16, అక్టోబర్ 2021, శనివారం

సమస్య - 3873

17-10-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నీలగళుఁడు హరి శివుండు నీలాంగుండే”
(లేదా...)
“నీలగ్రీవుఁ డనంగ విష్ణువె యగున్ నీలాంగుఁ డాశంభుఁడే”

63 కామెంట్‌లు:

 1. చాలున్ భేదము లేలా?
  లీల లెరుంగుము జగతిని రీతిన్ గనగా
  కాలుడు రుద్రుడు గృష్ణుడు
  నీలగళుఁడు హరి శివుండు నీలాంగుండే.

  రిప్లయితొలగించండి
 2. లీలామానుషవేషము
  కాలాక్రుతిగనగశత్రుఖండనసేయన్
  ఏలాభేదములెంచగ
  నీలగళుడుహరినీలాంగుండే

  రిప్లయితొలగించండి
 3. కందం
  శూలాయుధ చక్రాయుధ
  లీలామానుష చరులుగఁ బృధ్వీస్థలిపై
  పాలింప నార్తిఁ బాపఁగ
  నీలగళుఁడు హరి శివుండు నీలాంగుండే

  శార్దూలవిక్రీడితము
  శూలమ్మొక్కరు శంఖ చక్రమొకరున్ సొంపారగాఁ దాల్చుచున్
  లీలామానుష రూపులై చెలగరే పృధ్వీస్థలిన్ శిష్టులన్
  పాలింపంగ దురాత్ములన్ దునుమెడున్ భావంబునన్ జూడఁగన్
  నీలగ్రీవుఁ డనంగ విష్ణువె యగున్ నీలాంగుఁ డాశంభుఁడే!

  రిప్లయితొలగించండి
 4. మేలుగ గ్రోలెను గరళము
  నీలగళు డు : హరి శివుండు నీలాంగుడే
  యేల వలె నంతరములు
  పోలిక లు వలదని యండ్రు పొందుగ నార్యుల్

  రిప్లయితొలగించండి
 5. హేలన్జూచినస్రుష్టిలోపరమునేహ్రీవీడియాలోచనన్
  లోలోనన్గనిరెండులేవనెడిదీలోకంపుమర్యాదగా
  లీలామానుషవేషధారులుగకేళీలోలనిర్మగ్నులీ
  నీలగ్రీవుఁడనంగవిష్ణువెయగున్నీలాంగుడాశంభుడే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   'సృష్టిలో' టైపాటు.

   తొలగించండి
  2. ధన్యవాదములండిగురువుగారువట్రుసుడిటైపుకుఅవకాశములేక అట్టులవ్రాసితిని క్షమించగలరు

   తొలగించండి
 6. కాలాతీతుడు నిర్వికారుడు
  మహా కాలాత్మ సర్వజ్ఞుడున్
  బోలా శంకరుడాది భిక్షువుకదా
  భూమండలంబాతడే
  కాలానుక్రమరీతిజేయులయ
  మున్ గాలాంత కుండాతడే
  నీలగ్రీవుడనంగ విష్ణవె యగున్నీ
  లాంగుడా శంభువే

  రిప్లయితొలగించండి
 7. చాలా సాధన చేసిరి
  యాలయ నాటకము కొరకు హరి,శివ; వరుసన్
  మేలుగ చేసిరి నటనము
  నీలగళుఁడు హరి శివుండు నీలాంగుండే.

  రిప్లయితొలగించండి

 8. ఫాలాక్షుడతడు గట్రా
  చూలిమనోహరుడు భవుడు శూలిధరుడు గో
  పాలుడు చంద్రా పీడుడు
  నీలగళుడు, హరి శివుండు నీలాంగుండే.

  (శివుడు= శుభములనొసగువాడు)

  రిప్లయితొలగించండి
 9. (హరి అనువానితో నొకడిట్లు చెప్పెను)

  ఆలించుము నా మాటను
  నీలగళుడు హరి శివుండు, నీలాంగుండే
  పాలేటిచూలి పతి యమ
  కీలుడు కుందుడభిజిత్తు కేశవు డతడే.

  రిప్లయితొలగించండి
 10. బాలుడు హరిహరులొకటను
  నాలోచన తన మనమున
  నమరినకతనన్
  గేలిగననె నీరీతిగ
  “నీలగళుఁడు హరి శివుండు నీలాంగుండే”

  రిప్లయితొలగించండి
 11. ఏలా భేదములెంచుట
  హాలాహలధారి శౌరియననొక్కరెసూ
  పాలిత కింకరుఁడగునా
  నీలగళుఁడు హరి శివుండు నీలాంగుండే

  రిప్లయితొలగించండి
 12. శార్దూలము:
  కైలాసంబున నల్లనమ్మతన శ్రీకంఠుణ్ణి లాస్యమ్మునన్
  సాలోక్యమ్ముగ కౌగిలించ పతియేశ్యామాంగుగాఁ దోచెనే
  పాలన్బు ట్టిన నీలవేణి మెడకున్ వాలే జడన్చుట్టగా
  “నీలగ్రీవుఁ డనంగ విష్ణువె యగున్ నీలాంగుఁ డాశంభుఁడే”
  ---కటకం వేంకటరామ శర్మ.

