ఉ:భ్రష్ట విమర్శకుం డొకడు "వ్యర్థపు పాండితి కల్పవృక్ష, మా క్లిష్టసమాససృష్టి "యన క్లేశము జెంది వచించి నాడ సు స్పష్టత,క్లుప్తతల్ గలుగ భావసమృద్ధిగ బద్య మొప్పగా దోషము గాదు కావ్యమున దుష్ట!సమాసము లెక్కువైనచో (విశ్వనాథ వారి రామాయణకల్పవృక్షం లో వ్యర్థ పాండిత్యం క్లిష్టసమాసాలు ఉన్నా యనే ఒక భ్రష్టవిమర్శకుని తో ఓ దుష్టుడా! అసలు సమాసాలు క్లుప్తత కోసమే వాడతారు.అనేక పదాలు వాడే బదులు సమాసం చేస్తే క్లుప్తత వస్తుంది అన్నట్లు.)
కందం
రిప్లయితొలగించండిదృష్టిని వ్యాకరణమ్మున
స్పష్టముగ నిలిపి లిఖింప సత్పండితులున్
పుష్టి నలంకృతులను ని
ర్దుష్టసమాసములు గృతిని దోష మెటులగున్?
ఉత్పలమాల
తొలగించండిభూషణమౌను కావ్యమదె పొందిక వ్యాకరణాది లక్షణాల్
పోషణ నిచ్చి వెల్గినను మోదము గూర్చును పండితాళికిన్
ఘోష వలెన్ వినన్ జెవిని ఘూర్ణిలఁ జేయుననంగ నెంచ ని
ర్దోషము గాదు కావ్యమున దుష్టసమాసము లెక్కువైనచో!
ఉ.
రిప్లయితొలగించండిభూషము మాడ్కి శోభలను పూనిక నిచ్చు పద ప్రయోగముల్
భాషను పెక్కు కల్గు కన పచ్చని కావ్యత కూర్ప వాడినన్
దోషము కాదు కావ్యమున, దుష్ట సమాసము లెక్కువైనచో
తోషములీన చెల్లదది దుప్పుల వోలె బుధాళి కుమ్ముగా !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఇష్టముగ శిష్యుల కొరకు
రిప్లయితొలగించండికష్టపడుచు వ్యాకరణపు గ్రంథము వ్రాయన్
దృష్టి నిలిపిన విభాగము
దుష్టసమాసములు , గృతిని దోష మెటులగున్
రిప్లయితొలగించండిశిష్ట జనారాధకులిల
యిష్టంబని చెప్పునట్టి యింపగు కృతిలో
పుష్టిగ గష్టంబగు ని
ర్దుష్టసమాసములు గృతిని దోష మెటులగున్.
భేషనరెవ్వరాతనిని విద్యలు నేర్వని మూర్ఖుడైన యా
వేషము గాంచినంత నొక విజ్ఞుని వోలెను కానవచ్చినన్
భాషనెఱుంగనట్టి కడు పామరు డిట్లనె తోటివారితో
దోషము గాదు కావ్యమున దుష్టసమాసము లెక్కువైనచో.
భేషనుచున్ నుతించుచు వివేకులు మెచ్చెడి తెన్గు పద్యమే
భూషణమౌ సమాసములు పుష్టిగ నుండిన శోభనిచ్చు, నా
భాషకు ప్రాణమై నిలుచు పద్యమునున్ పఠియించు వారకున్
దోషము గాదు కావ్యమున దుష్టసమాసము లెక్కువైనచో.
*(వారకు తోషముగాదు కావ్యమున.......)*
శిష్టులు కూర్చిన పదములు
రిప్లయితొలగించండిదుష్ట సమాసములయినను దోషరహితమౌ
స్పష్టమగు శబ్దములు ని
ర్దుష్టసమాసములు గృతిని దోష మెటులగున్
భూషణ రత్నదీపికలఁ బోలునటంచు వచించు చుందురే
తోషము గూర్చునట్టివగు దుష్టసమాసము లేర్చి కూర్చినన్
దోషము గాదు కావ్యమున; దుష్టసమాసము లెక్కువైనచో
భీషణమౌను కావ్యమని విశ్వసనీయులు తెల్పుచుందురే
యోషకు స్వర్ణహారములు యుక్తము లౌచును పెంచు శోభనున్
రిప్లయితొలగించండిభాషకు చక్కనైన పదబంధము లందము గూర్చు నెప్పుడున్
దోషముకాదు కావ్యమున,దుష్టసమాసము లెక్కువైన సం
తోషము కూర్చబోవవియు దూషణకున్ గురియౌచు నుండుగా
స్పష్టపు ట ర్థ ము నిచ్చు చు
రిప్లయితొలగించండిపుష్టిని చేకూర్చు నట్టి పొంకపు పదము ల్
సృష్టి o చి రచించిన ని
ర్డు ష్ట సమాస ములు గృతిని దో ష మెటు లగు న్?
శిష్టమ్మగు రీతిని ని
రిప్లయితొలగించండిర్దుష్టమ్మగు వ్యాకరణము దోషరహితమై
స్పష్టత గూర్చ నలఁతియౌ
దుష్టసమాసములు గృతిని దోష మెటులగున్
తోషముగూర్చు సత్కవులు దుష్టసమాసములన్ త్యజించి ని
రిప్లయితొలగించండిర్దోషముగా సుధల్జిలుకు తోరపు కావ్యములన్ రచింప సం
భాషణలందునన్ మరియు వర్ణనలం దలబోయ రెన్నడున్
దోషము గాదు కావ్యమున దుష్టసమాసము లెక్కువైనచో
ఉ.మా.
రిప్లయితొలగించండిభేషజమందు ధారగను విత్తము పంచగ నాజ్ఞ లిచ్చుచోఁ
బోషకులైన పెద్దలను ముంచి పొగడ్తల వ్రాయ, వారికిన్
దోషము నిచ్చు యత్నమున దొర్లగఁజేయఁ-బఠించువారికిన్
*దోషముగాదు కావ్యమున దుష్టసమాసములెక్కువైనచో.*
కం:స్పష్టముగ వచనకవి యనె
రిప్లయితొలగించండిస్పష్టముగా ప్రజ లెరుంగు భాషయె ఘనమౌ
కష్ట మనక ప్రజ వాడెడు
దుష్టసమాసములు గృతిని దోష మెటులగున్”
(ప్రజలు దుష్టసమాసాలు వాడుతున్నారు.వచనకవిత్వం రాసేటప్పుడు ప్రజలు మాట్లాడేది రాస్తే తప్పేమిటి?అని.)
ఉ:భ్రష్ట విమర్శకుం డొకడు "వ్యర్థపు పాండితి కల్పవృక్ష, మా
రిప్లయితొలగించండిక్లిష్టసమాససృష్టి "యన క్లేశము జెంది వచించి నాడ సు
స్పష్టత,క్లుప్తతల్ గలుగ భావసమృద్ధిగ బద్య మొప్పగా
దోషము గాదు కావ్యమున దుష్ట!సమాసము లెక్కువైనచో
(విశ్వనాథ వారి రామాయణకల్పవృక్షం లో వ్యర్థ పాండిత్యం క్లిష్టసమాసాలు ఉన్నా యనే ఒక భ్రష్టవిమర్శకుని తో ఓ దుష్టుడా! అసలు సమాసాలు క్లుప్తత కోసమే వాడతారు.అనేక పదాలు వాడే బదులు సమాసం చేస్తే క్లుప్తత వస్తుంది అన్నట్లు.)
కష్టము కవికిఁ గలిగిన న
రిప్లయితొలగించండిభీష్టము సిద్ధించుఁ బిదప హృద్యమ్ములు గా
నిష్టమ్మున దూరీకృత
దుష్టసమాసములు కృతిని దోష మెటు లగున్
ద్వేషము రేఁగ డెందమున భీతి యొకింత వహింప కివ్విధిన్
రోషము తోడఁ బల్కెదవు క్రూరత దూఱుచుఁ గృత్య వృత్తులన్
భాషకు భూష లౌను నుత పండిత కోటి కొసంగు హర్షమున్
దోషము గాదు కావ్యమున, దుష్ట! సమాసము లెక్కువైనచో
సమస్య:
రిప్లయితొలగించండి“దోషము గాదు కావ్యమున దుష్టసమాసము లెక్కువైనచో”
ఉ.మా :
రోషము లేని రాజులును, రోసిలి పద్యము నేర్వరే కవుల్
దూషణ చేసి పెంచు తలి దూరును బిడ్డల క్షేమమెంచియే
పోషణలోన తొట్రుపడు, పోడిమి పద్యములందు తప్పవే
దోషము గాదు కావ్యమున దుష్టసమాసము లెక్కువైనచో”
కష్టమె యైననుకవివరు
రిప్లయితొలగించండిలిష్టముతోనేర్చుకొనుచు నిమ్ముగ నెంతో
స్పష్టతతో వ్రాయగని
ర్దుష్టసమాసములు గృతిని దోషమెటులగున్
భాషను గౌరవించుచును పండితు లొప్పుగ దెల్పిరీవిధిన్
ఘోషణచేయుచున్నిటులకూర్చుచు నన్యపదమ్ములొక్కొచో
*“దోషము గాదు, కావ్యమున దుష్టసమాసము లెక్కువైనచో”*
భూషయుకాదటండ్రుగద బుద్ధియు చెప్పెడు యొజ్జలుర్విలో
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
ఇష్టముతో నేర్చుకొనుచు
కష్టమె యైనను కవులిల కావ్యములందున్
స్పష్టముగా వ్రాయగ ని
ర్దుష్ట సమాసములు గృతిని దోషమెటులగున్?