24, అక్టోబర్ 2021, ఆదివారం

సమస్య - 3881

 25-10-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కరిముఖుండు వాలమున లంకను దహించె”
(లేదా...)
“కరివదనుండు వాలమునఁ గాల్చెను లంకను శౌర్యమొప్పఁగన్”

29 కామెంట్‌లు:

 1. గురువుతానుగనరుదెంచికూర్చెబోధ
  సీతజీవాత్మగాచెనుసేగిఁదీర
  రావణుండుగలోనున్నలావునణచి
  కరిముఖుండువాలమునలంకనుదహించె
  కరి-కోఁతి

  రిప్లయితొలగించు
 2. తేటగీతి
  సీత విరహాన రామయ్య చింతనుండ
  వెదుకి సాధించి దీవిని సుదతిఁ గాంచి
  వైరి దౌష్ట్యమ్ము నెదిరించి పౌరుషమున
  కరిముఖుండు వాలమున లంకను దహించె

  చంపకమాల
  విరహము నందు జిక్కి రఘువీరుడు రాముడు సీత రోయఁగన్
  మరుతుని పుత్రునంప నసమాన బలంబున వార్ధి దూకియున్
  సరసిజ నేత్రఁగాంచి వనశాఖల ద్రుంచఁగ వైరి దౌష్ట్యమై
  కరివదనుండు వాలమునఁ గాల్చెను లంకను శౌర్యమొప్పఁగన్

  రిప్లయితొలగించు
 3. తేటగీతి రెండవపాదం లో మొదట వెదకి అని చదువుకొన ప్రార్థన

  రిప్లయితొలగించు
 4. విఘ్న ములు తొలగించె డు వేలుపు గద
  కరి ముఖుండు : వాలమున లంక ను దహించె
  హనుమ చెల రేగి విక్రముండా తడ గుచు
  విశ్వ రూపము జూపించి భీతి గొలిపె

  రిప్లయితొలగించు
 5. పరుగునవాయునందనుడుభానునివేగమునందిచెచ్చెరన్
  అరిగనిజీవుగాచుటకునాదరమోప్పగచేయిచాచుచున్
  సరిగనుసాధనంబుననుసాధ్యముఁజేయగరాముకార్యమున్
  కరివదనుండువాలమునఁగాల్ెనులంకనుశౌర్యమోప్పగన్

  రిప్లయితొలగించు
 6. రామపత్నిని వెదుకుచు లంకచేరి
  బంధకుని చేత బంధింపబడెను హనుమ
  నీచ రాక్షసులుతనకు నిప్పుబెట్ట
  కరిముఖుండు వాలమున లంకను దహించె

  రిప్లయితొలగించు
 7. బదులిడుమనుచు ప్రశ్నించె పండితు డొక
  డిట్లు విఘ్నముల హరించెడీశ్వరసుతు
  డెవడు? దనుజరాజ్యము గపి యేమిచేసె
  కరిముఖుండు వాలమున లంకను దహించె

  రిప్లయితొలగించు

 8. హరహయుడంచు పిల్చు మలయమ్మ సుపుత్రుడు విఘ్నహారిగా
  విరివిగ పూజలందుకొను వేలుపెవండని యడ్గుచుంటినే
  శరనిధి దాటి పావని నిశాటుని రాజ్యము జేసె నేమనన్
  కరివదనుండు, వాలమునఁ గాల్చెను లంకను శౌర్యమొప్పఁగన్

  రిప్లయితొలగించు
 9. హితవు జెప్పెడు దూతను నీసడించి
  ఆగ్రహించిన రావణు డాజ్ఞనీయ
  నిగ్రహించగ దోకకు నిప్పుపెట్ట
  కరిముఖుండు వాలమున లంకను దహించె

  గురిగొని తల్లిదండ్రులకు గూర్చ ప్రదక్షిణ నాయకుండయెన్
  కరివదనుండు; వాలమున గాల్చెను లంకను శౌర్యమొప్పగన్
  చురుకగు వాయునందనుడ శోకవనంబున రాక్షసాంగనల్
  తరుణిని భూమిజాతనట దారుణరీతిని హింసబెట్టగన్

  రిప్లయితొలగించు
 10. క్రమాలంకార పూరణ
  విఘ్నముల బాపు వారెవరు వెదకి చూడ?
  దున్న లీగల దేనితో తోలుకొనును?
  రామ దూతయు బలిమిని నేమి జేసె?
  కరి ముఖుండు-వాలమున-లంకను దహించె.

  రిప్లయితొలగించు
 11. శివ గణముల కధిపతియై సేవలందు
  ముందు, మాతా పితల చుట్టు మూడు మార్లు
  తిరిగె; వెదకి హనుమ సీత తెరువు గాంచి,
  కరిముఖుండు, వాలమున లంకను దహించె.

  రిప్లయితొలగించు
 12. సమస్య :

  కరివదనుండు వాలమున
  గాల్చెను లంకను శౌర్యమొప్పగన్

  ( శ్రీరామకార్యం కోసం వెళ్లుతున్న హనుమకు ఆశీస్సులందించిన విఘ్నేశ్వరుడు )

  పరమశివాంశ సంభవుడు
  పావని ప్రజ్వలితోర్ధ్వబాహుడై
  సరగున నేగుచుండ తన
  చల్లని దీవెన లిచ్చె ప్రేమతో
  గరివదనుండు ; వాలమున
  గాల్చెను లంకను శౌర్యమొప్పగన్
  చరచర రేగుచున్న శిఖి
  చాడ్పున మారుతి చండదేహుడై .

  ( శిఖి - అగ్నిదేవుడు )

  రిప్లయితొలగించు
 13. తల్లిదండ్రుల చుట్టు ప్రదక్షి న నిడె
  కరిముఖుండు ; వాలమున లంకను దహించె
  దాని కనలము ముట్టించు దరుణ మందు ,
  చూచి రమ్మన గాల్చెడి చొప్పు ననగ

  రిప్లయితొలగించు
 14. మరి సరిజేసె యుద్ధమున మాయల మూషికు గర్వమంతయున్
  కరివదనుండు; వాలమునఁ గాల్చెను లంకను, శౌర్యమొప్పఁగన్
  పురమున యిల్లలోనబడి పూర్తిగ ధగ్దము జేసి వస్తువుల్,
  విరిచెను చెట్ల కొమ్మలను వీరుడు మారుతి హెచ్చరించుచున్


  రిప్లయితొలగించు
 15. పరువులు బెట్టి వీధులను పండుగ పూటను ముత్తుకూరునన్
  తిరుగుచు మందుగ్రోలుచును త్రిప్పలు వెట్టుచు భామలెల్లరిన్
  మురియుచు నాటకమ్మునను ముచ్చట మీరగ శాస్త్రివర్యుడౌ
  కరివదనుండు వాలమునఁ గాల్చెను లంకను శౌర్యమొప్పఁగన్

  రిప్లయితొలగించు
 16. జలధిలంఘించి చేరెను స్వర్ణలంకఁ
  గాంచె జానకీ మాతను కన్నులార
  రక్కసులుపట్టి బంధించి రభసజేయ
  కరిముఖుండు వాలమున లంకను దహించె

  రిప్లయితొలగించు
 17. శరధినిదాటి వానరుఁడు సాధ్వి మహీజనుగాంచి దెల్పె దా
  శరధికిఁదాను బంటునని సాంత్వన వాక్యములన్ వచించి శ్రీ
  కరమగు సీత క్షేమమును గాంచినపిమ్మట నుత్సహించుచున్
  కరివదనుండు వాలమునఁ గాల్చెను లంకను శౌర్యమొప్పఁగన్

  రిప్లయితొలగించు
 18. శరణము గోరినట్టి వన సామజమున్
  కరుణించి బ్రోచె నా
  కరివరదుండు,వాలమున గాల్చెను
  లంకను శౌర్యమొప్పగన్
  పరమ దురాత్మురావణుని పట్టణ
  మున్ దనయుక్తి శక్తిచే
  నిరతము రామ నామ జప నిర్మల
  భక్తుడు వాయు పుత్రుడున్

