్నన్నము పెట్టమంచునిటు లానతి నిచ్చుట పాడియౌనటే నన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగాఁ గన నీకు న్యాయమా
వన్నెల చిన్నెల కన్నియకన్నుల ఎదుటన్ నిలువగ కలలవిహారందన్నుగ నూహల మదిలోనన్నున్ నగ్నముగఁ గనుట న్యాయమె నీకున్
సన్నని వలువల నొలువగనున్నని దేహము నరయ కనుల నీరొలుకన్మిన్నగ నుల్లి పలికెనొకొనన్నున్ నగ్నముగఁ గనుట న్యాయమె నీకున్
పన్నితివిగదా నీవొకపన్నిదమును నాపయి గల వలపు దలచుచున్కన్నార కలలను గనుచునన్నున్ నగ్నముగఁ గనుట న్యాయమె నీకున్
చిన్నయ బొమ్మ గుమ్మలకు, చేలము మార్చును బట్టలంగడిన్చెన్నుగ ధూళి దుమ్ములును చేరగ శుద్ధిని చేయ బోవ యాకన్నియ బొమ్మ క్రొత్త రొబొ కావున యిట్లనె ఛీ! పదా! పదా!నన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగాఁ గన నీకు న్యాయమా!
సీతాదేవి గారికి మరియు గురుదేవులకు ధన్యవాదములు
ఎన్నడు వంటిపై నగలనెన్నియొ దాలిచి యుండుదాన నావన్నియు నూడ్చిజూదమున నర్పణజేయుచు నేడు నిర్దయన్నన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగాఁ గన నీకు న్యాయమావిన్నఁదనంపు పోకడలు వీడుము నీవికనైన పెన్మిటీ!
కృష్ణుడు గోపిక వస్త్రాలు అపహరించిన సందర్భం.కందంకన్నడు కృష్ణుడు చాటుగకన్నియ వలువలు హరించి గడుసుగ బయలున్మిన్నగ రమ్మన, తా యనెనన్నున్ నగ్నముగ గనుట న్యాయమె నీకున్ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్.
ఎన్నినగలు నాగళమునమిన్నగనుండెడివినాఁడు మిలమిల మెరియన్నన్నియు నొనర్చి స్వాహానన్నున్ నగ్నముగఁ గనుట న్యాయమె నీకున్
అడవిలో నలుని విలాపముఎన్నడు ధర్మమార్గమును నేమరువాడనుగాను నైననున్తిన్నగ జిక్కుకుంటిగద తీక్షణ కాలప్రభావమున్ దురాపన్నుడ నాదువల్వలను పట్టుకుపోవుచు పక్షిసత్తమానన్నిటులన్ నయమ్మువిడి నగ్నముగాగన నీకు న్యాయమా?
అన్నా! యేపని నీయదినన్నున్ నగ్నముగ గనుట న్యాయమె నీకున్ విన్నపము నాలకించుమయెన్నడు నికజేయకిటుల యెవ్వరి యొద్దన్
నన్నయ నిచ్చె మేనుకు ఘనమ్ముగ కాంచన వర్ణ చైలమున్,వన్నియ పారజల్లు నలి వల్వము తిక్కన చుట్టబెట్ట, సూరన్న యలంకరించెను సురా ర్హపు శాటము స్తీర్విపైన, గోపన్న నొసంగె నూలు వలిపమ్మును మూరితి కప్ప మంచు, లింగన్నవి చిత్రమౌ పొడలు స్కంధము పై హవణింపుచేయ, వేమన్న తొడింగె స్వర్ణమయ మానిక కంచుకమున్ ముదంబుగా,కన్నియ నంచు నందముగ కట్టిరి చీరలు మోహమొప్ప, నాచెన్ను విఘాత మాయెనని క్షేపము తోనిడ కుండె చీరలన్మొన్నటి నాయకుల్, మెయిని మూయక జారెను, నేలపైన యీకన్నము లున్నవస్త్రములు కప్పగ జాలము కాయమంచు నాదన్నుగ నుండలేక పరి తాపము నొందుచు నుండ ప్రేమతో చిన్నది కన్ను గీటెనని చెంతన చేర దలంచి మోహనా (నన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగా గననీకు న్యాయమా) ద్రాపుడ వీవుగా యనుచు తల్లి దిగాలుప డెన్ చలించుచున్
అన్నారీ రత్న మెలమిఁ జిన్ని కొమరునిగ మహిమను జేసిన వానిన్వెన్నునిఁ గని ముద్దుగ ననె నన్నున్ నగ్నముగఁ గనుట న్యాయమె నీకున్మృగరాజుతో నొక సింహి పలుకులు: సన్న వరావలగ్న సువిశాల భుజాంతర సింహరాజమా సన్నుత విక్ర మోద్ధత లసన్నయనద్వయ భీక రాకృతీ త్వన్నిల యాగ తైక మృగ తండ నితాంత సమక్ష మందహో నన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగాఁ గన నీకు న్యాయమా
పన్నగ దుష్టచింతనల పాచిగ లాడగా కౌరవుల్ సభన్మిన్నగు క్రోధ మందగను మేదిని జెల్లని క్రూర బుద్ధితోచెన్నగు కార్యమా?యిటుల చిన్నది చింతిల,నీడ్చిలాగగన్నన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగా గన నీకు న్యాయమా?!!