  రిప్లయితొలగించండి
 13. ఏలా భేదము లెంచగా తగున నీవీరీతి? నిక్కంబుగా
  నీలగ్రీవుఁ డనంగ విష్ణువె యగున్, నీలాంగుఁ డా శంభుఁడే
  లీలామాత్రపు దేహధారులగునా నీలాంగు డుష్ణీషియౌ
  నీలగ్రీవుని శౌరిగానెఱుగగా నీరక్ష వారిర్వురున్

  (ఉష్ణీషి= శివుఁడు)

  రిప్లయితొలగించండి

 14. శూలమ్మాయుధమైన శూలి యతడే జోటింగుడా లింగడే
  నీలగ్రీవుడనంగ, విష్ణువె యగున్ నీలాంగు, డా శంభుడే
  కైలాసమ్మున నిల్చియుండగ రమాకాంతుండు తానుండు నా
  పాలాంభోనిధి, విశ్వతో ముఖులకున్ వైషమ్య మేముండురా!

  రిప్లయితొలగించండి
 15. శా:

  ఏలా బిల్చిన వారలిద్దరొకరే యేలంగ నీ లోకమున్
  చాలింపండిక వేరు జేసి నుడువన్ సంపత్తు వ్యత్యాసమే
  యాలోచింపగ నన్య రూపులగుచో నాడింప మార్బల్క రే
  నీలగ్రీవుడనంగ విష్ణువె యగున్ నీలాంగు డాశంభుడే

  సంపత్తు=అలంకారము
  మార్బల్కు0=అడ్డము చెప్పు

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 16. ఈలోకపు వెలుగెవరన
  నీలగళుఁడు హరి శివుండు నీలాంగుండే
  శూలధరుడు చక్రధరుడు
  కాలుడు శిఖపింఛమౌళి కరుణామయులే.

  రిప్లయితొలగించండి
 17. మేలగు చిత్రము చూపగ
  నీలపు వర్ణము  నిలుపని  నేత్రములగుటన్
  చాలని పల్కెనొక బుడత
  నీలగళుఁడు హరి శివుండు నీలాంగుండే

  రిప్లయితొలగించండి
 18. సమస్య :

  నీలగ్రీవు డనంగ విష్ణువె యగున్
  నీలాంగు డా శంభుడే

  ( శైవవైష్ణవ మతదురభిమానాల నిర్మూలనకై హరిహరనాథస్వామిని సృజించి పదిహేను పర్వాల భారతాన్ని అంకితమిచ్చాడు కవిబ్రహ్మ తిక్కన )

  వాలాయంబుగ తిక్కనార్యు డదిగో
  వర్ణించె నొక్కండుగా
  శ్రీలక్ష్మీవిభు పార్వతీవిభులనే
  చెల్వంబు రెట్టింపగా ;
  లీలం జేకొనజేసె భారతమునే
  లెంకౌచు ; తద్దృష్టిలో
  నీలగ్రీవు డనంగ విష్ణువె యగున్ ;
  నీలాంగు డా శంభుడే !

  ( వాలాయము - అనివార్యము ; లెంక - సేవకుడు )

  రిప్లయితొలగించండి
 19. ఏలా భేదము శౌరి శంకరుల కీర్తింపంగ సద్భక్తితో
  లీలామానుషరూపుడై మనుజులన్ ప్రేమించు శ్రీకృష్ణుడున్
  బోళా శంకరుడై ప్రజాళిని దయన్ బోషించు వాడొక్కడే
  నీలగ్రీవుఁ డనంగ విష్ణువె యగున్ నీలాంగుఁ డాశంభుఁడే

  రిప్లయితొలగించండి
 20. హాలాహలమానెనెవఁడు
  పాలేటబరుండునెవఁడు పరగనెవండా
  ఫాలాక్షుఁడజితుఁడెవఁడో
  నీలగళుఁడు హరి శివుండు నీలాంగుండే

  రిప్లయితొలగించండి
 21. లీలా!యెఱుగుమ యీయది
  నీలగళుడుహరి శివుండు నీలాంగుండే
  లీలామానుష రూపులు
  చాలముగావా రిమహిమ,శక్తిని బొగడన్

  రిప్లయితొలగించండి
 22. లీలంగౌస్థుభమాలశౌరిమెడలో
  నీలద్యుతుల్నింపగా
  నీలాభ్రాద్భుతగాత్రయైన తరుణిన్ నీలాంబరిన్ కాళికన్
  ఫాలాక్షుండుశరీరమందుసగమై భాసింపగాజేయగన్
  నీలగ్రీవుడనంగవిష్ణువెయగున్
  నీలాంగుడాశంభుడే!
  ..రంగావఝ్యల కోటేశ్వరశాస్త్రి.

