3, అక్టోబర్ 2021, ఆదివారం

సమస్య - 3861

4-10-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పురుగుల భుజియింప రోగములు దొలఁగునులే”
(లేదా...)
“పురుగులఁ బ్రీతితోఁ దినినఁ బోవును రోగములంద్రు వెజ్జులే”

42 కామెంట్‌లు:

 1. రిప్లయిలు
  1. కందం
   దొరకక చూపుకు నవి యో
   గిరమున దోషమ్ముగూర్చి గిట్టఁగ జేయున్
   దొరకొని నిర్మూలించుచుఁ
   బురుగులఁ, భుజియింప రోగములు దొలఁగునులే

   చంపకమాల
   దొరకక చూపుకున్ క్రిములు దోషము గూర్చుచు నోగిరమ్మునన్
   బొరపడి తిన్నచో రుజకు మూలమునౌచును దీయు ప్రాణముల్
   త్వరపడి శ్రద్ధతో తగిన పద్ధతులందున నడ్డగించుచున్
   బురుగులఁ, బ్రీతితోఁ దినినఁ బోవును రోగములంద్రు వెజ్జులే

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి

 2. మిరియాలల్లము శోంఠియు
  కరివేపము కొత్తిమీర కాకరలవియే
  హరియించు రోగ కారక
  పురుగుల, భుజియింపరోగములు దొలగునులే.

  రిప్లయితొలగించండి
 3. పెరుగునుబాసిలసుమనకు
  పెరుగునుపులియంగబెట్టపెన్నిధికాగా
  అరుగునుజబ్బునుభయమున
  పురుగులభుజియింపరోగములుతొలగునులే

  రిప్లయితొలగించండి
 4. వరుసన నాల్గు దినములుగ
  గురిసిన వానలకు కృములు క్షోణి న పుట్టన్
  దరినున్న కోడి పెట్టలు
  పురుగుల భుజియింప , రోగములు దొలఁగునులే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.
   "వరుసను... క్షోణిని..." అనండి.

   తొలగించండి
 5. సమస్య :
  పురుగుల బ్రీతితో దినిన
  బోవును రోగములంద్రు వెజ్జులే

  (పొట్టకు చెందిన వ్యాధుల నివారణకు
  చైనాదేశంలోని వైద్యుల ఉవాచ )

  చంపకమాల
  -----------

  పొరుగున నున్న " చీన " గల
  పొట్టల వ్యాధుల పౌరులందరన్
  సరగున బిల్చి యౌషధము
  జక్కగ నిచ్చుచు మధ్యమధ్యలో
  విరివిగ జాగరూకతల
  వెల్లడి జేయుచు నందు రిట్టులన్
  “ బురుగుల బ్రీతితో దినిన
  బోవును రోగము " లంద్రు వెజ్జులే !

  రిప్లయితొలగించండి
 6. మఱిమఱి శోధించి మిగుల
  విరివిగ గన్పించు నట్టి విష కారక ముల్
  తిరముగ నిర్మూ లించుచు
  పురుగుల : భుజియింప రోగములు దొలగును లే !

  రిప్లయితొలగించండి
 7. రిప్లయిలు
  1. కరొనా వంటివి యంటును
   పురుగుల భుజియింప; రోగములు దొలఁగునులే
   కరివే పమొదలు, పసుపును
   మిరియము నల్లంబు తులసి మెండుగ వాడన్

   తొలగించండి
 8. చరములుచీమలందినినచంపగవచ్చుగరోగమంచునా
  వరమునచీనదేశమునపంతముతోడనుపెద్దలందరున్
  పురహరుపోలికన్లయముపూనికఁజేయగనిచ్చగింతురే
  పురుగులఁబ్రీతితోఁదినినఁబోవునురోగములంద్రువెజ్జులే

  రిప్లయితొలగించండి
 9. పురుగులు మిక్కిలి పెరిగిన
  పెరుగును వ్యాధుల విపత్తు విశ్వంబెల్లన్
  ధరలో పులుగులు కప్పలు
  పురుగుల భుజియింప రోగములు దొలఁగునులే

  రిప్లయితొలగించండి
 10. కర్ణుడి యావేదన: నిన్నటి పూరణము.