అన్నియు దెల్సియున్ రమణ! హర్షము నొందని రీతినిట్లుగానన్నిటులన్ నయమ్మువిడి నగ్నముగాగన నీకున్యాయమేవిన్నది గన్నదిన్ నెఱుగ వెఱౢివ ?పిచ్చియ యిట్లుజేయగాగ్రన్నన మార్చుకో మనసు కాంతలబట్లన జక్కగుండుమా
ధన్యవాదములు
కన్నులు గప్పిటులౌరాకన్నెల వలువలను దాచగా తగదయ్యాకన్నా చీరనొసంగుమునన్నున్ నగ్నముగఁ గనుట న్యాయమె నీకున్
పున్నమి రాతిరిన్ మధుర మోహన గానము రేప మోహమున్కన్నయ జేర వేగ జలకంబొనరింపగ జేరినంతలోవెన్నెలఱేడ హెచ్చిలగ వేడి గవాక్షమునుండి చాటుగానన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగాఁ గన నీకు న్యాయమా
ఉన్నతమైన చోటని మహోన్నత భావము తోడ చేరగాకన్నియ నైన నన్ను మయికమ్మును క్రమ్మగజేసి, యివ్విధిన్పన్నిన వ్యూహమందు పడవైచి మనస్సు భ్రమింప జేయుచున్నన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగాఁ గన నీకు న్యాయమా?
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'విహారం' అనడం వ్యావహారికం.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "తా ననె.." అనండి
మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "...కిటుల నెవ్వరి.." అనండి.
మీ ఉత్పలమాలికా పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'పాచిక లాడగ' టైపాటు.
ధన్యాస్మి ఆచార్యా! నమోనమః!🙏🙏🙏
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
67 కామెంట్‌లు:
సమస్య :
నన్నిటులన్ నయమ్ము విడి
నగ్నముగా గన నీకు న్యాయమా
( దిగంబరంగా కనబడమని తనను కోరిన వేమారెడ్డితో వారకాంత విశ్వద పలుకులు )
ఎన్నగ రెడ్డి వంశమున
నెంతయొ పున్నెము జేసికొన్న యా
మిన్నగు రాజదంపతుల
మేలిమి బిడ్డవు వేమనాఖ్యుడా !
చెన్నగు కార్యమే యిటుల
చేయుట ? వేశ్యనె కాని యయ్యయో !
నన్నిటులన్ నయమ్ము విడి
నగ్నముగా గన నీకు న్యాయమా ?
కన్నులచెదరనికాంతుల
మిన్నునచంద్రుడువెలుగులమీరుచురాగా
కన్నెయుకలుునడిగెను
నన్నున్నగ్నమునఁగనుటన్యాయమెనీకున్
పన్నగ దుష్టచింతనల పాచిగ లాటను లాడగా సభన్
మిన్నగు క్రోధ మందగను మేదిని జెల్లని క్రూర బుద్ధితో
చెన్నగు కార్యమా?నిటుల చిన్నది చింతిల,నీడ్చిలాగగన్
నన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగా గన నీకు న్యాయమా?!!
