7, అక్టోబర్ 2021, గురువారం

సమస్య - 3865

8-10-2021 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బాలవ్యాకరణముఁ జదువన్ దోషమగున్”
(లేదా...)
“బాలవ్యాకరణంబునున్ జదివినన్ బాండిత్యమే లుప్తమౌ”

31 కామెంట్‌లు:


 1. ఏలర తెలుగది యక్కర
  యేలేని చదువని యెరుగు మింగ్లీషొకటే
  మేలును గూర్చునటంచన
  బాలవ్యాకరణము జదవన్ దోషమగున్.

  రిప్లయితొలగించు
 2. మేలగు రచనలు వచ్చుఁను
  బాల వ్యాకరణము చదువన్ : దోష మగున్
  బేలవ మై చదువరులవ
  హేళన కున్ గురి యగునని యెరుగగ వలయున్

  రిప్లయితొలగించు
 3. కాల గతిని బాషల
  గాలము పెనవేసె తెలుగు గాసట బిసటై
  చాలు విమర్శల పెనుగుట
  "బాలవ్యకరణముఁ జదువన్ దోషమగున్"

  రిప్లయితొలగించు
 4. వీలగు కైతలు వ్రాయగ
  బాలవ్యాకరణముఁ జదువన్ ; దోషమగున్
  మేలుగ సంధుల సలుపక
  ఆలిఖితము జేసి శంకరార్యుల కంపన్

  రిప్లయితొలగించు
 5. నాబోంట్లకు

  హేలగ పద్యము వ్రాయగ
  తేలిక పద్ధతులనెంచి తెలియక రీతిన్
  చాలీచాలని బుద్ధిని
  బాలవ్యాకరణము జదువన్ దోషమగున్

  చదవేస్తే ఉన్నమతి పోయిందట ( నా బోంట్లకు)

  చాలించంగను వృత్తిబాధ్యతల విశ్రాంతుండునై ప్రీతిగన్
  కాలక్షేపముజేయగా దగిన సత్కార్యంబుగా నెంచుచున్
  శ్రీలంగూర్చెడు పద్యసూనములచే శ్రీభారతిన్ గొల్వగా
  నేలాగైనను నేర్వగావలయునన్ నిచ్ఛాళువై మందుడై
  బాలవ్యాకరణమ్మునున్ జదువినన్ బాండిత్యమే లుప్తమౌ

  రిప్లయితొలగించు
 6. క్రొవ్విడి వెంకట రాజారావు:

  వీలుగ నాంగ్లపు భాషను
  వాలకముగ నభ్యసించు వారల కెపుడున్
  తేలికగా నెఱుకపడని
  బాలవ్యాకరణము జదువన్ దోషమగున్.

  రిప్లయితొలగించు
 7. బాలురు పండితులౌదురు
  బాలవ్యాకరణముఁ జదువన్, దోషమగున్
  మేలొనరించనియాటల
  కాలము యాంత్రిక ముగవృధ గాగడపినచో

  రిప్లయితొలగించు
 8. శా:

  కాలాతీతము నయ్యె విద్య బడయన్ కాలాను సారమ్ము గా
  నాలోచింపగ రీతి నెట్టులగుచో నానంద ముప్పొంగగా
  చాలా కాలము వేచి చూచి విధిగా ఛాత్రుండ నైయెప్ప నే
  బాలవ్యాకరణంబునున్ జదివినన్ బాండిత్యమే లుప్త మౌ ?

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించు

 9. చాలున్ వ్యర్థపు మాటలింక నిది విశ్వంబందు మాటాడరీ
  నేలన్ మాత్రమె యొప్పు తెల్గనుచునా నీచుండు తా పల్కుచున్
  గాలంబెంతయొ మారెగాదె యిక యాంగ్లంబొక్కటే నేర్వుమా
  బాలవ్యాకరణంబునున్ జదివినన్ బాండిత్యమే లుప్తమౌ.

  రిప్లయితొలగించు
 10. కాలంబేగతి మారిపోయినది పోగాలంబు దాపించెనా
  వేలంవెర్రిగ నింగిలీసు చదువే విజ్ఞాన దాయందురా
  బాలవ్యాకరణంబునున్ జదివినన్ బాండిత్యమే లుప్తమౌ
  లీలన్ బల్కగ పాడియౌన? జనులీరీతిన్ బ్రచారింతురా?

  రిప్లయితొలగించు
 11. వీలుగ  'రెన్ యండ్ మార్టిన్'
  ఆలన పాలన విడిచిన యాంగ్లము నేర్వన్
  మేలగు తెలుగును విడువగ
  బాలవ్యాకరణముఁ జదువన్ దోషమగున్

  (ఆంగ్ల భాష వ్యాకరణానికి 'Wren and Martin' ప్రామాణిక గ్రంధము)

  రిప్లయితొలగించు
 12. మూలము తెలుంగు ప్రజలకు
  బాలవ్యాకరణముఁ ; జదువన్ దోషమగున్
  మలినములగు దుష్టపు రచ
  నలు,వీని బరితెగినమ్మ నైతికమగునా?

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మూడు నాలుగు పాదములు కూడా గురువుతో మొదలవ్వాలి.సవరించండి. అసనారె

   తొలగించు
  2. ఇలా సరి చేశానండీ ధన్యవాదాలు!

   మూలము తెలుంగు ప్రజలకు
   బాలవ్యాకరణముఁ ; జదువన్ దోషమగున్
   మాలిన్యంబౌ రాతలు,
   వీలున జదువంగ వలయు వేల్పుల కథలన్

   తొలగించు
 13. క్రొవ్విడి వెంకట రాజారావు:

  వీలుంగూడిన రీతి నాంగ్లమును సంప్రీతిన్ సదా నేర్చుచున్
  ఆలాపమ్ముల నాడుచుండి చను విద్యార్థుల్ కఠోరమ్మునై
  సౌలభ్యంబుగ నేర్వరాని కరణిన్ శబ్దంబులన్ నించునౌ
  బాలవ్యాకరణమ్మునున్ జదివినన్ బాండిత్యమే లుప్తమౌ

  రిప్లయితొలగించు
 14. చాలనుచు మాని యక్షర
  మాలను సరిగా నెరుగక మందస్మితుడై
  బాలుడు పొత్తము జేకొని
  బాలవ్యాకరణముఁ జదువన్ దోషమగున్

  రిప్లయితొలగించు
 15. చాలినభాషాసమకర
  వాలముచేతనుగలిగినపాండితియగునీ
  కాలముమాయాజాలము
  బాలవ్యాకరణముఁజదివినదోషమగున్

  రిప్లయితొలగించు
 16. ఏలానీమముదప్పుటన్నవతతానైపుణ్యవాగ్ధారలన్
  చాలీచాలనిపాండితీమహిమతోజాలంబులన్వేయుటల్

  మైలంబడ్డదిమాత్రుగర్భమదిగోమేసెన్గదాగడ్డినే
  బాలవ్యాకరణముఁజదువన్పాండిత్యమేలుప్తమౌ

  రిప్లయితొలగించు
 17. కందం
  తాలిమి నేర్చినవన్నియు
  మేలుగ మననమ్ము సేయ మింగుడు వడదే!
  పేలవపు జ్ఞాపకమ్మున
  బాలవ్యాకరణముఁ జదువన్ దోషమగున్

  శార్దూలవిక్రీడితము
  లీలామాత్ర ప్రవృత్తిఁ బద్యముల సంప్రీతంబుగన్ వ్రాయుచున్
  మేలన్ రీతిగఁ గంది వారలవియే మెచ్చంగ, జృంభింపఁగన్
  వాలాయమ్మని నేర్వ నొప్పుననఁగన్ పాఠాంతరాల్లేనిదౌ
  బాలవ్యాకరణంబునున్ జదివినన్ బాండిత్యమే లుప్తమౌ!

  రిప్లయితొలగించు
 18. కందం
  చాలు తెలుగు ,తెలుగు జదువ
  చాలా దోషముగను అపచారము దలచే
  వేళన, పాఠ్యాంశములుగ
  బాలవ్యాకరణము జదువన్ దోషమగున్

  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటర్

  రిప్లయితొలగించు
 19. చాలీచాలని వేతనమ్ము గొనుచున్ సాగించు సంసారమున్
  వేళాపాళలు లేని కృత్యములతో వేదించు రాజ్యమ్ములో
  నేలాజీవనయానమంచు పరభాషే ముద్దుగాన్ శ్రోతకున్
  బాలవ్యాకరణంబునున్ జదివినన్ బాండిత్యమే లుప్తమౌ

  రిప్లయితొలగించు
 20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 21. స్థూలముసూక్ష్మములెఱుగక
  కాలముతోకలసిమెలసిఁగదులుచువసుధన్,
  మేలగుసూత్రములెంచక
  బాలవ్యాకరణముఁ జదువన్ దోషమగున్”

  కొరుప్రోలు రాధాకృష్ణ రావు

  రిప్లయితొలగించు
 22. కేలీ లీలను జదువుమ
  బాలా! యేలా భయమ్ము వడయఁగ నీకుం
  జాలుం జాలును నీ వన
  బాలవ్యాకరణముఁ జదువన్ దోషమగున్

  (చదువన్ = చదువను)


  కాలం బెల్ల నిరర్థకం బగును దుష్కార్యంబ చింతింప దు
  శ్శీలుం జేరిన సజ్జ నోత్తముఁడు దుశ్శీలుండునౌ రీతినిన్
  హాలాహాల నిభంపుఁ గావ్యమును, వ్రాయన్ దానిఁ బాటింపకే
  బాలవ్యాకరణంబునున్, జదివినన్ బాండిత్యమే లుప్తమౌ

  రిప్లయితొలగించు
 23. మేలౌ పద్యములభ్యసించు కవికిన్ మేధస్సు పెంపొందునా
  బాలవ్యాకరణంబునున్ జదివినన్; బాండిత్యమే లుప్తమౌ
  గేలిన్ సేయుచు మూలసూత్రములనాక్షేపించి వాచాలతన్
  గీలింపంగ పదంబులెట్లు గనునంగీకారమా వ్రాఁతలే

  రిప్లయితొలగించు
 24. మేలగు భాషా ఙ్ఞానము
  బాలవ్యాకరణముఁ జదువన్, దోషమగున్
  హేలగ తమ భాష మరచి
  బాలురు పరభాషనెంచి పరవశమగుటన్.

  రిప్లయితొలగించు
 25. బాలా!యేమని యంటివి
  బాలవ్యాకరణము జదువ దోషమగున్ ?
  మేలగు నూతన రచనకు
  చాలుదువిల గవివతంస సరసన నుండన్

  రిప్లయితొలగించు
 26. ఏలీలన్ వచియింతు నా స్థితిని
  నే నీవేళ దుర్భాగ్యుడన్
  కాలాతీతము జర్గిపోయినది నా
  కాంక్షెట్లు సిద్ధించునో
  నేలన్ వీడియు సాము జేసినటులౌ
  నేనిప్డు భారంబుతో
  బాలా వ్యాకరణంబునున్ జదివినన్
  పాండిత్యమే లుప్తమౌ.

  రిప్లయితొలగించు
 27. బాలవ్యాకరణంబునున్ జదివినన్ బాడిత్యమే లుప్తమౌ
  బాలా!యేమని యంటివిప్పుడ,యహో పాండిత్యమే లుప్తమా
  బాలవ్యాకరణంబునున్ జదివినన్ బద్యాలదోషంబులే
  లీలన్ గానగరావు సుంతయుగనున్ లేలిహ్యమానంబుగా

  రిప్లయితొలగించు