15, అక్టోబర్ 2021, శుక్రవారం

సమస్య - 3872

16-10-2021 (వారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

"శాపమే వరమయ్యెఁ గష్టములఁ దీర్చె"
(లేదా...)
"శాపమ్మే వరమయ్యెఁ గష్టములు శశ్వత్సౌఖ్య మందించెలే"

20 కామెంట్‌లు:

 1. సమస్య :

  శాపమే వరమయ్యె గష్టముల దీర్చె

  ( ఊర్వశి కోపం వలన బృహన్నలగా మారిన
  అర్జునునికి అది అజ్ఞాతవాసాన వరమేగా )

  తేటగీతి
  ---------

  ఆపగాలేని తమకమ్మె యంతరింప
  పార్థు శపియించె " పేడివై బరగు " మనుచు
  ఊర్వశీకాంత తనదైన యొడలు మరచి ;
  శాపమే వరమయ్యె ; గష్టముల దీర్చె .

  రిప్లయితొలగించండి
 2. రహినిగోల్పడియతివయుఱాయియయ్యె
  రాముపాదముసోకగరామయయ్యె
  శాపమేవరమయ్యెకష్టములఁదీర్చె
  సతిగమన్నననందెగసాధనమున

  రిప్లయితొలగించండి

 3. అర్జునునిగాంచి మోహించి యప్సరసయె
  రతిని గోరుచు జేర తిరస్కరింప
  నూర్వశియె యాగ్రహించుచు నొసగినట్టి
  శాపమే వరమయ్యెఁ గష్టముల దీర్చె.

  రిప్లయితొలగించండి
 4. కోర్కె మన్నించ లేదని కోపమునను
  సవ్య సాచి కి నూర్వశి శాప మొసగె
  శాపమే వర మయ్యె గష్టములు దీర్చె
  పేడిగా మారి చేరెను విరటు గొల్వు

  రిప్లయితొలగించండి
 5. తాపంబున్ గొని రంభ జేర దరికిన్ దప్పంచు వారింపగా
  కోపంబూని శపించె గ్రీడినదియే గోప్యంబు జేగూర్చెగా
  రూపమ్మే గన మారె చోద్యముగ పార్థుండట్లు షండుండయెన్
  శాపమ్మే వరమయ్యెఁ గష్టములు శశ్వత్సౌఖ్య మందించెలే

  రిప్లయితొలగించండి
 6. కోపగత్తెయౌ ఊర్వశి శాపమిచ్చె
  గద కిరీటికి షండుడు గమ్మని విర
  టునికొలువు చొచ్చుట కదియే పనికివచ్చి
  శాపమే వరమయ్యెఁ గష్టములఁ దీర్చె

  రిప్లయితొలగించండి
 7. రూపంబందిరివిష్ణుసేవకులునారౌద్రంపునాలోకనన్
  తాపంబందిరిజన్మజన్మలనుతాదాత్మ్యంబుదైవంబెగా
  ఆపంజాలనిభేదభావములసోహమ్మంచుసాధించిరే
  శాపమ్మేవరమయ్యెఁగష్టములుశశ్వత్సౌఖ్యమందించెలే

  రిప్లయితొలగించండి
 8. భార్య నారడి పెట్టుచు ప్రతి దినమ్ము
  మగడు వ్యసనాల పాలయి మడిసినంత
  వాని యుద్యోగ మామెకు వచ్చి చేరె
  శాపమే వరమయ్యెఁ గష్టములఁ దీర్చె

  రిప్లయితొలగించండి
 9. రిప్లయిలు
  1. తేటగీతి
   ఊర్వశి, మరులు జూపించి యొప్పకున్నఁ
   గోప కారణమైనట్టి కురువరునట
   పండుడని తిట్ట నజ్ఞాత వాసమందు
   శాపమే వరమయ్యెఁ గష్టములఁ దీర్చె

   శార్దూలవిక్రీడితము
   కోపమ్మందుచు మానవాళి క్రియలన్ గోవిందుడే గూర్చెనో?
   కూపమ్మై గృహసీమతోచునటులన్ గూర్చన్ కరోనా భువిన్!
   దాపమ్మయ్యెను కష్టజీవులకు! విత్తంబుండు సోంబేరికిన్
   శాపమ్మే వరమయ్యెఁ గష్టములు శశ్వత్సౌఖ్య మందించెలే!

   తొలగించండి
 10. రిప్లయిలు
  1. కారు ఢీకొని పేదకు కాలు విరుగె
   తొలుత జదివిన రానియుద్యోగములను
   యవిటి తనమున సులువుగ నందు కొనియె
   శాపమే వరమయ్యెఁ గష్టములఁ దీర్చె

   తొలగించండి

 11. ఆ పార్థుండను గాంచి యూర్వశియె మోహంబందుచున్ జేరగా
  పాపంబియ్యది కూడదంచు నరుడే వాచించుచున్ గొమ్మనే
  తా పోనాడగ నాగ్రహించి యతనిన్ దన్వంగి నుగ్గించె నా
  శాపమ్మే వరమయ్యెఁ గష్టములు శశ్వత్సౌఖ్య మందించెలే

  రిప్లయితొలగించండి
 12. *సమస్య* :-
  "శాపమే వరమయ్యెఁ గష్టములఁ దీర్చె"

  *తే.గీ**
  భారతము వింతలెన్నియో పంచిపెట్టె
  శాపమొసగె నూర్వశి పార్థు షండుడనుచు
  శాపమే వరమయ్యెఁ గష్టములఁ దీర్చె
  విరటుని కొలువు జేరగ వీలుగూర్చె
  ......‌‌..........✍️ చక్రి

  రిప్లయితొలగించండి
 13. హైదరాబాద్ నగరంలో కొద్ది పాటి వర్షానికే లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురి కావడమూ (శాపము) అక్కడి ప్రజలు ప్రభుత్వానికి తమ కష్టాలు చెప్పడం, ఎంతో కొంత సాయం పొందడమనే విషయమై నా ఈ ప్రయత్నము:

  శా:

  లోపమ్మే నన నీటి ముంపు పురమున్ లోతైన పల్లమ్ము లై
  కాపాడంగను నీవె దిక్కనగనై గల్లంతు గాకుండు గా
  పాపంబంచని గూర్చ రూప్యముల నే భారంబు లెక్కింపకై
  శాపమ్మే వరమయ్యె గష్టములు శశ్వత్సౌఖ్య మందించెలే

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 1 వ పాదం లోపమ్మే యన ... & 3 వ పాదం లో లెక్కింపకే... అని చదువగలరు.

   తొలగించండి
 14. కన్నుమిన్ను గానక జేయు ఖర్చుజూసి
  దండ్రి పొదుపు జరుపమంచు తగునటులిడు
  శాపమే వరమయ్యెఁ , గష్టములఁ దీర్చె
  నెట్టి యదుపులేక విలువలెదుగుచుండ

  రిప్లయితొలగించండి
 15. ధర్మ మింపుగ రక్షించు ధర్మ మాచ
  రింపఁ ద్రికరణ శుద్ధిగఁ జంప కుండ
  నరున కజ్ఞాత వాసమునఁ బదిలముగ
  శాపమే వరమయ్యెఁ గష్టములఁ దీర్చె


  శాపగ్రస్తులు గూడ విష్ణు దయనున్ సాధింపఁగా యోగ్యులే
  యా పద్మాసను మాన సాత్మజులు వీరావేశులై యంతటం
  గోపింపన్ జయఁ డింక నా వి జయుఁడుం గూలంగ శాపాగ్నినిన్
  శాపమ్మే వరమయ్యెఁ గష్టములు శశ్వత్సౌఖ్య మందించెలే

  రిప్లయితొలగించండి
 16. పాపాత్ముండగు భర్త దుర్వ్యసనముల్ ప్రాజ్యమ్ములా వ్యక్తికిన్
  కోపావేశము మెండు మద్యమును తాగ్రోలంగనా మత్తులో
  కూపంబందునజారి ప్రాణముల కోల్పోయెన్ కటా! సాధ్వికిన్
  శాపమ్మే వరమయ్యెఁ గష్టములు శశ్వత్సౌఖ్య మందించెలే

  రిప్లయితొలగించండి