28, అక్టోబర్ 2021, గురువారం

సమస్య - 3885

29-10-2021 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఖండిత శీర్షములు నవ్వె కదనతలమునన్”
(లేదా...)
“ఖండిత శీర్షగుచ్ఛము పకాలున నవ్వెను యుద్ధభూమిలో”

58 కామెంట్‌లు:

 1. చండ తర పరాక్ర మమున
  భండన మొనరించు వేళ పగతుర బలమే
  మెండని వెను దిరుగు ట గని
  ఖండిత శీర్షములు నవ్వె కదన తలమునన్

  రిప్లయితొలగించండి
 2. కండలగర్వముపోయెను
  దండిగరామునిశరములదాడియుశుభమే
  పండుగగాదేమనకన
  ఖండితశీర్షములునవ్వెకదనతలమునన్

  రిప్లయితొలగించండి
 3. సమస్య :

  ఖండిత శీర్షగుచ్ఛము ప
  కాలున నవ్వెను యుద్ధభూమిలో

  ( బొబ్బిలి పాలకుడైన రంగారాయనిపై యుద్ధా
  నికి ఫ్రెంచివారి నాహ్వానించిన విజయరామరాజు దురాగతాన్ని అవహేళన చేస్తున్న వీరుల తలలు )

  మొండిగ రంగరాయనిని
  ముప్పుల పాలొనరింప జూచితే
  రండని బుస్సి హైదరుల
  రాణువ బిల్చిన రామరాజ ! నీ
  చుండవు ; రేపు నీగతియు
  చూడగ నిట్లగు నంచు హేళనన్
  ఖండిత శీర్షగుచ్ఛము ప
  కాలున నవ్వెను యుద్ధభూమిలో.

  ( బుస్సి - ఫ్రెంచి దొర ; హైదరు - హైదర్ జంగ్ ;రాణువ - సైన్యము )

  రిప్లయితొలగించండి
 4. భండనమందున పగతుర
  దండిగ పరిమార్చి నట్టి ధండధరుని తో
  మొండెముల నేలుకొమ్మని
  ఖండిత శీర్షములు నవ్వె కదనతలమునన్.

  రిప్లయితొలగించండి
 5. మెండుగలోకమందుననుమేలగుధర్మముకాంతిహీనమై
  పండగపాపకర్మములుభారతయుద్ధముదాపురించెనే
  కుండనుబోలుజీవితముకూలునునిత్యముసత్యమంచనన్
  ఖండితశీర్షగుచ్ఛముపకాలుననవ్వెనుయుద్ధభూమిలో

  రిప్లయితొలగించండి
 6. కందం
  భండన భీముడు రాముడు
  ఖండించెను రావణ దశ కంఠములనిలో
  మొండెము పై మొలకెత్తిన
  ఖండిత శీర్షములు నవ్వె కదన తలమునన్

  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటర్

  రిప్లయితొలగించండి

 7. దండిగ రాజ్యకాంక్షగల దండధరుండు రణమ్ముకోసమై
  దండును ద్వేష్టిపై నడిపి దందడియందున శత్రు సేనలన్
  చెండె శవాలకుప్ప జయశీలుని మొండెము లేలమంచు నా
  ఖండిత శీర్షగుచ్ఛము పకాలున నవ్వెను యుద్ధభూమిలో.

  రిప్లయితొలగించండి
 8. కందం
  దండుగ కౌరవ సైన్యము
  పాండవ పక్షమ్ము పైకి వైచఁగ శరముల్
  చెండగ తప్పించుకొని య
  ఖండిత శీర్షములు నవ్వె కదనతలమునన్

  ఉత్పలమాల
  మొండిగ రావణాధముఁడు పోరుకు నెంచగ రాఘవుండు కో
  దండ పరాక్రముండనఁగఁ తారకరాముడు విక్రమింపఁగన్
  మెండుగ రాలుచున్ భువికి మీదట మొండెముకంటు మాయతో
  ఖండిత శీర్షగుచ్ఛము పకాలున నవ్వెను యుద్ధభూమిలో!

  రిప్లయితొలగించండి
 9. భండన భూమిలోన నిరు పక్షపు
  సైన్యము బోరుచుండగా
  దండిగ సైన్య కంఠములు ధాత్రిని
  గూలెను, రాజ్య కాంక్షులీ
  గుండెలు లేని రాజులును గూలదు
  రంచును మా విధంబుగా
  ఖండిత శీర్షగుచ్ఛము పకాలున
  నవ్వెను యుద్ధ భూమిలో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   '...గూలుదు రంచును' టైపాటు.

   తొలగించండి
 10. "కొండలు పిండిజెసెదను కొట్టెద తిట్టెద కౌరవాదులన్
  నిండుగ నాదు శౌర్యమును నిర్భరతన్ గను మో బృహన్నలా!"
  వెండి ప్రగల్భముల్ బలుకు వెర్రిని"నుత్తరు"గేలి సేయుచున్
  ఖండిత శీర్ష గుచ్చము పకాలున నవ్వెను యుధ్ధ భూమిలో.

  రిప్లయితొలగించండి
 11. గండరగండడై కదన కౌతుకమొప్పగనాజి యందును
  ద్దండ పరాక్రమంబెసఁగ దారుణ మారణకాండ సల్పుచున్
  చండగదా ప్రహారముల శౌర్యముఁజూపుచు విక్రమింపగన్
  ఖండిత శీర్షగుచ్ఛము పకాలున నవ్వెను యుద్ధభూమిలో

  రిప్లయితొలగించండి
 12. భండనమందున వైరుల
  చండాడుచునూచకోత సలుపుచు తుదకున్
  మొండెములు వేరుకాఁగా
  ఖండిత శీర్షములు నవ్వె కదనతలమునన్

  రిప్లయితొలగించండి
 13. గాండీవి తన గెలుపుతో
  మెండగు తృప్తిని బడయక మృతదేహములే
  గుండెను పిండగ తలచెన్
  ఖండిత శీర్షములు నవ్వె కదనతలమునన్

  రిప్లయితొలగించండి
 14. కొండొక దేశము పయి నీ
  దండిని జూపించ నెంచి దగవును సలుపన్
  పండె నొక వల్లకాడని
  ఖండిత శీర్షములు నవ్వె కదనతలమునన్

  రిప్లయితొలగించండి
 15. చెండతర రామచంద్రుడు
  మొండెము పై నుండు తలలు మొత్తము దునుమన్.
  మండే కన్నుల, రావణు
  ఖండిత శీర్షములు నవ్వె, కదనతలమునన్

  రిప్లయితొలగించండి
 16. రిప్లయిలు
  1. ఎదురుగ నిలచిన పది తలలు గల రా
   వణుని రూపము‌ గని రణము‌ నందు

   వెరవక శరమును శిరముపై వదలగ
   తెగి పుడమికి చేరి తిరిగి చేరె

   మరల నతికె దేహమందు, నివ్వెర పోయి
   శరములను వదల మరల మరల

   నతికి కాయమున ఖండిత శీర్షములు నవ్వె
   కదన తలమునన్ పక పక మనుచు,

   భీతి చెందుచు నుండ, విభీషణుండు

   రాముని చెవిలో తెలిపెను రావణుని హృ

   దయమున నమృత‌ భాండము‌ దాగి యుండె

   శరము వదలి పగుల గొట్ట చచ్చు నంచు

   తొలగించండి
  2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ఒకటి రెండు సవరణలు వాట్సపు సమూహంలో సూచించాను.

   తొలగించండి
 17. చండ పరాక్రమమ్మునను శౌర్యధనుండగు రామచంద్రు డా
  భండన మందునన్ జలగి వైరి శిరమ్ములఁ ద్రుంచు చుండగా
  గండర గండలౌ రిపులు కాంచగ మృత్యువు, దక్కు ముక్తికై
  ఖండిత శీర్షగుచ్ఛము పకాలున నవ్వెను యుద్ధభూమిలో

  రిప్లయితొలగించండి
 18. చండాశోకుండపుడా
  భండనమున వృద్ధురాలి వ్యథ గని దా ఖి
  న్నుండై వీడగ హింసన్
  ఖండిత శీర్షములు నవ్వె కదనతలమునన్

  రిప్లయితొలగించండి
 19. "మొండివొ! జానకీసతిని మోహవశమ్మున లంక దెత్తి వు
  ద్ధండత గర్హ్యమై దగు నధర్మపథమ్మున రావణా! సుధా
  భాండఫలమ్మిదా?" యనుచు ప్రాకటదుఃఖగళప్రభిన్నమై
  ఖండితశీర్షగుచ్ఛము పకాలున నవ్వెను యుద్ధభూమిలో

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 20. మొండిగ ప్రతినను పూనగ
  దండన నిచ్చిన పగిదిన దయయే లేకన్
  మొండెముల మిగల్చగనట
  ఖండిత శీర్షములు నవ్వె కదనతలమునన్ !!

  రిప్లయితొలగించండి
 21. మొండిగ కృష్ణుపైననటు మూర్ఖుని పోలెను కాలుదువ్వగన్
  పండిన పాపలెఖ్ఖలవి పక్వము జెందగ దూషణమ్ముతో
  చండప్రచండుడై చెలగి చక్రము వేయగ ముక్తినిచ్చుచున్
  ఖండిత శీర్షగుచ్ఛము పకాలున నవ్వెను యుద్ధభుమిలో!!

  రిప్లయితొలగించండి
 22. భండనభీముడు రాముడు
  చండశరాఘతి శిరంబు జక్కడచిన వే
  రొండు జనించుచు రావణు
  ఖండిత శీర్షములు నవ్వె కదనతలమునన్

  రిప్లయితొలగించండి
 23. మండఁగ డెందము నిప్పుల
  గుండ మన నశోకుఁడు ఘటికుఁడు నెగ్గిన రా
  గండఁడు కలఁతను జూడఁగ
  ఖండిత శీర్షములు నవ్వెఁ గదన తలమునన్


  మెండుగఁ బొందఁగా జయము మీఱిన యాజిని రత్న మౌళి స
  న్మండిత మూర్ధ పంక్తి నర మాన్య ప రార్చిత మస్త రాజముల్
  ఖండిత దుఃఖ సంచయము ఖండిత శత్రు శిరో విరాజి తా
  ఖండిత శీర్షగుచ్ఛము పకాలున నవ్వెను యుద్ధభూమిలో

  [విరాజిత + అఖండిత= విరాజి తాఖండిత]

  రిప్లయితొలగించండి
 24. ఖండిత మగునే యరి శిర
  ఖండన మిరువురికి మోక్ష కరమది నీతిన్
  దుండగ మరికి నశమమని
  ఖండిత శీర్షములు నవ్వె కదనతలమునన్

  (ధర్మయుద్ధంలో  నిశ్చయ శత్రు మరణం ఇద్దరికీ మోక్షకరమే.
  దుండగంతో చంపినపుడు చంపినవాడు పాపగతి పొందుతాడాని మరణించిన తలలు నవ్వాయను యర్థంలో వ్రాయడమైనది;
  మొదటి పాదంలో ఖండితము : నిశ్చయము
  3వ పాదము: దుండగము +అరికిని +అశమమని)

  రిప్లయితొలగించండి
 25. ఉత్పలమాల:
  రండి। పరేతభూములివి రాజ్యము నేలగ రండి రాజ! మీ
  భండన కాంక్ష మా సతుల
  బంగరు పుస్తెలు మంటగల్పెనే
  పండుగ జేయుడింక బలవంతులు మీరని విస్తుఁబోవుచున్
  “ఖండిత శీర్షగుచ్ఛము పకాలున నవ్వెను యుద్ధభూమిలో”
  --కటకం వేంకటరామ శర్మ.

  రిప్లయితొలగించండి