30, అక్టోబర్ 2021, శనివారం

సమస్య - 3887

31-10-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పాయసముం గొనిన సంతుఁ బడయుదు రెటులో"
(లేదా...)
"పాయసముం దమిం గొనిన వారికి సంతు లభించు టెట్టులో"

51 కామెంట్‌లు:

  1. చేయునువింతలుదేవుం
    డీయగజన్మంబరయగఠీవినిస్రుష్టిన్
    హాయననాశ్చర్యంబన
    పాయసముంగోనినసంతుఁబడయుదురెటులో

    రిప్లయితొలగించండి
  2. ప్రాయము దాటిన సతులకు
    సాయము జేయంగదలచి సాధువొకండున్
    మాయపు మాటలవిని యా
    పాయసముం గొనిన సంతుఁ బడయుదు రెటులో!!

    రిప్లయితొలగించండి
  3. పాయనిజన్మబంధములుపట్టుచులాగగజీవుడంతలో
    తోయమునన్నమున్దినినతోడుతఁజేరునుతల్లిదండ్రులన్
    మాయగదోచునీవిధముమాటునదేవునిమర్మమేమిటో
    పాయసముందమింగోనినవారికిసంతుగలుంగుటెట్టులో

    రిప్లయితొలగించండి
  4. తీయని మాటల తోడను
    వేయి విధమ్ములనొకండు విదితము గాగన్
    మాయలు జేయును గాదే
    పాయసముo గొనిన సంతు బడయుదురెటు లో?

    రిప్లయితొలగించండి


  5. మాయయ దేమిటొ తెలుపుము
    జాయా! శిశువెట్లు దొరకు శాకినముననన్
    తోయలి నవ్వుచు నడిగెను
    పాయసముంగొనినసంతుఁ బడయుదు రెటులో.

    రిప్లయితొలగించండి

  6. మాయ యదేమొ తెల్పుమని మాన్యుడు రాముడు కోరెనిట్లుగా
    జాయను, సూనలెవ్విధిని శాకినమందు లభింతురో యనన్
    బ్రేయసి సీత తానడిగె పెన్మిటి నిట్టుల హాస్యమాడుచున్
    బాయసముందమిం గొనిన వారికి సంతుగలుంగు టెట్టులో.

    రిప్లయితొలగించండి
  7. రిప్లయిలు
    1. తోయదు మదికిన్ జెప్పగ
      పాయసముం గొనిన, సంతుఁ బడయుదు రెటులో?
      వాయసమును తెలుపున గని
      రాయిని గొనికొట్ట,కూలె,రండన్నట్లే!

      తొలగించండి
  8. కందం
    తీయగ నడిగెను రాముని
    జాయ ధరణిసుత వెఱన నిజమనుచు వింటిన్
    తోయజలోచనులందరు
    పాయసముంగొనిన సంతు బడయుదు రెటులో?

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.
    వెఱ-ఆశ్చర్యం

    రిప్లయితొలగించండి
  9. మాయల యోగి యొక్కడునమాయకు
    లంగడు మోసగించుచున్
    బాయసమమ్ముచుండె నది భామలు
    సంతతి లేని వారలున్
    బాయక తిన్నచో గలుగు భాసుర
    సంతని చెప్పుచుండె నా
    పాయసముందమింగొనిన వారికి
    సంతు గలుంగునెట్టులో!

    రిప్లయితొలగించండి
  10. కందం
    నాయన పొలమ్ము దున్నఁగ
    తోయలి జనియించె ననుచు దూరెడురామున్
    బాయక యనెఁ గుజ "తల్లులు
    పాయసముం గొనిన సంతుఁ బడయుదు రెటులో?"

    ఉత్పలమాల
    "ఓయమ! భూమి దున్నగనె యొప్పుల కుప్పవు గల్గితెట్లు సీ
    తా!" యని రామచంద్రుఁడనఁ దగ్గక మానిని పల్కెనిట్లు" నా
    థా! యినవంశరాజమ! గతంబున వింటి నయోధ్య సీమలో
    పాయసముం దమిం గొనిన వారికి సంతు గలుంగు టెట్టులో?"

    రిప్లయితొలగించండి
  11. వాయసమేవిధి పిండముఁ
    బాయక ప్రేతాత్మకిడును బలిహరణముగా
    ప్రాయము మీరినపిమ్మట
    పాయసముం గొనిన సంతుఁ బడయుదు రెటులో

    రిప్లయితొలగించండి
  12. జాయసహితులై కఠుతర
    మౌ యాగమ్ములు సలుపుచు మంత్రఫలంబౌ
    కాయను పండును దొరకొను
    పాయసముం గొనిన సంతుఁ బడయుదు రెటులో

    రిప్లయితొలగించండి
  13. వివాహానంతరం సీతారాముల వేళాకోళము.

