20, అక్టోబర్ 2021, బుధవారం

సమస్య - 3877

21-10-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పెఱవానికి సాధ్వి ముద్దుపెట్టెం బ్రేమన్”
(లేదా...)
“పైఁట చెఱంగుఁ బట్టు పెఱవానికి ముద్దిడె సాధ్వి ప్రేమతోన్”

54 కామెంట్‌లు:

 1. బిరబిర తడబడి నడిచెడు
  చిరు బుడుత డొకడెగబడుచు చేరగ నొడిలో
  మురిపెమున బాల కుండగు
  పెఱవానికి సాధ్వి ముద్దుపెట్టెం బ్రేమన్

  రిప్లయితొలగించండి
 2. మురియుచుముదితగభీముం
  డరికీచకునికితనువునడాయుచునటనన్
  పరిపరివిధములఁబలుకుచు
  పెఱవానికిసాధ్విముద్గుపెట్టెన్ప్రేమన్

  రిప్లయితొలగించండి
 3. నిరవధికపు జల్లు గురియ
  వరువాతనె నింటి ముందు వనితను గనియున్
  మరులుగ బాలుని గొనియును
  పెఱ వానికి సాధ్వి ముద్దు బెట్టెo బ్రేమ న్

  రిప్లయితొలగించండి
 4. సాధ్వి అనసూయ గాథ:

  కందం
  మురిపెమున వివస్త్రగనట
  బరవారై యజులు ముద్దవడ్డించమనన్
  చిఱుపాపలుగన్ మార్చుచు
  పెఱవానికి సాధ్వి ముద్దుపెట్టెం బ్రేమన్

  ఉత్పలమాల
  ఆటగదా త్రిమూర్తులకు నయ్యనసూయఁ బరీక్షకెంచుటల్!
  పాటిగఁ దా వివస్త్రగను వడ్డన జేయుమటంచనన్, భళా!
  వేటుకు మార్చె కూనలుగ విజ్ఞతతో, వటపత్రశాయియై
  పైఁట చెఱంగుఁ బట్టు పెఱవానికి ముద్దిడె సాధ్వి ప్రేమతోన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కందం
   మురిపెముఁ దీర్చ వివస్త్రగ
   పరులౌ యజుల ననసూయ పాపలజేసెన్
   హరికి వటపత్రశాయికి
   పెఱవానికి సాధ్వి ముద్దుపెట్టెం బ్రేమన్!

   తొలగించండి
  2. మీ పూరణలన్నీ ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 5. ఆటలపాటలన్దనియయాదవుతోడిదిలోకమాయెగా
  దాటుచుమాయమర్మములతానుగగోల్లెతభామయచ్చటన్
  చాటుగమానసంబలరజాణగమోదమునాట్యగత్తెగా
  పైఁటచెఱంగుఁబట్టుపెఱవానికిముద్దిడెసాధ్విప్రేమతోన్

  రిప్లయితొలగించండి
 6. తోటను సంచరించు నొక తొ
  య్యలి పుత్రుడు తప్పి పోయి న
  చ్చోటొక యన్య భామినిని జూచి
  వెసన్ దరి జేరి బాలు డా
  మాటలనాడుచున్న పర మాన
  వతిన్ దన తల్లియంచు తా
  పైట చరంగు బట్టు పెరవానికి
  ముద్ధిడె సాధ్వి ప్రేమతోన్

  రిప్లయితొలగించండి
 7. అందరికీ నమస్సులు🙏

  బిరబిర ప్రాకుచు గరముల
  త్వర దన మెడను పెనవేయు తమ్ముని కొడుకున్
  వరమున బుట్టిన బిడ్డడు
  *“పెఱవానికి సాధ్వి ముద్దుపెట్టెం బ్రేమన్”*

  *వాణిశ్రీ నైనాల*

  రిప్లయితొలగించండి
 8. సమస్య :

  పైటచెరంగు బట్టు పెర
  వానికి ముద్దిడె సాధ్వి ప్రేమతోన్

  ( దుష్టునికి తిరస్కారం శిష్టునికి పురస్కారం )

  ఘాటగు మద్యముం దనదు
  కంఠము దాకను ద్రావి మత్తుడై
  మోటుగ వెంటనంటగను
  మూర్ఖుని కొక్క చపేళ మిచ్చెలే
  పైటచెరంగు బట్టు పెర
  వానికి ; ముద్దిడె సాధ్వి ప్రేమతోన్
  నీటుగ గుండెలోపలను
  నిండిన వానికి మార్దవమ్ముగన్ .