ఎన్నడు లేని కోరికిది యెందుకు
కోరుచు నుంటివో కదా!
నన్నిటులన్ నయమ్ము విడి నగ్నము
గా గన నీకు న్యాయమా !
విన్నప మాలకించుమయ వేశ్యను
నే నయి నంత నేమి సం
పన్నము సేయ లేను ప్రియ! పంతము
వీడుము కామకూటుడా!
అనసూయమాతత్రిమూర్తులతో
అన్నిటమీరలేగదరయాగినిసేయగబాలురైతిరా
కన్నుకుగానరెప్పుడునుఖండితరూపములేదుమీకుగా
వన్నెలచిన్నెలన్నటనవంశమువ్రుద్ధినిఁబోందయాడుడీ
నన్నిటులన్నయమ్మువిడినగ్నముగాగననీకున్యాయమా
చేబంతి తప్పి పడెనని...... యూహతో
వెన్నయు మీగడల్ పెరుగు వేడుక తోడుత దోచివేస్తివే
యెన్నగ లేము నీ మహిమ నెవ్వరు నైన జగంబునందునన్
తిన్నగ బంతి వచ్చెనని తెంపరివై యదు నందనందనా!
నన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగాఁ గన నీకు న్యాయమా?
విన్నపము జేసె వేమన
చెన్నుగ గనుపించు మంచు జేడి య నొకె తన్
మిన్నగ బదు లొసగె ను దను
"నన్నున్ నగ్నముగ గనుట న్యాయమె నీకున్? "
భర్త మిత్రుడు గీచిన తన చిత్రము గురించి సతి పతితో...
కందం
తిన్నగ చిత్రమ్మున నా
కున్నను లేనట్లు వల్వలొప్పఁగ గీయన్
మన్నింతురె? నల్వురిలో
నన్నున్ నగ్నముగఁ గనుట న్యాయమె నీకున్?
ఉత్పలమాల
తిన్నగ చిత్రకారుఁడని తెచ్చిన మీసఖుఁడున్ లిఖించ నా
కున్నను లేవులేవనుచు నొప్పెడు వల్వల నాదు చిత్రమున్
మన్నన జేతువే మగడ! మానుము నల్గురి మధ్య, పత్నినౌ
నన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగాఁ గన నీకు న్యాయమా?
"సాలార్ జంగ్ మ్యూజియము" లోని పాలరాతి శిల్పము పలుకరించితే......ఇలా
ఉత్పలమాల:
ఎన్నగ శక్యమే "నరబు" యింతి, ఘనీభవ క్షీర మూర్తి బ
ల్వన్నెలు వేనవేలు తలపై జలతారు దుపట్ట జార గా
కన్నియ మ్యూజియమ్మున ఫకాలున నవ్వుచు పల్కెనిట్టులే
“నన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగాఁ గన నీకు న్యాయమా”
---కటకం వేంకటరామ శర్మ.
ఒక కొండ మానవునితో
మిన్నగ వర్షధారలను మీదట నీయగ నౌషధంబులన్
పన్నుగ పచ్చగానిలచి ప్రాణమునిల్పెడు వృక్షసంతతిన్
తిన్నగనుండనీక పలుతీరుల ద్రుంచుచు నార్జనంబుకై
నన్నిటులన్ నయమ్మువిడి నగ్నముగాగన నీకు న్యాయమా?
👌👌👌
"కన్నులు కట్టిన వైనన్
నన్నున్ నగ్నముగఁ గనుట న్యాయమె నీకున్
చెన్నుగ తాకుచు" , యనియెన్
మిన్నగ గాంధారి తడిమి, బెంచిన కొడుకే!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో టైపాటు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"పాచికలాటను కౌరవుల్ సభన్... కార్యమా యిటుల.." అనండి.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"వంశపు వృద్ధిని బొంద నాడుడీ" అనండి.
ఉ:
నిన్నటి రాత్రినుండి యెల నిద్దుర లేక విరామమెంచకన్
దన్నగు స్వాపతేయమును దండిగ నోడగ చీట్లపేకనున్
పన్నుగ తీర్తువా కడమ వస్త్రము విప్పు మటన్న వేడనౌ
నన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగా గన నీకు న్యాయమే
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తాను'ను 'తను' అనరాదు. "బదు లొసగెను గద" అనండి.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నిన్నారాధన జేసితి
మన్నించితి వీవు బావ;మమతల పెండ్లై
యున్నాము సిగ్గికేలా
నన్నున్ నగ్నముగ గనుట న్యాయమె నీకున్.
అన్నులమిన్నలనెల్లెడ
మన్నన సేయంగనొప్పు మాఘుడ వగుచున్
బన్నపరచ గులకాంతను
నన్నున్ నగ్నముగఁ గనుట న్యాయమె నీకున్.
(అనసూయను వివస్త్రవై భిక్షమొసంగమని అడిగిన త్రిమూర్తులలో ఒకరితోనాడిన మాటలుగ)
మన్ననలందుకో గలుగు మాన్యులటుంచును నమ్మితిన్ భువిన్
వెన్నెలకోలు నందుకొను పెద్దలు మీరు వివస్త్రనౌచు న
న్నన్నము పెట్టమంచునిటు లానతి నిచ్చుట పాడియౌనటే
నన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగాఁ గన నీకు న్యాయమా
వన్నెల చిన్నెల కన్నియ
కన్నుల ఎదుటన్ నిలువగ కలలవిహారం
దన్నుగ నూహల మదిలో
నన్నున్ నగ్నముగఁ గనుట న్యాయమె నీకున్
సన్నని వలువల నొలువగ
నున్నని దేహము నరయ కనుల నీరొలుకన్
మిన్నగ నుల్లి పలికెనొకొ
నన్నున్ నగ్నముగఁ గనుట న్యాయమె నీకున్
పన్నితివిగదా నీవొక
పన్నిదమును నాపయి గల వలపు
దలచుచున్
కన్నార కలలను గనుచు
నన్నున్ నగ్నముగఁ గనుట న్యాయమె నీకున్
చిన్నయ బొమ్మ గుమ్మలకు, చేలము మార్చును బట్టలంగడిన్
చెన్నుగ ధూళి దుమ్ములును చేరగ శుద్ధిని చేయ బోవ యా
కన్నియ బొమ్మ క్రొత్త రొబొ కావున యిట్లనె ఛీ! పదా! పదా!
నన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగాఁ గన నీకు న్యాయమా!
సీతాదేవి గారికి మరియు గురుదేవులకు ధన్యవాదములు
ఎన్నడు వంటిపై నగలనెన్నియొ దాలిచి యుండుదాన నా
వన్నియు నూడ్చిజూదమున నర్పణజేయుచు నేడు నిర్దయన్
నన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగాఁ గన నీకు న్యాయమా
విన్నఁదనంపు పోకడలు వీడుము నీవికనైన పెన్మిటీ!
కృష్ణుడు గోపిక వస్త్రాలు అపహరించిన సందర్భం.
కందం
కన్నడు కృష్ణుడు చాటుగ
కన్నియ వలువలు హరించి గడుసుగ బయలున్
మిన్నగ రమ్మన, తా యనె
నన్నున్ నగ్నముగ గనుట న్యాయమె నీకున్
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
ఎన్నినగలు నాగళమున
మిన్నగనుండెడివినాఁడు మిలమిల మెరియ
న్నన్నియు నొనర్చి స్వాహా
నన్నున్ నగ్నముగఁ గనుట న్యాయమె నీకున్
అడవిలో నలుని విలాపము
ఎన్నడు ధర్మమార్గమును నేమరువాడనుగాను నైననున్
తిన్నగ జిక్కుకుంటిగద తీక్షణ కాలప్రభావమున్
దురా
పన్నుడ నాదువల్వలను పట్టుకుపోవుచు పక్షిసత్తమా
నన్నిటులన్ నయమ్మువిడి నగ్నముగాగన నీకు న్యాయమా?