    హాయిగ సీతతోడ నపహాసము లాడుచు బల్కెరాముడే,
    తోయజ నేత్రులీ భువిని దున్నిన శీఘ్రమె సంక్రమింతురే?
    మాయురె! భూవరా! మరి యమాంతము కోసల రాజ్యమందునన్
    పాయసముం దమిం గొనిన వారికి సంతు గలుంగు టెట్టులో?

    రిప్లయితొలగించండి
  14. హాయిని పొందును నాలుక
    పాయసముం గొనిన ; సంతుఁ బడయుదు రెటులో
    తాయి జనకులొకరికొకరు
    పాయుచు వేరుగ వసించు పద్ధతి నుండన్

    రిప్లయితొలగించండి
  15. వేయక ప్రశ్నలు త్రాగుము
    తీయని  పానకమిది క్రిత త్రేతా యుగమున్
    ఖాయమది రామ కథకును
    పాయసముం గొనిన సంతుఁ బడయుదు రెటులో

    (శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవములో ప్రసాద పానకమిస్తూ పిల్లవాని  ప్రశ్నకు  తల్లి సమాధానము)

    రిప్లయితొలగించండి
  16. ఆయువు తీరినంతనె నిరామయ దేహము కుప్పకూలగా
    వాయసమెవ్విధిన్ పిడచబాయక గైకొని ప్రేతకిచ్చునో
    ప్రాయము మీరగన్ కుసుమబాణము త్రాణము నెట్టులిచ్చునో,
    పాయసముం దమిం గొనిన, వారికి సంతు గలుంగు టెట్టులో

    రిప్లయితొలగించండి
  17. ప్రేయసి! క్షేత్రమందునను పేటిక బిడ్డలభించె వింతగా
    రాయని కంచుఁ బల్కగను రాముడు, సీత వచించె గోముగా
    రాయి పదంపు రేణువులఁ బ్రాణము గల్గి పడంతి యెట్లగున్ ?
    పాయసముం దమిం గొనిన వారికి సంతు గలుంగు టెట్టులో?

    రిప్లయితొలగించండి
  18. ఈయగ మునిమం త్రించిన
    పాయసముం గోనిన సంతుబడయుదు,రెటులో
    కాయది యొక్కటి కాచిన
    మాయును గొడ్రాలమచ్చ మమతను బెంచున్

    రిప్లయితొలగించండి
  19. రిప్లయిలు
    1. పాయని రోగముల్ గలిగి భవ్యత పోవును దప్పకుండగన్
      పాయసముం దమింగొనువారికి,సంతుగలుంగు టెట్టులో
      యాయమ నేర్వకన్ మిగుల నాత్రుత నొందుచు దైవపూజలన్
      బాయక చేయుచుండె నిక బార్వతి చల్లగ చూచుటెప్పుడో

      తొలగించండి
  20. మాయని భక్తి తత్పరత మాధవు నమ్ముచు నెమ్మనమ్మునన్
    పాయసముం దమిం గొనిన వారికి సంతు గలుంగు గాని గో
    మాయువులౌచు పాపముల మానక నాస్తికులై చరించుచున్
    పాయసముం దమిం గొనిన వారికి సంతు గలుంగు టెట్టులో

    రిప్లయితొలగించండి
  21. ఏ యెడ నయిన వివాహ
    ప్రాయ సముం గైకొనుమ యుపాయము చేతన్
    వే యేల మాట లవి పా
    పా యసముం గొనిన సంతుఁ బడయుదు రెటులో


    ఈయది త్రేత నా యుగమె యెవ్వరు గాంతురు ఋష్యశృంగునిం
    దోయజ లోచనుండు దయతో ధరఁ బుట్టునె సంప్రదించి వే
    పాయక వైద్య సత్తముని వంధ్యత కింపగు మందు వాడకే
    పాయసముం దమిం గొనిన వారికి సంతులు గల్గు టెట్టులో

    రిప్లయితొలగించండి
  22. .ఉ:

    ఖాయము చూలు కల్గుటయు కాలపు రీతిని కృత్రిమంబుగన్
    ప్రాయము మీర ధారణకు భౌతిక సామ్యము బొందకుండగా
    హేయము గాదు నొప్పనిది హే! రఘు రాముడు పుట్టు వైనమై
    బాయసముం దమిం గొనిన వారికి సంతు గలుంగు టెట్టులో!

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి