1, అక్టోబర్ 2021, శుక్రవారం

సమస్య - 3859

2-10-2021 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గాంధి పుట్టిన దినమని కలతపడుము”
(లేదా...)
“కలతపడంగ నొప్పు గద గాంధి జనించిన యిద్దినంబునన్”

32 కామెంట్‌లు:


  1. విందు నిచ్చెద రమ్మని బంధువొకడు
    పిలిచెననుచును మురిసెడి ప్రియుని తోడ
    మధువు మాంసముండవనుచు మగువ పలికె
    గాంధి పుట్టిన దినమని కలత పడుము.

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    మద్యపానమ్ము మానంగ మంచిదనుచు
    జాతి పితగఁ దా బోధించ రీతి విడచి
    వారి విగ్రహఁపున్ నీడ సారనమ్మ
    గాంధి పుట్టిన దినమని కలతపడుము!

    చంపకమాల
    తెలివిని ద్రుంచి రాక్షసుని తీరుగ మార్చెడు మద్యపానమున్,
    వెలుగులు పంచ జాతిపిత వీడమటంచును బోధఁ జేసినన్
    నిలుపఁగ వారి విగ్రహము నీడన నంగడి నమ్మ మద్యమే
    కలతపడంగ నొప్పు గద గాంధి జనించిన యిద్దినంబునన్!

    రిప్లయితొలగించండి
  3. సమస్య :

    కలతపడంగ నొప్పు గద
    గాంధి జనించిన యిద్దినంబునన్

    ( నాటి గాంధీజయంతికి నేటి గాంధీజయంతికి
    ఎంత వ్యత్యాసం ! )

    కులమత సర్పముల్ బుసలు
    కొట్టుచునుండె దురాగ్రహంబునన్ ;
    లలనల మానభంగములు
    లావగుచుందెను రోజురోజుకున్ ;
    జెలువగు దేశభక్తి మరి
    చేరదు పౌరహృదంతరంబులన్ ;
    కలతపడంగ నొప్పు గద !
    గాంధి జనించిన యిద్దినంబునన్ .

    రిప్లయితొలగించండి
  4. యువకు లందరు దేశపు యోధులగుచు
    ప్రగతి కై పాటు పడుచు పలికి రిట్లు
    గాంధి పుట్టిన దినమని : కలత పడుము
    సమ సమాజము సృష్టింప శక్తి కొలది

    రిప్లయితొలగించండి
  5. నెలతవీధినిదిరుగనునేరమగును
    కులములేదనిఁజెప్పినకూడులేదు
    సత్యవాక్కునకీభూమిచాలదవ్వు
    గాంధిపుట్టినదినమనికలతపడుము

    రిప్లయితొలగించండి
  6. కులమనుగజ్జిజీవులకుకూర్చుచుదుర్మదగంధమలందుచున్
    కలకనుకంటిపాపలనుకాదనుతీరునసంచరించుచున్
    పులుముచునాభిజాత్యమునుపోందికలేకనుభేదమెంచగా
    కలతపడంగనోప్పుగదగాంధిజనించినయిద్దినంబునన్

    రిప్లయితొలగించండి

  7. పిలువగ సంగడీడొకడు పెండ్లి దినమ్మని యామతింపుకై
    లలనను వెంటతీసుకొని రంజనమందుచు నేగనేమిరా
    పలలము కాపిశాయనపు వడ్డన నేడు నిషిద్దమంచనన్
    కలత పడంగ నొప్పు గద గాంధి జనించిన యిద్దినంబునన్.

    రిప్లయితొలగించండి
  8. క్రొవ్విడి వెంకట రాజారావు:
    శాంతి నీయని క్రియలను సలుపు చుండి
    నిజము నెంచక నేగుచు నిరతమంత
    మద్యమును పీల్చునట్టి యో మనిషి! నేడు
    గాంధి పుట్టిన దినమని కలత బడుము.

    రిప్లయితొలగించండి
  9. గాంధీ మహాత్ముని ఆశయము రామరాజ్యము. ఎన్నికల వేళ అన్ని రాజకీయ పక్షములు రామరాజ్య స్థాపన కు వాగ్దానము చేస్తాయి. గెలిచిన తరువాత మాట మారుస్తాయి. ఇదే అంశమై నా ప్రయత్నము:

    చం:

    పలుకుదురెల్ల పక్షములు భారత దేశము రామరాజ్యమై
    వెలుగును తాము గెల్వగనె వేగమె జూడు మటంచు, నేతలే
    గెలిచిన మారు బల్కుచును గేలి ప్రసంగము జేయుచుండనై
    కలత పడంగ నొప్పు గద గాంధి జనించిన యిద్దినంబునన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  10. లలనలు రాత్రివేళలను రక్షణగోరకె సంచరించగా
    తలచగ నొప్పునౌ నిజ స్వతంత్ర్యము చేకురెనంచు బల్కగా
    నలుగగ రేబవళ్ళనక నాతులు క్రూరమృగాళి చేతిలో
    కలత పడంగ నొప్పుగద గాంధి జనించిన యిద్దినంబునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేటి యువత మాట

      మందు లేనట్టి విందది మాకు పడదు
      చిందు లేయని క్లబ్బులు చెల్లబోవు
      బందు సేయగ విందులు బారు లిపుడు
      గాంధి పుట్టిన దినమని కలత పడుము

      తొలగించండి
  11. నెయ్యుని బిలిచితివి నేడు నిఘసమునకు
    మాంసమును తొలుతనె గొన మరచితివిగ
    పురమునందు నాయంగడి మూసియుండు
    గాంధి పుట్టిన దినమని , కలతపడుము

    రిప్లయితొలగించండి
  12. చెలఁగుచు వీధి కొక్కటిగ సీధువు లంగడు లుప్పతిల్లగా
    నలవడి మంద భాగ్యు లపహాసము పాలయి వీధినిన్ బడన్
    నెలతలు దుఃఖ మందు నిక నీల్గుచు వేసరి మూగ బోవగన్
    గలతపడంగ నొప్పు గద గాంధి జనించిన యిద్దినంబునన్

    రిప్లయితొలగించండి
  13. పొలయుచు నుండె హింసలును
    బూలసమానపు టాడ పిల్లలున్
    విలవిల లాడినన్ వినక ప్రీత్యణు
    మాత్రము లేక వారలన్
    నలుపుచునుండ్రి నీచులు వినా
    దయ, క్రూర వికార చిత్తులై
    కలతపడంగ నొప్పుగద గాంధి జ
    నించిన యిద్దినంబునన్

    రిప్లయితొలగించండి
  14. చంపకమాల:
    మొలనొక నూలుపంచె మది ముప్పురి గొన్న స్వదేశ భక్తి ని
    ర్మలమగు శాంతచిత్తము విరామమెఱుంగని కార్య దక్షతన్
    సలిపిన పోరుపుణ్యమది సత్ఫలమందని నేటి దుస్థితిన్
    ”“కలతపడంగ నొప్పు గద గాంధి జనించిన యిద్దినంబునన్”
    --కటకం వేంకటరామశర్మ.

    రిప్లయితొలగించండి
  15. సంత సించును భారత జాతి యంత
    గాంధి పుట్టిన దినమని; కలతపడుము
    దినదినము మన దేశంపు జనము సత్య,
    శాంతములకు దూరంబుగ జరిగి నపుడు

    రిప్లయితొలగించండి
  16. శలవు ననుభవింతుమనిన వలను పడదు
    సురను సేవింతు మనుకొన్న దొరకదాయె
    మాంస భక్ష్యమ్ముల కొరకై మధన పడుము
    గాంధి పుట్టిన దినమని కలతపడుము

    రిప్లయితొలగించండి
  17. భరతమాతకు దాస్యము బాపినట్టి
    జాతిపిత జన్మదినమున నీతివీడి
    దొంగచాటుగ మద్యమ్ము దొరగుచుండ
    “గాంధి పుట్టిన దినమని కలతపడుము”

    రిప్లయితొలగించండి
  18. పలుజగడమ్ములెంచి పరపాలన నంతముజేయ దీక్షతో
    విలువలు లేని నాయకులు పెత్తనమున్ గొని యేలు చుండగా
    ఫలముల పొంద లేక ప్రజ బాధలు పొంద స్వతంత్ర దేశమున్
    కలతపడంగ నొప్పు గద గాంధి జనించిన యిద్దినంబునన్

    రిప్లయితొలగించండి
  19. జాతిపిత కలగనె నాడు సామ్య వాద
    నిలయ రామరాజ్యమగుచు నిలుచు ననుచు
    నాటి కేదనె కవి మరో నాడు; నేడు
    గాంధి పుట్టిన దినమని కలత పడుము

    (1971 లో సినీ కవి శ్రీ ఆరుద్ర గారిచే రచింపబడి యిప్పటికీ బదులు లేని ప్రశ్నగా మిగిలిన " గాంధి పుట్టిన దేశమా యిది..." పాట నేపథ్యంలో చేసిన పూరణ)

    రిప్లయితొలగించండి
  20. పంచి పెట్టితిని మిఠాయి బంధువులకు
    గాంధి పుట్టినదినమని ,కలత పడుము
    గాడ్సె! చంపినం దులకును గాంధినిసుమి
    మనిషి మనిషిని జంపుట కనగ గలమె?

    రిప్లయితొలగించండి
  21. కలవరమొందె మానసము గాంచ నరాచకమెల్ల తావులన్
    కలలవి కల్లలాయె, మనగాంధి మహాత్ముని యాశయంబులే
    వెలవెలబోయె, కల్కము వివేక విహీనత నివ్వటిల్లగన్
    కలతపడంగ నొప్పు గద గాంధి జనించిన యిద్దినంబునన్

    రిప్లయితొలగించండి
  22. వెలితి మహాత్ముడా నిరతి
    వెత్కినదొర్కదుమానవత్వమే
    కలిసెయధర్మదుర్మతుల
    కాశ్రమమిచ్చిసమాజమందునే
    కలితిసృజించి నూనె లటు
    కారము పప్పులునుప్పులన్నియున్
    కలతపడంగనొప్పు గద
    గాంధి జనించినయిద్దినంబునన్
    ...తోకల...

    రిప్లయితొలగించండి
  23. కారఁ దొలఁగింప నెద మమకార మూని
    కరము తనవారి పైన ముష్కురుల కకట
    నిరతి గద్దె నిడి పలికి నేటి గాంధి
    గాంధి పుట్టిన దినమని కలఁతపడుము


    కలవర మేల నిక్క మిది గాంధి మహాత్మఁడు సత్య సంధుఁడే
    యిల నట “సత్యమేవ జయ తీతి” యనంగ నొకింత మార్చిరే
    యిలనె “యసత్య మేవ జయ తీతి” యనంగను నేత లక్కటా
    కలఁతపడంగ నొప్పు గద గాంధి జనించిన యిద్దినంబునన్

    రిప్లయితొలగించండి
  24. అలుపు నొకింతలేకయునునాంగ్లుల బాఱగజేసి మాత వే
    కలలనుసార్ధకమ్ముగను గానగజేసిన గాంధి చావుకున్
    గలతపడంగ నొప్పుకద గాంధిజనించిన యిద్దినంబునన్
    నెలతలు బండితుల్ జనులు నెమ్మిని నంజలినీయ యొప్పగున్

    రిప్లయితొలగించండి
  25. కులమత భేద భావముల గూల్చి రగిల్చి స్వతంత్ర భావనన్
    తిలకు పటేలు గాంధి పరదేశపు పాలన రూపుమాపినన్
    కలలను వమ్ము జేసి జన కంటకులై జను నేతలన్ గనన్
    కలతపడంగ నొప్పు గద గాంధి జనించిన యిద్దినంబునన్

    రిప్లయితొలగించండి
  26. తేటగీతి
    భారతావనిన మత వివాదములు, కు
    లాల ఘర్షణలు పెరిగి లజ్జితమ్ము
    కాగ, లౌకిక వాదులు గాసి ననిరి
    గాంధి పుట్టిన దినమని కలత పడుము
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్

    రిప్లయితొలగించండి