  కుదరదు రాజరాజ యిది ఘోర పరాజయ మోర్వలేను నే
  వదలక మేలు గోర నను వల్దనె, నర్థరథుండనౌదునే?
  ముదుసలి భీష్ముడిద్దినము మోసము నేర్పడ జెప్పె నిట్టులన్
  మొదటనె పండు జార్చుకొని ముద్దుగఁ దొక్క భుజింప మేలగున్.

  అరుదుగ క్రొత్తబియ్యమటు హానిని గూర్చు నవెప్పుడేనియున్
  తిరుగగ నారుమాసములు, తీపిగ దోచు నదెట్టులన్నచో
  పురుగులు నాకుటన్, గణికముల్ రుచియొప్పును,దీసి నా యిస
  ప్పురుగులఁ; బ్రీతితోఁ దినినఁ బోవును రోగములంద్రు వెజ్జులే.

  కణికము-గింజ

  రిప్లయితొలగించండి
 11. చంపకమాల:
  విరటుని గొల్వు నన్ నరుని పేరు బృహన్నల యౌటసత్యమే
  మరి 'ర'ల'యో రభేదమని మాన్యులు జెప్పగ మారునీవిధిన్
  విరివిగ యౌషధమ్ములుగ పిట్టల వాడుక సమ్మతమ్మదే
  “పురుగులఁ బ్రీతితోఁ దినినఁ బోవును రోగములంద్రు వెజ్జులే”!
  (పులుగులు =పక్షులు)
  -కటకం వేంకటరామశర్మ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "విరివిగ నౌషధమ్ములుగ" అనండి.

   తొలగించండి
  2. ధన్యవాదములార్యా!🙏.సరిచేసిన.
   చంపకమాల:
   విరటుని గొల్వు నన్ నరుని పేరు బృహన్నల యౌటసత్యమే
   మరి 'ర'ల'యో రభేదమని మాన్యులు జెప్పగ మారునీవిధిన్
   విరివిగ నౌషధమ్ములుగ పిట్టల వాడుక సమ్మతమ్మదే
   “పురుగులఁ బ్రీతితోఁ దినినఁ బోవును రోగములంద్రు వెజ్జులే”!
   (పులుగులు =పక్షులు)
   -కటకం వేంకటరామశర్మ.

   తొలగించండి
 12. ఒరవుగ  నవి చెడు పురుగుల
  సరిగొనుచు  మనయుదరమున సమముగ తిరుగన్
  విరివిగ  పెరుగున పెరిగిన
  పురుగుల భుజియింప రోగములు దొలఁగునులే

  రిప్లయితొలగించండి

 13. మరువకుమోయి సత్యమిది మాక్షిక మెంతటి మేలుగూర్చునో
  సరఘలు గూర్చునట్టి తరు శాఖల యందున హెచ్చుగాను మా
  ధురి గల తేనె గోరితిని తుట్టను తెమ్మిటు పారద్రోలుచున్
  బురుగులఁ, బ్రీతితోఁ దినినఁ బోవును రోగములంద్రు వెజ్జులే.

  రిప్లయితొలగించండి
 14. విరివిగ కప్ప నెల్కలను బేధములెంచక సర్వజీవులన్
  మురిపెము మీరగా దినెడు బుద్ధివిహీనుల చైన దేశమం
  దరుగ కరోనరోగమది తక్షణమే విషపూరితంబులౌ
  పురుగుల ప్రీతితో తినిన పోవును రోగములంద్రు వెజ్జులే

  పురుగులు = పాములు

  రిప్లయితొలగించండి
 15. పూరమున కొత్తవైద్యులసమూహము నందలివారి శోధనన్
  పురుగులఁ బ్రీతితోఁ దినినఁ బోవును రోగములంద్రు వెజ్జులే
  మరి పరివారమంతయును మానక
  వాటిని పట్టి మెక్కరే
  పరుల సమూహమందునను వార్తగ దీని గురించి దెల్పరే