  రిప్లయితొలగించు
 19. దురితమనస్కులై చెలగు ధూర్త నిశాటులు, రేని యానతో
  కరువలిపట్టి వాలమునుఁ గాల్చగ వస్త్రముఁ జుట్టి, కిన్కతో
  తిరుగుచుఁ బట్టణమ్మునను, దివ్యమునుండి కనంగఁ బ్రీతితో
  కరివదనుండు, వాలమునఁ గాల్చెను లంకను శౌర్యమొప్పఁగన్

  రిప్లయితొలగించు
 20. ఇందు వదన సీతను గాంచి డెంద మంద
  నింపు రావణు శక్తి గణింప నెంచి
  సుందరుం డగు మారుత నందనుండు
  కరిముఖుండు వాలమున లంకను దహించె

  [కరి ముఖుఁడు = కోఁతి ముఖము వాఁడు]


  సురుచిర రామభక్తుఁడు వచో నిపుణుండు మనోజవుండు నా
  వర ఖర దానవజ్వలిత వాల విరాజితుఁ డాంజనేయుఁడే
  హరి కట శంక రాంశునకు నయ్యను జాభున కీయ దీవనల్
  కరివదనుండు, వాలమునఁ గాల్చెను లంకను శౌర్యమొప్పఁగన్

  రిప్లయితొలగించు
 21. Thanks for sharing this valuable and understanding article with us.
  Here we have provided the anton schneider cuckoo clock Guide that helps you
  in your all needs of anton schneider cuckoo clock &
  solved all your cuckoo clock probelm.

  రిప్లయితొలగించు
 22. తేటగీతి
  అత్తరి శతయోజన సాగరాన్ని దాటి
  సీతని గని సంతసపడి క్షేమమడిగి
  రాక్షసాధములను జంపి రద్ది సల్పి
  కరిముఖుండు వాలమున లంకను దహించె
  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటర్

  రిప్లయితొలగించు
 23. తరిషము దాటి రామసతి తల్లియయోనిజ జాడ గోరి స
  త్వరమున లంకజేరి యట వారిజనేత్రిని గాంచి మానమం
  దరునకు జిక్కిరక్కసుల దండట తోకకు నిప్పు వెట్టగన్
  కరివదనుండు వాలమున గాల్చెను లంకను శౌర్యమొప్పగన్.

  కరి = గజము, కోతి.

  రిప్లయితొలగించు
 24. వేల్పులందరి కంటెను బెద్దవేల్పు
  కరిముఖుండు,వాలమున లంకను దహించె
  నాంజనేయుడు,రాక్షసు లగ్ని జొనుప
  సంగరంబునకును నాంది సత్కవివర!

  రిప్లయితొలగించు
 25. చంపకమాల:
  పరసతి మోహి రావణుడు పాపము హెచ్చి తనంతతానుగా
  గరళము కూఁడునందు కలగల్పిన రీతిన సీత మాత నే
  పురమున తెచ్చిపెట్టె , కపి మూకలు నల్దెస రాముడంప గా
  “కరివదనుండు వాలమునఁ గాల్చెను లంకను శౌర్యమొప్పఁగన్”
  ---కటకం వేంకటరామ శర్మ.

  రిప్లయితొలగించు
 26. తేటగీతి:
  ఆత్మ లింగము రాకుండ నడ్డగించె
  *కరిముఖుండు, వాలమున లంకను దహించె*
  భవుని యంశను పుట్టిన వాయు సుతుడు
  కొడుకు తండ్రియు భక్తుని కొంపగూల్చె।
  ---కటకం వేంకటరామ శర్మ.

  రిప్లయితొలగించు
 27. మురిపెము గొల్పు బొజ్జయును మోదము గూర్చెడి మోముతో గనున్
  కరివదనుండు,వాలమున గాల్చెను లంకను శౌర్యమొప్పగన్
  గిరగిర దిర్గుచున్ వడిని గేళిగలంకను జుట్టి కీరమున్
  జరజర శబ్దముల్ గలుగ సర్వము భస్మము నౌవిధంబునన్

  రిప్లయితొలగించు