13, అక్టోబర్ 2021, బుధవారం

సమస్య - 3870

14-10-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వాఁడు వెదుక దొరకువాఁడు గాఁడు”
(లేదా...)
“వాఁడెవఁడందువా వెదకి పట్టుకొనం దగువాఁడు గాదుపో”

53 కామెంట్‌లు:

 1. లోనదాగియుండులోకమ్మునేలుచు
  వాఁడువెదుకదోరకువాఁడుకాఁడు
  మౌనిముద్రమదినిమర్మంబుదెలియగ
  యత్నమింతఁజేయుయానమందు

  రిప్లయితొలగించండి

 2. (తండ్రితో ప్రహ్లాదుడాడిన మాటలు)

  ప్రేమతోడ బిలువ వేగిరమే వచ్చు
  నార్తజనుల బ్రోచె డక్షధరుడు
  పగతుడనుచు దలచు ప్రతిఘుల కెప్పుడు
  వాఁడు వెదుక దొరకు వాఁడు గాఁడు.

  రిప్లయితొలగించండి
 3. చేడియ'చెప్పవేమనలఁజేరగబాలుఁడువచ్చెగానిటన్
  పోడిమిమీరనాట్యములపోందుగవెన్నలదోంగిలింపగా
  ఆడునులోకముల్కననియాటనుబోమ్మలనివ్విధిన్వడిన్
  వాఁడెవడందువావెదకిపట్టుకోనందగువాఁడుగాదులే

  రిప్లయితొలగించండి
 4. గురుదేవులకు మరియు కవిమిత్రులందరికీ రేపటి మహర్నవమి పర్వదిన శుభాకాంక్షలు.

  ఆటవెలది
  అవగుణుండటంచు నవనీతచోరుని
  గోపికలు యశోదఁ గ్రుంగఁజేయఁ
  గట్టుపడి జననికి పట్టుపడెనె కాని
  వాఁడు వెదుక దొరకువాఁడు గాఁడు!

  ఉత్పలమాల
  "వేడుకఁ జూతువా వటువు వెన్నుడు దోచెను గొల్లలిండ్లలో
  పాడిని సూ! యశోద!" యని పంకజలోచనలెల్ల నిందలన్
  గూడఁగఁ దల్లియే మదిని గోల్పడ నారడిఁ జిక్కెఁ గాని య
  వ్వాఁడెవఁడందువా వెదకి పట్టుకొనం దగువాఁడు గాదుపో!

  రిప్లయితొలగించండి

 5. ఏడి సహస్రమౌళి యని యెందులకిట్టుల యడ్గు చుంటివో
  మోడుల కేమితెల్యు బహు మూర్థుని గొప్ప దనంబు కాంచగన్
  వీడుమటంచు చెప్పెదను వేరము నాహరి తోడ శ్రేష్ఠునిన్
  వాఁడెవఁడందువా వెదకి పట్టుకొనంగ దగువాఁడు గాదుపో.

  రిప్లయితొలగించండి
 6. సకల జనుల నెల్ల చక్కగా నాడించు
  మహితుఁ డగుచు తాను మరుగు నుండ
  గనగ దలచి జనులు గనిపెట్ట యత్నింప
  వాడు వెదుక దొరకు వాడు గాడు

  రిప్లయితొలగించండి
 7. కనుల జూడలేము వినుట తప్ప, తడిమి
  తాక లేము తరిచి తరిచి, రుచియు
  వాసన పొడ లేని వాడె దేవుడనిన?
  వాఁడు వెదుక, దొరకువాఁడు గాఁడు.

  రిప్లయితొలగించండి
 8. అతడులేనిచోటు యవనిలో కనరాదు
  కాని కంటి కతడు కాన రాడు
  హృదిని యొదిగియుండు పదిలముగ, బయట
  వాఁడు వెదుక దొరకువాఁడు గాఁడు

  ఈడనుతానెయుండుమరియేడనుజూచిన నాడనుండు నే
  వాడను వాడువీడనక వావిరియై ప్రతి జీవియందునన్
  వీడకతానెదన్ నిలచి వేడుకజూచుచునుండు నిచ్చలున్
  వాఁడెవఁడందువా వెదకి పట్టుకొనం దగువాఁడు గాదుపో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'చోటు+అవనిలో' అన్నపుడు సంధి నిత్యం. "స్థాన మవనిలో.." అందామా? అలాగే 'హృదిని నొదిగియుండు' అనండి.