  రిప్లయితొలగించండి
 16. చం:

  అరయగ మానవాళికట నాప్తిని గూర్చును సూక్ష్మ జీవులే
  కరణము నెల్ల వ్యాప్తి గొని కారణభూతము స్వాస్థ్యమొందగన్
  వరమగుటెంచి గైకొనిన వాస్తవమౌనగు బాకుటీరియా
  పురుగుల బ్రీతితో దినిన బోవును రోగములంద్రు వెజ్జులే

  కరణము=శరీరము
  బాకుటీరియా=Bacteria

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 17. వెరవుగ సేంద్రియపుటెరువు
  మరువక పంటకు పురుగులమందులు వేయన్
  సరగున నిర్మూలించును
  పురుగుల, భుజియింప రోగములు దొలఁగునులే

  రిప్లయితొలగించండి
 18. వెరవుగ పంటభూములకు వేయగ సేంద్రియ గొబ్బరమ్ములన్
  మరువక చీడపీడలకు మాన్యపు మందులు చల్లినంతటన్
  సరగున నాణ్యమైన ఫలసాయమువచ్చు తొలంగ జేయగన్
  పురుగులఁ ,బ్రీతితోఁ దినినఁ బోవును రోగములంద్రు వెజ్జులే

  రిప్లయితొలగించండి
 19. నరులకు దేవుని వరమే
  ధరలోఁ జరియించు పక్షి తండము లెంచన్
  మరలఁగ వఱదయె కాకులు
  పురుగుల భుజియింప రోగములు దొలఁగునులే


  రురునయనా! నిజం బరయ రోగ నిరోధక దివ్య శక్తియే
  మురియుచుఁ గొద్దిగాఁ బసుపుఁ బుచ్చుకొనంగఁ బెరుంగు సంతతం
  బరుగక వైద్య శాలలకు నల్లముఁ గొంచెము చంపఁ గుక్షిలోఁ
  బురుగులఁ బ్రీతితోఁ దినినఁ బోవును రోగము లంద్రు వెజ్జులే

  రిప్లయితొలగించండి
 20. కరమును వాంతులు వచ్చును
  పురుగుల భుజియింప,రోగములుదొలగునులే
  సరియగు మందులు వాడిన
  నరియానా!నీగురించె యర్ధంబాయెనె?

  రిప్లయితొలగించండి
 21. పురుగుల బ్రీతితో దినిన బోవును రోగములంద్రు వెజ్జులే
  యెఱుగను నెప్పుడెక్కడను నిట్టిది చిత్రపు మందుజెప్పిరే
  యరయగ సత్యమిందున నిహారిక! యెక్కడలేని పుర్వులన్
  త్వరితమనంబుతోడనిక తర్కముజేయక వెజ్జుకీయుమా

  రిప్లయితొలగించండి
 22. కందం
  విరివిగ ప్రావృట్కాలం
  బు రోజులన్ వెల్గు దీపపు రుచికి జననం
  మరణం బొందు ఉసుళ్ళన్
  పురుగులు భుజియింప రోగములు దొలగునులే.

  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటర్
  ఉసుళ్ళు లేక ఇసుళ్ళు అని కూడా పిలుస్తారు.
  కొందరు అవి ఆహారముగా గ్రహిస్తారు.ఆవిషయము దృష్టిలో యుంచుకొని వ్రాసిన పద్యం.

  రిప్లయితొలగించండి
 23. మిరియపు గింజలున్ బసుపు మెత్తని చూర్ణము జేసి దానిలో
  దురిమిన బెల్లమున్ గలుప దోసములన్ తొలగించునందురా
  సరియగు మందు గూర్చునట స్వాస్థ్యము, మాపునజీర్ణకారులౌ
  పురుగులఁ, బ్రీతితోఁ దినినఁ బోవును రోగములంద్రు వెజ్జులే

  రిప్లయితొలగించండి