  రిప్లయితొలగించండి
 23. వాలిన భక్తిని గొలువుమ
  యీ లీలను మార్చి మార్చి యీ హరుని హరిన్
  వీలుగ ననంతర మిటుల
  నీలగళుఁడు హరి శివుండు నీలాంగుండే


  వ్రా లిట్లుండఁగ సంశయం బగును భావం బందు నిక్కమ్ముగా
  నీ లీలం గన స్పష్టమే యగును నీ కిప్పాదమే వింతగా
  నీలాంగుండగు విష్ణువే శివునకున్ నీలంపుఁ గంఠం బహో
  నీలగ్రీవుఁ డనంగ,విష్ణువె యగున్ నీలాంగుఁ, డాశంభుఁడే

  [పద విభజన: నీలగ్రీవుఁ డనంగ ౼ఆ శంభుఁడే విష్ణువె యగున్ నీలాంగుఁడు]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కంద పూరణములోఁ జిన్న వ్యాకరణ సంక్లిష్టము కలదు.
   పూజలకు వరుస క్రమము శివుఁడు, హరి, శివుఁడు, హరి సమస్యా పాదమున నీ విధముగా నున్నది.
   ఆ క్రమము చెడకుండ నుండుటకై “యీ లీలను మార్చి మార్చి యీ హరుని హరిన్” అని వ్రాయవలసి వచ్చెను.
   “యీ హరహరులన్” అని సమాస యుక్తముగ వ్రాసిన నందగించును గాని ద్వంద్వసమాసమున “హరి హరులన్” అని యి కారాంత హరి పదమునే ముందు వ్రాయ వలసి యుండును. అప్పుడు పూజా క్రమము మారుచున్నది.

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  3. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 24. నీలగ్రీవుడనంగ విష్ణువెయగున్ నీలాంగుడాశంభుడే
  లీలామానుష రూపులేగద సరిన్ లేలీయమానంబుగా
  బాలింపన్ బ్రజనెల్ల సౌఖ్యముముదంబై యింపు సొంపారగా
  నీలగ్రీవుడు బ్రహ్మవిష్ణులు గనన్ నీకాశ మూర్తుల్ సుమీ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'లేలీయమానంబుగా, నీకాశమూర్తుల్'?

   తొలగించండి
 25. కందం!!
  లీలల్ కానగ వింతలె
  మేలగు రీతిని దరిశన మిచ్చెడి వారల్
  నీలపు వర్ణులె కనగన్
  నీలగళుడు హరి,శివుండు నీలాంగుడే !!

  రిప్లయితొలగించండి
 26. మూలాధారనివాసి కుండలిని నిర్ముక్తంబు గావింపగా
  నాలోకంబగు దివ్య తేజము మదిన్ సానందసంవేద్యమై
  లీలామానుష విగ్రహాకృతిని సర్వేశుండభేదంబుగా
  నీలగ్రీవుఁ డనంగ విష్ణువె యగున్ నీలాంగుఁ డాశంభుఁడే

  రిప్లయితొలగించండి
 27. కందం
  కాలాంతక, లక్ష్మీపతి
  వేలుపులిర్వురికి బేధవృత్తి దలపకన్
  లీలగ గీసిన చిత్రము
  నీలగళుడు హరి శివుండు నీలాంగుండే

  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటర్

  రిప్లయితొలగించండి
 28. కాలాతీతము జేయకన్,నుసురులన్ కాలాంతకుండైన,యా
  భోళా శంకరుడే సదా కరుణతో భూతేశుడై త్రెంచగా
  లీలామానుష నీలదేహ హరియే లెఖ్ఖించ పాపంబులే
  నీలగ్రీవు డనంగ విష్ణువె యగున్ ,నీలాంగుడా శంభుడే !!
  కందం!!
  లీలల్ కానగ వింతలె
  మేలగు రీతిని దరిశన మిచ్చెడి వారల్
  నీలపు వర్ణులె కనగన్
  నీలగళుడు హరి,శివుండు నీలాంగుడే !!

  రిప్లయితొలగించండి