23, అక్టోబర్ 2021, శనివారం

సమస్య - 3880

24-10-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నీరసపద్యమ్మె మేలు నిక్కముగఁ గవీ”
(లేదా...)
“నీరసమైన పద్దియమె నిక్కముగా స్తుతిపాత్రమౌఁ గవీ”

29 కామెంట్‌లు:

 1. కందం
  ప్రేరేపింపగ రామయ
  వారిజ నేత్రునిఁ బొగడుచు భాగవతమునన్
  దీరిచితే! బోతన మన
  నీ రసపద్యమ్మె మేలు నిక్కముగఁ గవీ!

  ఉత్పలమాల
  ప్రేరణ రామచంద్రుఁడని వేడుకఁ గూర్చుచు పద్యకావ్యమున్
  శారదమాత భాష్పముల జార్చక జూచుచు భక్తిభావనన్
  దీరిచితే! తరించితిమి దివ్యమహాంజలిఁ బోతనార్యుఁడా!
  నీ రసమైన పద్దియమె నిక్కముగా స్తుతిపాత్రమౌఁ గవీ!

  రిప్లయితొలగించండి
 2. ధారగ పదములు కుదురుచు
  సారపు భావాలు గలిగి సరసుల మదికిన్
  తోరపు హాయి నొసంగెడు
  నీ రస పద్యమ్మె మేలు నిక్కము గ గ వీ !

  రిప్లయితొలగించండి
 3. పారంబంటకతలపడి
  వీరావేశముగనపడువేడ్కనుమదిలో
  పోరామిసరససంగతి
  నీరసపద్యమ్మెమేలునిక్కముగఁగవీ

  రిప్లయితొలగించండి
 4. వీర భయ రౌద్రమున్ శృం
  గారాద్భుతహాస్య కరుణ కానంబడవా
  నీ రసమే భీభత్సము
  నీ రసపద్యమ్మె మేలు నిక్కముగఁ గవీ

  రిప్లయితొలగించండి
 5. ధారనుజాలువార్చిమదితాండవమాడెడివాగ్విజృంభణన్
  కూరిమిమీరవృత్తులనుకూర్చినరీతినిభావగుంభనన్
  చేరినచిద్విలాసములచేతనయందునద్రాక్షపండగా
  నీ’రసమైనపద్దియమెనిక్కముగాస్తుతిపాత్రమౌగవీ

  రిప్లయితొలగించండి


 6. చేరిన నేమిసన్నిధికి చింతలు బాపవు దర్శనమ్మునే
  కోరిన కోర్కెదీర్చవని కోపముతో పలు కావ్యముల్ భవున్
  గూరిచి యాలిఖించితివి కోవిద శ్రేష్ఠుడ తప్పుబట్టబో
  నీరస మైన పద్దియమె నిక్కముగా స్తుతిపాత్రమౌ గవీ.


  {పోను+ ఈరస= పోనీరస (ఈరస = కోపము)}

  రిప్లయితొలగించండి

 7. కోరగలేను కోరికలు కూరిమిజూపిన జాలటంచు కే
  దారుని భక్తితోడ సతతమ్ముభజింతు నటంచు నార్తితో
  వారుని కీర్తిసేయు నొక భక్తిరసాన్విత కావ్యమందునన్
  నీ రసమైన పద్దియమె నిక్కముగా స్తుతి పాత్రమౌ గవీ

  రిప్లయితొలగించండి

 8. నోరారబిలువ నేమిర?
  వారుడు కరుణింప రాడు బండయటంచున్
  దూరినను తప్పనగలే
  నీరస పద్యమ్మెమేలు నిక్కముగఁ గవీ.

  {లేను+ఈరస= లేనీరస (ఈరస= కోపము)}

  రిప్లయితొలగించండి
 9. ధారుణి యందు సత్కవులు తథ్యము
  వ్రాసిరి పద్య కావ్యముల్
  భారత కావ్య రాజమది ప్రస్తుతి
  గాంచెను గాని పోతనా!
  నీ రసమైన పద్దియమె నిక్కము
  గా స్తుతి పాత్రమౌ కవీ !
  సారెకు సారెకుంజదువ సజ్జన
  లెల్లరు గోరుకొందురే

  రిప్లయితొలగించండి
 10. ఉ:

  ఏ రసమైన నేమి మది కింపుగ తోచెడు పద్య రాజముల్
  భారమె వ్రాయుటంచు పలు పండిత వర్యులు వ్రాయ బూనగన్
  పూరణ జూచి నీరసము పూర్ణ మటంచు లిఖించ వేగమై
  నీరసమైన పద్దియము నిక్కముగా స్తుతి పాత్రమౌ గవీ

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 11. నీరవ నిశీధియందున
  నీరజనాభుని గొలువగ నిశ్చల భక్తిన్
  నీరచనామృత ఝరియగు
  నీ రసపద్యమ్మె మేలు నిక్కముగఁ గవీ

  రిప్లయితొలగించండి
 12. ఆరాటమొందె బొగడగ
  నీరస ; పద్యమ్మె మేలు నిక్కముగఁ గవీ
  వారును పండితులెకదా !
  తీరును కౌతుకములన్ని దెగువ నిలుపగన్

  రస = నాలుక

  రిప్లయితొలగించండి
 13. వారెవ! శ్రేష్ఠమైన కవివర్యుడ వంచును మెచ్చినట్టి నా
  పౌరులె మాలవాడవని ప్రక్కకుబోవగ క్రుంగిపోక య
  ద్దారుణ వర్ణబేధమను దౌష్ట్యము నంతము జేసెడిన్గృషిన్
  నీ రసమైన పద్దియము నిక్కముగా స్తుతిపాత్రమౌ కవీ!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆరవ తరగతి జదివిన
   ధీరుడు గద్దియనునెక్క దీవెనలీయన్
   శూరుడు వీరుండను నొక
   నీరస పద్యమ్మె మేలు నిక్కముగ కవీ!

   తొలగించండి
 14. కందము:
  పూరణసేయగ వలెనని
  కోరిక బహులెస్స! చదువు కొదువ గణించన్।
  సారముకై వ్యధచెందక
  *నీరసపద్యమ్మె మేలు నిక్కముగఁ గవీ* ”
  --కటకం వేంకటరామ శర్మ.

  రిప్లయితొలగించండి
 15. ఉత్పలమాల:
  సారమొకింతలేని చవిఁ జచ్చిన హాస్యము లాడు వారకున్
  జారుడు బట్టలందు దిగ జారెడు నృత్యమె మెప్పు పొందగన్
  సూరన రామకృష్ణ కవి సోమన జాషువ నెవ్వరో యనన్
  “నీరసమైన పద్దియమె నిక్కముగా స్తుతిపాత్రమౌఁ గవీ”
  ---కటకం వేంకటరామ శర్మ.

  రిప్లయితొలగించండి
 16. సమస్య :

  నీరసమైన పద్దియమె
  నిక్కముగా స్తుతిపాత్రమౌ గవీ

  ( గజనీమహమ్మదు ఫిరదౌసీకవి చేత షానామా అనే కావ్యం వ్రాయించుకొని అరవైవేల బంగారు నాణేలకు బదులుగా వెండి నాణేల నివ్వబోయాడు . పైగా కుకవుల చాడీలు నమ్మి శిక్షించబోతే కవి తన పుత్రికతో రాజ్యం వీడిపోయాడు . దారిలో తండ్రిని ఓదారుస్తూ కూతురు అంటున్నది.)

  ఉత్పలమాల
  ...................

  నారస మేసినట్టులయె
  నాయన ! ' షానమ ' వ్రాసినట్టి నీ
  ధీరకవిత్వవైభవము
  దిన్నగ మెచ్చక వెళ్లగొట్టెనే
  కారుణికత్వశూన్యుడయి
  కల్మషబుద్ధి మహమ్మదుండయో !
  నీ - రసమైన పద్దియమె
  నిక్కముగా స్తుతిపాత్రమౌ గవీ !

  ( ఈ ఆర్ద్రగాథనే జాషువా మహాకవి 'ఫిరదౌసి' అనే కావ్యంగా రచించారు )

  రిప్లయితొలగించండి
 17. రిప్లయిలు
  1. నీరస మునకున్ "నీ" చీ
   నీ రస పద్యమ్మె మేలు; నిక్కముగఁ గవీ!
   తీరుగ వ్రాసితి వందున
   మీరగ "సీ" విటమిను గల పెన్నిధి యనుచున్.

   తొలగించండి
 18. ధారుణి సంపదల్ గొన వితండపుఁ గైతలఁ జెప్పి రెందరో
  సారవిహీన కైతలవి సంతస మిచ్చునె యెంచి చూడగా?
  తీరుచు దాహమున్ సతము తీరగు భక్తి విరాజితమ్ముగా
  నీ రసమైన పద్దియమె నిక్కముగా స్తుతిపాత్రమౌఁ గవీ

  రిప్లయితొలగించండి
 19. మూరెడు మాటలున్ మధురమోహన ముగ్ధపు భావనల్ సుగం
  భీరపు టర్థమున్ గలిగి పేర్కొనుటన్ కడు ప్రాకృతంబె గా
  నీ, రసమైన పద్దియమె నిక్కముగా స్తుతిపాత్రమౌఁ గవీ
  సారమునంతయున్ సహజ సామ్యముతో వడగట్టితీ వహో౹౹

  రిప్లయితొలగించండి
 20. నీరసమైన పద్దియము నేస్తముగా మన నేర్వ దెన్నడున్
  బ్రేరణ నీయ జాలకయె పేలవమౌచు నశాశ్వతమ్ముగున్
  జారుతరంబుగా బ్రతుకు సారము దెల్పెడి నిత్య పాఠమౌ
  నీ రసమైన పద్దియమె నిక్కముగా స్తుతిపాత్రమౌఁ గవీ

  రిప్లయితొలగించండి
 21. చేరిరి చుట్టము లింటను
  వారము గడచినను కూడ వారు వెడలరే
  వారిని బయటకు పంపగ
  *నీరస పద్యమ్మె మేలు నిక్కమ్ముగ కవీ*!

  ద్వారకానాథ్

  రిప్లయితొలగించండి
 22. సారవిహీనమైన పద సంచయమెట్టుల వాసికెక్కునా
  నీరసమైన పద్దియమె; నిక్కముగా స్తుతిపాత్రమౌఁ గవీ
  తారసిలంగ పద్యము సుధారస ధారగ భావయుక్తమై
  చారుతరంబుగానమర ఛందపు సౌరు సలక్షణంబుగా

  రిప్లయితొలగించండి
 23. వారని దీక్ష వహించి య
  పార కవిత్వ సపటుత్వ పద గుంభన మే
  పారంగన్ రచియించిన
  నీ రస పద్యమ్మె మేలు నిక్కముగఁ గవీ


  శారద చంద్రికా ధవళ సన్నిభ శుద్ధ దళాంతరమ్మునన్
  నీరద వర్ణ తుల్య కమనీయ వరాక్షర రాజితమ్మునౌ
  నీ రమణీయ శబ్ద చయ నిర్మిత రమ్య రసీ కృతేద్ధ త
  న్నీరసమైన పద్దియమె నిక్కముగా స్తుతిపాత్రమౌఁ గవీ

  రిప్లయితొలగించండి
 24. ప్రేరకమౌచు జగంబున
  క్రూర వికారముల రేపు కూతల కన్నన్
  తీరగు మాటల గూర్చిన
  నీరసపద్యమ్మె మేలు నిక్కముగఁ గవీ

  రిప్లయితొలగించండి
 25. శ్రీరమ యేగనెన్ దయగ, శ్రీకరి గానిను బ్రోచెగా నిలన్
  సారము వర్షమై కురిసె సంతసమొందెను మానసం బుగా
  మీరిన చాతురంబు మిది మిక్కిలి ప్రీతికరంబుగానిలున్
  నీ రసమైన పద్దియమె నిక్కముగా స్తుతిపాత్రమౌఁ గవీ

  రిప్లయితొలగించండి
 26. కందం
  జోరుగ హోరుగ వినబడు
  బారిగొనేటి సినిమాల పాటల కన్నా
  ఓరిమి తో విన దగు, నా
  నీరస పద్యమ్మె మేలు నిక్కముగ గవీ
  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటర్.
  బారిగొనేటి-హింసించేటి

  రిప్లయితొలగించండి
 27. సారము లేనట్టి దయిన చక్కని కంఠము గల్గియుండగా
  పారము జేరగా వలెను ప్రాపును గొంచుచు పేరుగాంచగన్
  నీరసమావహించు గద నెమ్మది మీదట తెల్యబోదటో
  నీ రసమైన పద్దియమె నిక్కముగా స్తుతిపాత్రమౌఁ గవీ!


  రిప్లయితొలగించండి