  ( చపేళము - చెంపదెబ్బ , నీటుగ - మురిపెముగా )

  రిప్లయితొలగించండి
 9. ఇరువురు పుత్రులు గణపతి
  శరవణుడు గిరీంద్రపుత్రి శాంకరికి తగన్
  సరగున తనయొడి చేరిన
  పెఱవానికి సాధ్వి ముద్దుపెట్టెం బ్రేమన్

  రిప్లయితొలగించండి
 10. ఉ:

  చీటికి మాటికిన్ బుడుత చీదఱ సేయగ, తల్లిమాటగా
  సాటిది యూరడింతునని చంకిలి జేర్చి సరాగ మాడగా
  గోటికి చిక్కె నా పడతి కొంగు, కనుంగొని సంభ్రమమ్ముగన్
  పైట చెఱంగు బట్టు పెఱవానికి ముద్దిడె సాధ్వి బ్రేమతోన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 11. ఉత్పలమాల:
  కాటక మేర్పడెన్ దినపు కార్మికులందరకున్ "కొరోన"యే
  చేటును దెచ్చె నొక్క పరి చిప్పయె చేతికి వచ్చె నయ్యొయో!
  మాటలు రాక యాకలికి మన్ననతో దరిచేరి మాత నున్
  “పైఁట చెఱంగుఁ బట్టు పెఱవానికి ముద్దిడె సాధ్వి ప్రేమతోన్”
  [ముద్ద+ యిడె ]
  ---కటకం వేంకటరామ శర్మ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ముద్ద+ఇడె' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.

   తొలగించండి
 12. చొరవనడపి గుద్దులొసగె
  పెఱవానికి సాధ్వి ; ముద్దుపెట్టెం బ్రేమన్
  కొరతపడకుండు రీతిని
  మరుని తలపజేయు చున్న మగని తనివికై

  రిప్లయితొలగించండి
 13. ఆటల నాడియాడి యడియాసలఁబొందుచు కుందు బాలునిన్
  తోటి కుబుద్ధి బాలకులు దుందుడుకొప్పగ గేలి సేయగన్
  మాటలు రాని వాడతఁడు మార్గము దోచక పిచ్చివాడునై
  పైట చెఱంగుఁబట్టు పెఱవానికి ముద్దిడె సాధ్వి ప్రేమతోన్

  రిప్లయితొలగించండి
 14. మెఱగు నయనముల నవ్వుల
  బఱగుచు నా బాలకృష్ణపరమాత్ముండే
  పెఱరేపగ నా ముద్దుల
  పెఱవానికి సాధ్వి ముద్దుపెట్టెం బ్రేమన్

  రిప్లయితొలగించండి
 15. హరునం దంబేమి గనెనొ
  విరివిగ  నొడలున విభూది   విరబోసిన చిం
  పిరి కురులు  కరభమున  క
  ప్పెర, వానికి, సాధ్వి ముద్దుపెట్టెం బ్రేమన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అంబ+ఏమి' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.

   తొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  3. ధన్యవాదములు గురువుగారు.క్రింది విధముగా సవరించితిని.

   గిరిజ వలచె హరునేమొకొ
   విరివిగ నొడలున విభూది విరబోసిన చిం
   పిరి కురులు కరభమున క
   ప్పెర, వానికి, సాధ్వి ముద్దుపెట్టెం బ్రేమన్

   తొలగించండి
 16. ఆటలనాడియాడి తన యంకముజేరిన ముద్దు బిడ్డలన్
  పాటలగంధి యిద్దరికి పన్నుగ స్నానము సల్పి వారికిన్
  దీటుగ వస్త్రముల్దొడిగిదీవెనలిచ్చుచు గారవింపగన్
  పైఁట చెఱంగుఁ బట్టు పెఱవానికి ముద్దిడె సాధ్వి ప్రేమతోన్

  రిప్లయితొలగించండి
 17. చరణములెత్తుచు నడచుచు
  దరి చేరిన సోదరి చిఱుత సుతుని గాంచన్
  కరములనెత్తుకు తానా
  పెఱవానికి సాధ్వి ముద్దుపెట్టెం బ్రేమన్

  రిప్లయితొలగించండి
 18. కాటుక కండ్ల నశ్రువులు కారుచు నుండగ శోకమగ్నయై
  పేటికలోన బాలకునిఁ బెట్టి పయస్వినిఁ గుంతి వేయగా
  వాటపు దిక్కునన్ జనెడి బాలునిఁ బట్ట విభుండు, రాధదౌ
  పైఁట చెఱంగుఁ బట్టు పెఱవానికి ముద్దిడె సాధ్వి ప్రేమతోన్

  రిప్లయితొలగించండి
 19. నాటి పరాభవంబునకు నాతికి జేసిన బాస చొప్పునన్,
  వ్రేటున గూల్చి గుండియను భిన్నమొనర్చి విధింప శిక్షనా
  పైఁట చెఱంగుఁ బట్టు పెఱవానికి, ముద్దిడె సాధ్వి ప్రేమతోన్
  దీటుగ నిల్చి వేదనను దీర్చిన నాథుని, జుట్టె దా గురుల్

  రిప్లయితొలగించండి

 20. బిరబిర యడుగులు వేయుచు
  తరుణిని గని తాబొరబడి తల్లియటంచున్
  గరముల జాపుచు వచ్చిన
  పెఱవానికి సాధ్వి ముద్దుపెట్టెం బ్రేమన్

  రిప్లయితొలగించండి

 21. ధాటిగ బాలకుండ్రచట దాగుడు మూతలనాడు వేళలో
  కోటను వీడి వచ్చెనొక కోమలి పెన్మిటి పిల్చినంత నా
  బోటిని గాంచి తల్లియని బోదడొకండు దలంచి ప్రేమతో
  పైఁట చెఱంగుఁ బట్టు పెఱవానికి ముద్దిడె సాధ్వి ప్రేమతోన్

  రిప్లయితొలగించండి
 22. చిరునడకల పసిబిడ్డడు
  పరుగెత్తుచు వచ్చి మీదపడ బెదరున ని
  వ్వెరపడి జూచి మురిపెమున
  పెఱవానికి సాధ్వి ముద్దుపెట్టెం బ్రేమన్.

  రిప్లయితొలగించండి
 23. అరమరికలేక వచ్చెడు
  పెఱవానికి సాధ్విముద్దుపెట్టెన్ బ్రేమన్
  జఱజఱ పాకుచు నంతట
  మురిపెములన్ గూర్చుచుండె మోహనమూర్తిన్

  రిప్లయితొలగించండి
 24. ఉఱుకుచు నాత్రమ్ముగఁ దన
  కొఱకై విజయమ్ము సేయఁ గోమలి పతికే
  వెఱ పెందుకు కాదు కదా
  పెఱవానికి సాధ్వి ముద్దు పెట్టెం బ్రేమన్


  మాటలు గూడ రాని సుకుమారుఁడు కుల్కుచు వింత వింతగాఁ
  బాట లనంగఁ గూఁతలను బన్నుగఁ గూయుచుఁ బూరుషుండు దా
  నాటలఁ జెల్గి యంకమున నర్భకుఁ డుండఁగ ముద్దు పట్టికిం
  బైఁట చెఱంగుఁ బట్టు పెఱవానికి ముద్దిడె సాధ్వి ప్రేమతోన్

  రిప్లయితొలగించండి
 25. కందం
  పెరపోకన వనిత యొకతె
  పరవాని కలయిక వలదు పాపమదనగన్
  పెఱడున ప్రియసఖుడిని గని
  పెఱవానికి సాధ్వి ముద్దు పెట్టెం బ్రేమన్.

  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటర్.
  పెరపోక-చెడునడత.

  రిప్లయితొలగించండి
 26. ఆటలమధ్యలో నలసి యాతురతోడను జేరిమక్కువన్
  పైటజెఱంగుబట్టు పెఱవానికి ముద్దిడె సాధ్వి ప్రేమతోన్
  మాటలురాని యాశిశువు మచ్చిక జెంతకువచ్చురీతి,నా
  బోటులవారినిన్ మిగుల "బో"యన జేసెను మానసంబునన్

  రిప్లయితొలగించండి
 27. స్థిరమగు బుద్ధిని గురువుగ
  వరమగు విద్యలను నేర్ప ప్రధమపు శ్రేణిన్
  వరలగ శిష్యుని నుదుటన్
  పెరవానికి సాధ్వి ముద్దుబెట్టెం బ్రేమన్

  ఘాటు జవాబొసంగెను వికారమునొందుచు కాననంబునన్
  పైట చెరంగు బట్టు పెఱవానికి; ముద్దిడె సాధ్వి ప్రేమతోన్
  ధీటుగ జుట్టుముట్టి తలదీయక సైంధవు భంగపర్చుచున్
  పాటిగ జేయగా నతని పాండవ దాసుగ భీమసేనునిన్

  రిప్లయితొలగించండి