అన్నా! యేపని నీయది
నన్నున్ నగ్నముగ గనుట న్యాయమె నీకున్
విన్నపము నాలకించుమ
యెన్నడు నికజేయకిటుల యెవ్వరి యొద్దన్
నన్నయ నిచ్చె మేనుకు ఘనమ్ముగ కాంచన వర్ణ చైలమున్,
వన్నియ పారజల్లు నలి వల్వము తిక్కన చుట్టబెట్ట, సూ
రన్న యలంకరించెను సురా ర్హపు శాటము స్తీర్విపైన, గో
పన్న నొసంగె నూలు వలిపమ్మును మూరితి కప్ప మంచు, లిం
గన్నవి చిత్రమౌ పొడలు స్కంధము పై హవణింపుచేయ, వే
మన్న తొడింగె స్వర్ణమయ మానిక కంచుకమున్ ముదంబుగా,
కన్నియ నంచు నందముగ కట్టిరి చీరలు మోహమొప్ప, నా
చెన్ను విఘాత మాయెనని క్షేపము తోనిడ కుండె చీరలన్
మొన్నటి నాయకుల్, మెయిని మూయక జారెను, నేలపైన యీ
కన్నము లున్నవస్త్రములు కప్పగ జాలము కాయమంచు నా
దన్నుగ నుండలేక పరి తాపము నొందుచు నుండ ప్రేమతో
చిన్నది కన్ను గీటెనని చెంతన చేర దలంచి మోహనా
(నన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగా గననీకు న్యాయమా)
ద్రాపుడ వీవుగా యనుచు తల్లి దిగాలుప డెన్ చలించుచున్
అన్నారీ రత్న మెలమిఁ
జిన్ని కొమరునిగ మహిమను జేసిన వానిన్
వెన్నునిఁ గని ముద్దుగ ననె
నన్నున్ నగ్నముగఁ గనుట న్యాయమె నీకున్
మృగరాజుతో నొక సింహి పలుకులు:
సన్న వరావలగ్న సువిశాల భుజాంతర సింహరాజమా
సన్నుత విక్ర మోద్ధత లసన్నయనద్వయ భీక రాకృతీ
త్వన్నిల యాగ తైక మృగ తండ నితాంత సమక్ష మందహో
నన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగాఁ గన నీకు న్యాయమా
పన్నగ దుష్టచింతనల పాచిగ లాడగా కౌరవుల్ సభన్
మిన్నగు క్రోధ మందగను మేదిని జెల్లని క్రూర బుద్ధితో
చెన్నగు కార్యమా?యిటుల చిన్నది చింతిల,నీడ్చిలాగగన్
నన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగా గన నీకు న్యాయమా?!!
అన్నియు దెల్సియున్ రమణ! హర్షము నొందని రీతినిట్లుగా
నన్నిటులన్ నయమ్మువిడి నగ్నముగాగన నీకున్యాయమే
విన్నది గన్నదిన్ నెఱుగ వెఱౢివ ?పిచ్చియ యిట్లుజేయగా
గ్రన్నన మార్చుకో మనసు కాంతలబట్లన జక్కగుండుమా
ధన్యవాదములు
కన్నులు గప్పిటులౌరా
కన్నెల వలువలను దాచగా తగదయ్యా
కన్నా చీరనొసంగుము
నన్నున్ నగ్నముగఁ గనుట న్యాయమె నీకున్
పున్నమి రాతిరిన్ మధుర మోహన గానము రేప మోహమున్
కన్నయ జేర వేగ జలకంబొనరింపగ జేరినంతలో
వెన్నెలఱేడ హెచ్చిలగ వేడి గవాక్షమునుండి చాటుగా
నన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగాఁ గన నీకు న్యాయమా
ఉన్నతమైన చోటని మహోన్నత భావము తోడ చేరగా
కన్నియ నైన నన్ను మయికమ్మును క్రమ్మగజేసి, యివ్విధిన్
పన్నిన వ్యూహమందు పడవైచి మనస్సు భ్రమింప జేయుచున్
నన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగాఁ గన నీకు న్యాయమా?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'విహారం' అనడం వ్యావహారికం.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"తా ననె.." అనండి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"...కిటుల నెవ్వరి.." అనండి.
మీ ఉత్పలమాలికా పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పాచిక లాడగ' టైపాటు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యాస్మి ఆచార్యా! నమోనమః!🙏🙏🙏
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి