6, అక్టోబర్ 2021, బుధవారం

సమస్య - 3864

7-10-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రావణుని పెండ్లి కేగెను రాముఁ డలరి”
(లేదా...)
“రావణు పెండ్లి కేగెనఁట రాముఁడు భూమిసుతాసమేతుఁడై”

44 కామెంట్‌లు:


 1. పావనుడైన శ్రీహరియె వాసురయందు జనించెనంచు నా
  రావణు సోదరుండెపుడు రాముని కొల్చు విభీషణుండె తా
  భావిని తో వచించెనట స్వప్నము గాంచితి నేనటంచు, మై
  రావణు పెండ్లికేగెనట రాముడు భూమిసుతాసమేతుడై.

  రిప్లయితొలగించండి
 2. శివునిధనువునుసంధించిసీతగెలిచి
  చూపులందునసరిఁజూపిచురకవేసె
  పౌరుషంబునపతనమైపేదయైన
  రావణుని"పెండ్లికేగెనురాముడలరి

  రిప్లయితొలగించండి
 3. సమస్య :

  రావణు పెండ్లి కేగెనట
  రాముడు భూమిసుతాసమేతుడై

  ( శిష్యుని తిక్కప్రశ్న - పరమానందయ్య గారి సమాధానం )

  " ఓ వరపాండితీగురుడ
  యొక్కటె ప్రశ్నను వేతునయ్యరో !
  చేవ గలట్టివాడవని ;
  చెప్పుము పూరణ తత్తరింపకన్ ;
  రావణు పెండ్లి కేగెనట
  రాముడు భూమిసుతాసమేతుడై ;"
  " కావర మెక్కి పల్కు నుడి
  ఖాతరు చేయను ; ఊరుకొమ్మికన్ ."

  రిప్లయితొలగించండి
 4. పౌరుషంబునపతనమైపోరుసల్పు
  రావణుని"పెండ్లికేగెనురాముడలరి

  రిప్లయితొలగించండి
 5. కోవిడు సోకగాను మది క్రుంగగ బుద్ధిని గోలుపోవగా
  చావడినందు జేరుచును చక్కనిగాథను జెప్పెనిట్టులన్
  దావతునందగా బిలువ దైత్యుడు లంకకు ప్రేమమీరగన్
  రావణు బెండ్లికేగెనట రాముడు భూమిసుతా సమేతుడై

  రిప్లయితొలగించండి

 6. పానశాలజేరి యచట పక్వ రసము
  పానమొనరించి మత్తుతో పాలసుండు
  వాని మిత్రకూటమితోడ పలికెనిటుల
  రావణుని పెండ్లికేగెను రాముడలరి.

  రిప్లయితొలగించండి
 7. తావనమందుదీక్షఁగనితాపసువోలెనుసంచరించుచున్
  పావనిజానకీసతినిపాలిసుడంతటచెట్టబట్టుచున్
  లావునహుంకరింపనటరాక్షసుమిత్తియుముద్దులాడనా
  రావణుపెండ్లికేగెనఁటరాముఁడుభూమిసుతాసమేతుడై

  రిప్లయితొలగించండి
 8. రామ పత్నిని గొనిపోవ రావణుండు
  రాముడుతనబాణపరాక్రమమున జంపి
  రావణుని, పెండ్లి కేగెను రాముఁ డలరి
  భార్య సీతాసమేతుడై భాసురముగ

  రిప్లయితొలగించండి
 9. రామ భక్తుడొకండిల రాత్రి వేళ
  కలను గాంచియు మిత్రుతో పలికె నిట్లు
  "రావణుని పెండ్లి కేగెను రాము డలరి "
  సాధ్య మౌ గద కలలోన జరుగ నవియు

  రిప్లయితొలగించండి
 10. తేటగీతి
  దశరథాత్మజు రీతిగన్ దానె నిల్వ
  పంక్తికంఠుడై నిల్చిన పాత్రధారి
  హృదయపూర్వకంబుగఁ బిల్వ సదయుఁడగుచు
  రావణుని పెండ్లి కేగెను రాముఁ డలరి

  ఉత్పలమాల
  పావన రామగాథఁగన వారలె పాత్రల వేయనొప్పెడున్
  జేవగలింగెడున్ నటులు చిత్రములందున నాటకమ్ములన్
  రావలె నంచు మిత్రులని రంజిలఁ బిల్వఁగ నాదరమ్మునన్
  రావణు పెండ్లి కేగెనఁట రాముఁడు భూమిసుతాసమేతుఁడై

  రిప్లయితొలగించండి
 11. ఉ:

  రావణ పాత్రధారి దన లగ్గము గూడె నటంచు రంగమున్
  హావము బల్క నెల్లరకు నాత్రము సమ్మతి దెల్పి క్రొత్తగా
  పోవుట కెంచ వేసమున ముచ్చట గొల్పగ చూచువారికిన్
  రావణు పెండ్లి కేగెనట రాముడు భూమి సుతా సమేతుడై

  హావము=ఆహ్వానము

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 12. క్రొవ్విడి వెంకట రాజారావు:

  రామ రావణుల వలెను రమ్యముగను
  నాటకమ్మాడి యుండిన నటుల యందు
  రావణుని పెండ్లి కేగెను రాము డలరి
  సతియు సంతును గూడుచు సవురు మీర.

  రిప్లయితొలగించండి
 13. క్రొవ్విడి వెంకట రాజారావు:

  పావనమైన రామకథ పాటిగ జూపిన నాటకమ్మునన్
  రావణ రామ పాత్రలను రక్తిగ నాడిన మిత్రులందునన్
  రావణు పెండ్లి కేగెనట రాముడు భూమి సుతా సమేతుడై
  ఠీవిగ సంతసమ్మునను ఠేవను గూడిన ప్రేమ తోడుతన్.

  రిప్లయితొలగించండి
 14. మాఘమాసము రాకతొ మనువు వంట
  రాము మనసును తినుట నిరాఖరించె
  శత్రువైన నేమి పరమ మిత్రుడనుచు
  రావణుని పెండ్లి కేగెను రాముడలరి

  రిప్లయితొలగించండి
 15. వింత లేడిని పట్టగ వెడలి యుండ
  సతిని దొంగిలించెననుచు సంహరించె
  రావణుని ; పెండ్లి కేగెను రాముఁ డలరి
  పత్వితో , దాజ్యలక్ష్మి జేపట్టు టకయి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "పత్నితో రాజ్యలక్ష్మి' టైపాటు.

   తొలగించండి
 16. నీవు పురాణముల్ చదివి నిర్మల చిత్తముతోడ నెప్పుడున్
  చేవ గలట్టివాదముల చేయుము పెక్కురు మెచ్చు రీతిగా
  దేవునిపై నసత్యమగు దేబె వదంతు లవేల ? నెప్పు డా
  రావణు పెండ్లి కేగెనఁట రాముఁడు భూమిసుతాసమేతుఁడై?

  రిప్లయితొలగించండి
 17. తేటగీతి
  పెండ్లికి బిలిచె నటులను ప్రేమ గాను
  వచ్చి యాశీస్సులిచ్చిరి, మెచ్చి రంత
  చలన చిత్రపు రాముడు చలన చిత్ర
  రావణుని పెండ్లి కేగెను రాముడలర
  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటర్

  రిప్లయితొలగించండి
 18. రామ రావణు లిద్దఱు ప్రాణ సఖులు
  బాల్య మిత్రులు ననురాగ బద్ధు లిద్ధ
  రా తలమునఁ బిలువ కున్న రావణుండు
  రావణుని పెండ్లి కేఁగెను రాముఁ డలరి


  కావఁగ లోక వాసులను గారణ జన్ముఁడు రాఁగఁ దోడు స్వీ
  యావరజుండు లక్ష్మణుఁడు నార్తిని నత్తరిఁ దండ్రి పంపునన్
  వే వన వాస మెంచి ధృతి వీర వరేణ్యుఁడు, వుట్ట లేదు తా
  రావణు పెండ్లి, కేఁగె నఁట రాముఁడు భూమి సుతా సమేతుఁడై

  రిప్లయితొలగించండి
 19. సకల దేవత లొయ్యన సభయు లగుచు
  రావణుని పెండ్లికేగెను,రాముడలరి
  తండ్రి పంపున నటవికి తమ్ముతోడ
  నేగె సీతమ్మ యునువెంట రాగ యపుడు

  రిప్లయితొలగించండి
 20. ఆ వరదాయకుండు జనకాత్మజ గావగ గూల్చెనేరినో
  భూవరుఁడేల బంధు హిత ముఖ్యులతో జనెనా విదేహకున్
  రావణు సంహరించి జనరంజకుడై యశమందెనెవ్వరో
  రావణు; పెండ్లి కేగెనఁట; రాముఁడు భూమిసుతాసమేతుఁడై

  రిప్లయితొలగించండి
 21. ఆవనజాక్షులందఱును నార్భట మొప్పగ నొక్కసారిగా
  రావణు పెండ్లికేగెనట,రాముడు భూమిసుతా సమేతుడై
  కావగ మౌనిపుంగవుల,గాతరమొందిన నెల్లవారలన్
  దావనవాసముంజరుప తమ్ముని తోడను వచ్చెనేగదా

  రిప్లయితొలగించండి
 22. రావణపాత్రధారి ధనరాజుకు పెండిలి నిశ్చయంబవన్
  దీవనలీయరండనుచు దెల్పెను మిత్రులకెల్ల బ్రీతితో
  పావని పాత్రధారి తనవారలకిట్లనె నుల్లసంబుగా
  రావణు పెండ్లి కేగెనఁట రాముఁడు భూమిసుతా సమేతుఁడై

  రిప్లయితొలగించండి