   తొలగించండి
  2. ధన్యవాదములు గురువుగారూ_/|\_

   అతడులేని స్థానమవనిలో కనరాదు
   కాని కంటి కతడు కాన రాడు
   హృదిని నొదిగియుండు పదిలముగ, బయట
   వాఁడు వెదుక దొరకువాఁడు గాఁడు

   తొలగించండి
 9. ఒదిగియుండువాడు యెదలోన మదనుడై
  అదను చూచి విడుచు పదను శరము
  మధురభావలహరి మదితాకకుండిన
  వాఁడు వెదుక దొరకువాఁడు గాఁడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వాడు+ఎదలోన' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. "వాడు మదిలోన" అనండి.

   తొలగించండి
  2. సూచించిన సవరణతో....

   ఒదిగియుండువాడు మదిలోన మదనుడై
   అదను చూచి విడుచు పదను శరము
   మధురభావలహరి మదితాకకుండిన
   వాఁడు వెదుక దొరకువాఁడు గాఁడు

   తొలగించండి
 10. ఉత్పలమాల:
  “వాఁడెవఁడందువా వెదకి పట్టుకొనం దగువాఁడు గాదుపో”
  చూడగ వామనుండనినఁ జొచ్చె నభోతల మంత లోనె ,పా
  రాడెడు కూనడన్న తన యంగిట విశ్వము నంతఁజూపె ,తా
  నాడిన యాటలెల్ల పరమాత్మ యె తాననిఁ బోధ సేయుటే!
  - కటకం వేంకటరామశర్మ.

  రిప్లయితొలగించండి
 11. నీడగ యుండు మానవుడ నిత్యము

  చూచుచు నీదు చర్యలన్
  గూడుచు నుండె నాతడతి
  గూఢముగా ప్రతిరోజు తప్పులన్
  వాడెవడందువా వెదకి పట్టు
  కొనందగు వాడు కాడుపో
  వాడిల నిర్వికారుడయి పాపుల
  ద్రుంచును గాచు శిష్టులన్.

  రిప్లయితొలగించండి
 12. ఉ:

  వీడని నీడగా జనుల వేదన దీర్చగ నెల్ల వేళలన్
  వేడుక మీర ప్రాంతమును వేగమె వృద్ధిని జేయ నెంచనై
  వాడిమి గెల్వనెన్నికలు వంకలు బెట్టిరి లోకులిట్లనన్
  వాడెవడందువా వెదకి పట్టు కొనందగు వాడు గాడు పో

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 13. నేటి దినములందు నిజమౌ నెనరులేదు
  పేరు కొరకెగాక పేద వారి
  కష్టకాల మందు గరుణ జూపించెడి
  వాఁడు వెదుక దొరకువాఁడు గాఁడు

  రిప్లయితొలగించండి
 14. పాడెద నేను భక్తిగను పాండవ రక్షకు గూర్చి ఎప్పుడున్
  కాడుగ దుర్లభుండిలన కాంతుడు, భక్తికి మెచ్చివచ్చుగా
  పాడుమనంబుగల్గినువు పార్ధునిసారధిగూర్చిగేలిగన్
  "వాఁడెవఁడందువా?", "వెదకి పట్టుకొనం దగువాఁడు గాదుపో"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పాడెదనేనుభక్తిగను పాండవరక్షకుగూర్చిఎప్పుడున్
   కాడుగదుర్లభుండుసిరికాంతుడు, భక్తికిమెచ్చివచ్చుగా
   పాడుమనంబుగల్గినువు పార్ధునిసారధిగూర్చిగేలిగన్
   "వాఁడెవఁడందువా?", వెదకి పట్టుకొనం దగువాఁడు గాదుపో

   తొలగించండి
  2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నువు' అన్నది ధాన్యపుటర్థం. నీవు అనే అర్థంలో ప్రయోగించరాదు.

   తొలగించండి
 15. సమస్య :

  వాడెవ డందువా వెదకి
  పట్టుకొనం దగువాడు గాదుపో

  ( వెన్నతీసుకోనీయకుండా " కుండలో గుమ్మడు ఉన్నాడు . నిన్నెత్తుకుపోతాడు " అన్న యశోదతో కన్నయ్య పలుకులు - అమ్మ సమాధానం )

  " వేడుక మాటలాడెదవు
  వెన్నను తీసిన గుమ్మడడ్డునా ?
  వాడెట ? కానిపింపడుగ ;
  వట్టిది ; లేడుగ కుండలోన ; నే
  నాడెద ; వానితో " ననెడి
  యల్లరికన్నని దల్లి పల్కెడిన్
  " వాడెవ డందువా ? వెదకి
  పట్టుకొనం దగువాడు గాదుపో ! "

  రిప్లయితొలగించండి
 16. వాడు దొరకు మదిని వదలక హరియని
  వెదుక నెక్క డైన వెలయజేసి
  ఆత్మబోధము తెలియమిచే యెవరికిని
  వాఁడు వెదుక దొరకువాఁడు గాఁడు

  రిప్లయితొలగించండి
 17. కూడిన భక్తి భావములకున్ కడు వశ్యుడు-యెట్టిదోషముల్
  వాడికి లేవు-భక్త సులభాశ్రిత దివ్య మనోజ్ఞ తత్వమున్
  మెండుగ నిండియుండు పరమేశ్వర తత్త్వము-లో దలంచినన్--
  "వాడెవడందువా వెదకి పట్టుకొనందగువాడు గాదుపో."

  రిప్లయితొలగించండి
 18. జోడుగబుద్దితో మనసు
  చుట్టునుబొందినవైరమెంచగా
  చీడపరంపరై తొలుచు
  ఇంద్రియబేరమునచ్చలేకనే
  బాడిగెగట్టితప్పుకొను
  పాపపుపంకిలదాటకుండగా
  వాడెవడందువా వెదికి
  పట్టుకొనందగువాడుగాదుపో
  ...తోకల...

  రిప్లయితొలగించండి
 19. ఆడినమాటలెల్ల పరిహాసపు పాత్రములై చెలంగఁ దా
  నోడుచుఁ బార్టిలోఁ బదవి నొప్పనటంచు విదేశయానముల్
  వేడుకగా నొనర్చుచు నవీనపు కాంగ్రెసులోన ముఖ్యుఁడౌ
  వాఁడెవఁడందువా? వెదకి పట్టుకొనం దగువాఁడు గాదు పో.

  రిప్లయితొలగించండి
 20. వాడును వీడనిన్ గనక పట్టి వికారము నందు నెట్టెడిన్
  చేడియలైన, వాడు మది చేరిన తట్టు కొనంగ సాధ్యమే ?
  వాడు సుమాస్త్రముల్ విడిచి భర్గుని సైతము తల్లడించె న
  వ్వాఁడెవఁడందువా వెదకి పట్టుకొనం దగువాఁడు గాదుపో

  రిప్లయితొలగించండి
 21. మానసంబునందు లీనమయినగాని
  వాడు వెదుక దొరకువాడు గాడు
  దొరకు భక్తి కలిగి నిరతము సేవించు
  నెడల సందియంబు బడగవలదు

  రిప్లయితొలగించండి
 22. వారకుండ నకట వత్తువు వోదువు
  నా కొఱ కనుదినము నీ కొఱకు నొ
  కండు వచ్చి యుండు దండ నొక్క దినము
  వాఁడు వెదుక దొరకువాఁడు గాఁడు


  వీడక యెల్ల వారలను వింతగ నుందురు పూరు షేంద్రులే
  తోడుగ నిద్ద ఱం దొకఁడు దూఱఁగ లోపల బాహ్య మందుఁ దా
  రాడును గోచరమ్ముగ నరాలికి నన్యుఁడు లోని వాఁడహో
  వాఁడెవఁ డందువా వెదకి పట్టుకొనం దగువాఁడు గాదుపో

  రిప్లయితొలగించండి
 23. వాఁడల వల్లవాంగనల వల్వల దోచిన చిత్త చోరుడ
  వ్వాఁడె ప్రసన్నతన్ సతికి వల్వలొసంగిన తాప హారియ
  వ్వాఁడె సమస్తభూతతతి పాప తమో దురితాపహారియున్
  వాఁడెవఁడందువా వెదకి పట్టుకొనం దగువాఁడు గాదుపో

  రిప్లయితొలగించండి
 24. వాఁడి వాడి కుసుమ బాణంబులవి జేర్చు
  వాడిపోని ప్రణయబంధమందు
  వాఁడె జీవనమున వాసంతము దలిర్చు
  వాఁడు వెదుక దొరకువాఁడు గాఁడు

  రిప్లయితొలగించండి
 25. లోన నుండు వాడు లోతైన పురుషుడు
  చేరి కూరుచుండె చిత్తమందు
  సాక్షియైన వాడు చక్షువుకందని
  వాడు, వెదుక దొరకువాడు గాదు

  గోపికల పరివేదన

  గాఢపు నిద్రలోన నను గారడి జేసెడి వేణువూది తా
  నాడగ బిల్చి కొంతవడి హ్లాదముబంచి నిమేషమున్ భళా!
  జాడను దెల్యకుండగనె జారెనె చేడియ! చిత్తచోరుడౌ
  వాడెవ డందువా? వెదకి పట్టుకొనం దగువాడు గాడుపో !

  రిప్లయితొలగించండి